Begin typing your search above and press return to search.
వెంకీ చేస్తున్న సినిమాకు గౌరవం
By: Tupaki Desk | 26 Sep 2016 3:25 PM GMTరీమేక్ సినిమాలంటే విక్టరీ వెంకటేష్ కు మహా ఇష్టం. ఆయన కెరీర్ బిగ్గెస్ట్ హిట్లలో చాలా వరకు రీమేకులే కనిపిస్తాయి. ముఖ్యంగా తమిళం నుంచి మంచి మంచి సినిమాలు ఎంచుకుని రీమేక్ చేస్తుంటాడు వెంకీ. ఆయన తాజాగా చేస్తున్న రీమేక్ మూవీ ‘గురు’. తమిళంలో ‘ఇరుదు సుట్రు’ పేరుతో తెరకెక్కిన సినిమా ఇది. విమర్శకుల ప్రశంసలతో పాటు మంచి వసూళ్లు కూడా సాధించిన ఈ సినిమాకు విడుదలైన ఏడు నెలల తర్వాత మరో గౌరవం దక్కింది. ప్రఖ్యాత టోక్యో ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శనకు ఈ సినిమా ఎంపికైంది. ఈ చిత్రాన్ని అక్టోబరు 31న అక్కడ ప్రదర్శించబోతున్నారు.
‘ఇరుది సుట్రు’లో నటనకు గాను రితికా సింగ్ కు నేషనల్ అవార్డుల్లో జ్యూరీ పురస్కారం దక్కింది. ఇంకా ఈ సినిమాకు మరికొన్ని అవార్డులు కూడా దక్కాయి. ప్రస్తుతం ‘ఇరుది సుట్రు’ తెలుగు రీమేక్ ‘గురు’ పనిలో బిజీగా ఉన్న డైరెక్టర్ సుధ కొంగర మాట్లాడుతూ.. ‘‘టోక్యో ఫిలిం ఫెస్టివల్ కు నా సినిమా ఎంపికవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా విడుదలకు ముందే చాలామంది ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం నేను గురు చిత్రీకరణలో తీరిక లేకుండా ఉన్నా. టోక్యో ఫిలిం ఫెస్టివల్ కు వెళ్తానో లేదో తెలియదు’’ అని చెప్పింది. సుధ తెలుగమ్మాయే కావడం.. ఇంతకుముందు ‘ఆంధ్రా అందగాడు’ అనే చిన్న సినిమాను తెరకెక్కించడం విశేషం.