Begin typing your search above and press return to search.

కంగనాను కిడ్నాప్ చేసి.. దీపికతో డేటింగ్‌

By:  Tupaki Desk   |   2 Aug 2016 11:42 AM GMT
కంగనాను కిడ్నాప్ చేసి.. దీపికతో డేటింగ్‌
X
బాలీవుడ్ యాక్టర్లను ఏదైనా గమ్మత్తుగా అడిగారనుకోండి.. ఇక వారిచ్చే సమాధానాలతో మనల్ని దంచేస్తారు అంతే. 'మదారి' అనే సినిమాకు మాంచి రెస్పాన్స్ రావడంతో ఊపు మీదున్న హీరో ఇర్ఫాన్‌ ఖాన్‌.. ఇప్పుడు ఓ సంచలనాత్మకమైన ఆన్సర్ ఇచ్చాడు. మీకు బాలీవుడ్ లో ఎవరినైనా కిడ్నాప్ చేయాలనుందా? ఒకవేళ డేటింగ్ అంటే ఎవరితో చేస్తారు అని అడిగితే.. మనోడు టాప్ లేపేసే ఆన్సర్లు ఇచ్చాడులే.

ఓ టీవీ ఛానెల్‌ జరిపిన ఇంటర్యూలో ఇర్ఫాన్‌ తనదైన శైలిలో ఎప్పుడూ గొడవలతో వార్తల్లో నిలిచే దీపిక - కంగనాలపై సరదా వ్యాఖ్యలు చేశాడు. ఎవరిని కిడ్నాప్‌ చేస్తారు.. అన్న ప్రశ్నకు.. కంగనా రనౌత్ అని టక్కున చెప్పాడు. ఆమెను కిడ్నాప్ చేసి.. తనకు నచ్చిన పాత్రలను ఆమెతో చేయించుకుంటాడట. ఎవరితో డేటింగ్ చేస్తారు అంటే దీపికా పదుకొనె అన్నాడు. చెప్పాలంటే బాలీవుడ్‌ లో ఇద్దరితో కలిసి పనిచేయాలని ఉంది అంటూ తన కోరికను వెల్లిబూర్చాడులే. ఇప్పటికే దీపికతో పీకూ సినిమాలో మనోడు చేసిన పెర్ఫామెన్స్ కు క్రిటిక్స్ సైతం మెచ్చుకున్నారు.

కంగనా రనౌత్ ను కిడ్నాప్ చేసి యాక్టింగ్ చేయించుకుంటాను అన్నారు.. అది ఓకె. కాని మాష్టరూ.. దీపికతో డేటింగ్ అంటేనే.. అక్కడ రణవీర్ సింగ్ ఫీలైతాడు. మరో బాలీవుడ్ స్టార్ కపుల్ బ్రేకప్ అంటే మేం చూడలేం సారూ!!