Begin typing your search above and press return to search.
అంత ఇరిటేట్ చేశావేంటి త్రివిక్రమ్?
By: Tupaki Desk | 3 Jun 2016 9:30 AM GMTమొత్తానికి త్రివిక్రమ్ మళ్లీ ఫామ్ లోకి వచ్చేశాడు. తన పెన్నుకు మళ్లీ పదును పెట్టుకుని ‘అఆ’ లాంటి అందమైన సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించాడు. రెస్పాన్స్ చాలా బాగుంది. ఈ సమ్మర్లో సర్దార్ గబ్బర్ సింగ్.. బ్రహ్మోత్సవం లాంటి భారీ సినిమాల దెబ్బకు బెంబేలెత్తిపోయిన ప్రేక్షకులకు ‘అఆ’ రిలీఫ్ ఇస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకులూ ఈ సినిమాను ఆస్వాదిస్తున్నారు. ఐతే ‘అఆ’తో త్రివిక్రమ్ మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు కానీ.. ఒకప్పటి టాప్ ఫామ్ మాత్రం చూపించలేకపోయాడు. నువ్వే నువ్వే.. అతడు.. అత్తారింటికి దారేది లాంటి సినిమాలతో తనకు తాను నిర్దేశించుకున్న ఉన్నతమైన ప్రమాణాల్ని మాత్రం అందుకోలేకపోయాడు.
‘అఆ’లో అనేకానేక ఆకర్షణలు ఉన్నప్పటికీ.. సినిమా చాలా వరకూ ఎంగేజింగ్ గా ఉన్నప్పటికీ సిల్లీగా.. ఇరిటేటింగ్ గా అనిపించే కొన్ని సన్నివేశాలు మాత్రం త్రివిక్రమ్ మీద సందేహాలు రేకెత్తించేలా ఉన్నాయి. ముఖ్యంగా హీరో చెల్లెలి పెళ్లి చూపుల సీన్ గురించి అయితే ప్రతి ఒక్కరూ నెగెటివ్ గా మాట్లాడుతున్నారు. జబర్దస్త్ ఫేమ్ చమ్మక్ చంద్రను పెళ్లికొడుకుగా చూపిస్తూ తీసిన ఈ సీన్ ‘జబర్దస్త్’ తరహాలోనే టూమచ్ గా అనిపించింది. ముందు హీరో చెల్లెల్ని పెట్టుకుని.. సమంత నడుం చూపించి కవ్విస్తుంటే అతను ఆబగా చూస్తుంటాడు. ఈ సీన్ మరీ లెంగ్తీగా ఉండటంతో ఇరిటేటింగ్ గా అనిపిస్తుంది. ఇంకెప్పుడు ముగుస్తుందో అన్న అసహనం కలిగిస్తుంది. ఇక ద్వితీయార్ధంలో షాపింగ్ మాల్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు కూడా ఇలాగే ఆసక్తి లేకుండా సాగతీతగా అనిపించాయి. ఇక ప్రి క్లైమాక్స్ లో ఫైట్ అయితే.. చాలా చాలా సిల్లీగా అనిపిస్తుంది. ఏదో ఫైట్ పెట్టాలి కాబట్టి పెట్టాలి అన్నట్లుంటుందక్కడ. కార్లోంచి ఈజీగా దిగేయడానికి ఛాన్సున్నా.. బయటికి రాలేక ఇరుక్కుపోయినట్లు అందులో ఉన్నోళ్లు భయపడి చస్తుంటారు. మధ్యలో అవసరం లేకున్నా హీరో ఫైట్ చేస్తాడు. ఆ ఫైట్ అయ్యేసరికి తెల్లారిపోతుంది. ఇలాంటి సిల్లీ.. ఇరిటేటింగ్ సీన్స్ లేకుంటే ‘అఆ’ ఇంకా మంచి ఫీలింగ్ తెప్పించేది.