Begin typing your search above and press return to search.

ఎఫ్ బీ లైవ్ లో మాటలతోనే చంపేసిందిగా!

By:  Tupaki Desk   |   11 Nov 2016 7:30 PM GMT
ఎఫ్ బీ లైవ్ లో మాటలతోనే చంపేసిందిగా!
X
షార్ట్ ఫిలిమ్స్ తోను.. పలు మూవీస్ తోను ప్రేక్షకుల్లో మంచి గుర్తింపునే సంపాదించుకున్న శ్రావ్య రెడ్డికి.. సోషల్ మీడియాలో అభిమానులతో టచ్ లో ఉండడం అలవాటు. రీసెంట్ గా ఇజంలో కళ్యాణ్ రామ్ ఫ్రెండ్ గా నటించిన ఈమె.. అడపా దడపా లైవ్ ఛాట్ చేస్తూ.. ఫ్యాన్స్ లో విజ్ఞానం నింపేందుకు గాను పలు ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ను టచ్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయిన 500.. 1000 రూపాయల నోట్ల రద్దుపై ఉన్న అపోహలు.. ఆ కారణంగా ఏర్పడ్డ సమస్యలపై ఆన్సర్స్ ఇస్తానంటూ లైవ్ ఛాట్ స్టార్ట్ చేసిన శ్రావ్యరెడ్డిని.. ఓ ఫ్యాన్ అడిగిన ప్రశ్న ఇరిటేట్ చేసేసింది.

'నీ సైజ్ ఎంత' అంటూ అడిగిన ఓ ఫాలోయర్ ని తిట్టిపోసింది శ్రావ్య. 'నేనేం మాట్లాడుతున్నాను.. దేని గురించి మాట్లాడుతున్నాను.. నువ్వేం అడుగుతున్నావ్. నువ్వెప్పుడైనా నన్ను టచ్ చేయగలవా... అసలు రియల్ గా చూడగలవా.. నీలాంటి వాళ్ల వల్లే దేశం ఇలా తగలబడింది.. వేల మంది నీ కామెంట్స్ ను గమనిస్తున్నారనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా.. నా బూబ్స్ గురించి ఎలా అడగ్గలుగుతున్నావ్' అంటూ నిలదీసిన శ్రావ్యకు.. ఆ తర్వాత కోపం కట్టలు తెంచేసుకుంది.

'అవును.. నాకు అందమైన బూబ్స్ ఉన్నాయ్.. ప్రతీ అమ్మాయికీ ఉంటాయ్. మీ ఇంట్లో కూడా ఆడవాళ్లు ఉంటారుగా.. వెళ్లి మీ అమ్మను సైజ్ ఎంతో అడుగు' అంటూ రెచ్చిపోతున్న శ్రావ్య రెడ్డిని.. తర్వాత ఫాలోయర్సే కూల్ చేశారు. తర్వాత కూడా 20 నిమిషాల పాటు లైవ్ ఛాట్ ను కంటిన్యూ చేసింది శ్రావ్య రెడ్డి.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/