Begin typing your search above and press return to search.
గేదె దాని దూడ హీరోని తరిమితరిమి పొడిచాయి!
By: Tupaki Desk | 2 May 2022 3:45 AM GMTఒక గేదె దాని దూడ తరుముకెళ్లి మరీ ఒక హీరోని డైరెక్టర్ ని పొడిచేస్తే ఎలా ఉంటుందో ఊహించండి. మూగ ప్రాణులకు ఏం తెలుసు? అతడు హీరో గారు అని.. డైరెక్టర్ సారు అని! అందుకేనేమో మోర విడిచి వెంటపడి తరుముతూ కొమ్ములతో పొడిచేందుకు ఆ తల్లీ కూతుళ్లు.. (గేదె- దూడ) ఆరాటపడ్డాయట. షాకింగ్ గా ఈ ఘటనలో చావుతప్పి కన్ను లొట్ట పోయి ఆ ఇద్దరూ బయటపడ్డారు.. అది వేరే సంగతి. ఇంతకీ ఇలాంటి భయానక అనుభవం ఎదుర్కొన్న హీరో గారు ఎవరు? డైరెక్టర్ గారు ఎవరు? అంటే.. బాలీవుడ్ ప్రముఖ నటుడు కీ.శే ఇర్ఫాన్ ఖాన్.. అతడి దర్శకుడు అనూప్ సింగ్ లకు ఈ అనుభవం ఎదురైంది.
రెండేళ్ల క్రితం 2020 ఏప్రిల్ 29 అనారోగ్యంతో కన్నుమూసిన ఇర్ఫాన్ ఖాన్ తన కెరీర్ లో అనేక చిరస్మరణీయ విజయాల్ని తన ఖాతాలో వేసుకున్నారు. అయినప్పటికీ చాలా మంది సినీ ప్రేక్షకులకు అనూప్ సింగ్ తెరకెక్కించిన `క్విస్సా` (2015)లో ఇర్ఫాన్ కెరీర్ లో నటన పరంగా అతని ఉత్తమమైన వాటిలో ఒకటి అని భావిస్తారు. ఇర్ఫాన్ ఖాన్ కూడా ప్రతిభావంతులైన దర్శకుడితో కలిసి పనిచేయడాన్ని ఎంతో ఆస్వాధిస్తారట. ఆ ఇద్దరూ మళ్లీ ది సాంగ్ ఆఫ్ ది స్కార్పియన్స్ (2017) కోసం కలిసి పనిచేశారు. ఈ చిత్రం రాజస్థాన్ లోని శుష్క ప్రాంతంలో చిత్రీకరించారు. ఈ చిత్రం షూటింగ్ సమయంలో ఇర్ఫాన్ కి అతడి దర్శకుడికి ప్రమాదకరమైన అనుభవం ఎదురైంది. అనూప్ సింగ్ ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన తన పుస్తకం `ఇర్ఫాన్: డైలాగ్స్ విత్ ది విండ్` లో ఈ అంశాన్ని వెల్లడించారు.
రాజస్థాన్- జైసల్మేర్ శివార్లలో ఇర్ఫాన్ ఖాన్ పై గేదె దాడి చేసిందని ఆ పుస్తకంలో రాసాడు. ఇర్ఫాన్ ఖాన్ తో తాను చిత్రీకరిస్తున్న సన్నివేశం అనుకున్న విధంగా ఔట్ పుట్ రాలేదని అనూప్ సింగ్ రాశాడు. ప్యాక్-అప్ తర్వాత అతను ఇర్ఫాన్ తో కలిసి జైసల్మేర్ లోని వారి హోటల్ కి తిరిగి వస్తున్నారు. అయితే అనూప్ కాస్త ఆవేదనను తగ్గించుకునేందుకు అలా బీచ్ ఇసుక దిబ్బల వైపు వెళ్లమని డ్రైవర్ కు చెప్పాడు. వారు ఒక టీ దుకాణాన్ని చూసి అక్కడే ఆగిపోయారు. వాళ్ళు అక్కడ కూర్చుని టీ తాగుతూ గ్లూకోజ్ బిస్కెట్లు తింటుండగా ఒక గేదె దాని దూడ వారి వైపు నడవడం ప్రారంభించాయి. వాటికి సరైన తిండి లేదు. పోషకాహార లోపం వల్ల వాటికి తీవ్రంగా ఆకలి వేసిందట. ఇర్ఫాన్ ఖాన్ సూచన మేరకు అనూప్ సింగ్ ఆ మూగజీవాలకు బిస్కెట్లు తినిపించాడు. అవి రెండూ చెవులు రిక్కిస్తూ ఆత్రంగా బిస్కెట్లు తిన్నాయి.
వాటి కోసం దుకాణం నుండి మరిన్ని బిస్కెట్లు కొనమని అనూప్ ను ప్రేరేపించాయి. అయితే ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. గేదె కాస్త దూకుడుగా కనిపించింది. ఇది రెండు సార్లు అనూప్ ఉన్న చోటికి ప్రవేశించేందుకు ప్రయత్నించింది. రెండోసారి గేదె దాడి చేయడంతో అనూప్ ఛాతికి గాయమైంది. మూడవసారి దాడి చేసింది. నా శరీరం గుండా జాల్ట్ పడడంతో కన్నీరొచ్చిందని అన్నాడు..ఆ గేదె పోటుకు నా తల ముందుకు సాగిపోయింది.. నా ఎడమ చెంప ఎముక పగులగొట్టింది. ఒక క్షణం నా కన్ను బయటకు వచ్చినట్లు అనిపించింది.
సన్నివేశం తాడేగా ఉందని గ్రహించిన ఇర్ఫాన్ ఖాన్ టీ దుకాణం నుంచి పారిపోవాలని సలహా ఇచ్చాడు. అక్కడ తక్కువ ఎత్తు ఉన్న సరిహద్దు గోడపై పైకి ఎక్కి దూకమని అనూప్ సింగ్ కి సలహా ఇచ్చాడు. ఇర్ఫాన్ ఖాన్ మోకాళ్లపై చేతులపై కింద పడి నడుస్తూ.. వస్తుంటే ఆ గేదె అతనిపై కూడా దాడి చేసింది. ఇర్ఫాన్ కూడా గోడ దూకాడు. వెంటాడిన గేదె గోద దూకలేకపోయింది. వారిని చేరుకోలేకపోయింది. అలా ఆ ఇద్దరూ బయటపడ్డారు.
అనూప్ సింగ్ వద్ద ఇంకా కొన్ని బిస్కెట్లు మిగిలి ఉండగా.. భయంతో అతను వాటిని వీలైనంత వరకు గేదె ముందుకు విసిరాడు. గేదె వెంటనే బిస్కెట్ల వైపు పరుగెత్తింది. ఇర్ఫాన్ అరచేతులపై కొన్ని గీరుకుపోయిన గీతలు పడ్డాయి. అతని ఛాతీ గాయాలతో బొబ్బలెక్కిందని అనూప్ సింగ్ తెలిపాడు. గేదె అప్పటికి బిస్కెట్లు పూర్తి చేసి గోడ ముందుకి తిరిగి వచ్చిందట. అప్పటికే ఆ గోడ వెనుక ఇర్ఫాన్ ఖాన్ - అనూప్ సింగ్ దాక్కున్నారు. ఇలాంటి జీవన్మరణ పరిస్థితుల్లో కూడా ఇర్ఫాన్ లో హాస్యం చెక్కుచెదరలేదని అనూప్ సింగ్ పుస్తకంలో వివరించాడు. ఇర్ఫాన్ ఎద్దుతో మాట్లాడటం ప్రారంభించాడు.. ``భాయ్,.. ఆప్కో జరా సోచ్నా చాహియే. అగర్ ఆప్కో కోయి కుచ్ ఖిలా రహా థా,.. తో క్యా జరూరత్ హై ఉస్కీ హద్దియన్ తోడ్నే కీ`` అంటూ మాట్లాడాడు. “ఆప్ హుమేన్ అబ్ జానే దోగే కి నహీనా?” అని గేదెను అడిగాడట.
అనూప్ సింగ్ తన వద్ద డ్రైవర్ ఫోన్ నంబర్ ఉందని ఇర్ఫాన్ అప్పుడు గుర్తు చేశాడు. అతను త్వరగా డ్రైవర్ కు ఫోన్ చేసి ఎద్దు నుండి వారు దాక్కున్న ప్రదేశానికి రమ్మని చెప్పాడు. డ్రైవర్ వచ్చి వారి కోసం వెనుక తలుపు తెరిచారు. ఇద్దరూ వెంటనే కారులోకి జంప్ చేసి వేగంగా వెళ్లిపోయారు. కారులో ఇర్ఫాన్ అనూప్ సింగ్ తో చాలా జోకులు వేసి భయం పోగొట్టాడట. ఈ క్రేజీ అనుభవం ఇర్ఫాన్ ఖాన్ కి తనకు ఎదురైందని పుస్తకంలో అనూప్ పేర్కొన్నాడు. ఇర్ఫాన్ ఖాన్ లాంటి ప్రతిభావంతుడి ఆకస్మిక మరణం అభిమానులను కలచివేసింది. అతడు లేని లోటు బాలీవుడ్ కి అలానే ఉంది. ఇర్ఫాన్ తెలుగులో మహేష్ నటించిన సైనికుడులో నటించాడు.