Begin typing your search above and press return to search.
విక్రమ్ మీద అంత నమ్మకమా..
By: Tupaki Desk | 5 Aug 2016 5:41 AM GMT‘ఐ’ సినిమా అద్భుతంగా ఉంటుందని ఆశించారు తెలుగు ప్రేక్షకులు. కానీ తీవ్రంగా నిరాశ పరిచాడు శంకర్. ఐతే ఆ సినిమా కోసం విక్రమ్ పడ్డ కష్టం మాత్రం అసాధారణమైంది. ఆ కష్టానికే సరైన ఫలితం దక్కలేదు. అసలే కొన్నేళ్లుగా విక్రమ్ కు హిట్టు లేదు.. పైగా ‘ఐ’ కోసం బాగా గ్యాప్ తీసుకున్నాడు. దీంతో తమిళంతో పాటు తెలుగులోనూ అతడి మార్కెట్ బాగా దెబ్బ తింది.
‘ఐ’ తర్వాత చేసిన ‘10 ఎన్రదుకుల్లా’కు తమిళంలో నెగెటివ్ టాక్ రావడంతో అసలు తెలుగులో విడుదలకే నోచుకోలేదు. అంతగా విక్రమ్ మార్కెట్ పడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా విక్రమ్ కొత్త సినిమా ‘ఇరుముగన్’ తెలుగు హక్కుల కోసం నీలం కృష్ణారెడ్డి అనే నిర్మాత పెద్ద మొత్తమే వెచ్చించాడు. దాదాపు రూ.11.5 కోట్లకు ఈ సినిమా తెలుగు హక్కుల్ని కొన్నాడట ఈ నిర్మాత. ఈ చిత్రం తెలుగులో ‘ఇంకొక్కడు’ పేరుతో విడుదల కాబోతోంది.
‘ఇంకొక్కడు’ గురించి మొన్నటిదాకా తెలుగు ప్రేక్షకుల్లో పెద్దగా ఆసక్తి లేదు కానీ.. లేటెస్టుగా రిలీజైన ట్రైలర్ చూశాక సీన్ మారిపోయింది. ట్రైలర్లో విక్రమ్ విన్యాసాలు ఆసక్తి రేకెత్తించాయి. ముఖ్యంగా హిజ్రాగా విలన్ పాత్రలో విక్రమ్ లుక్స్.. అతడి నటన క్యూరియాసిటీని పెంచాయి. ఈ ట్రైలర్ చూపించే రేటు ఫిక్స్ చేశాడట తమిళ నిర్మాత. నయనతార హీరోయిన్ కావడం కూడా ఈ సినిమాకు కలిసొచ్చే అంశం. సినిమా బాగుండాలే కానీ.. రూ.11.5 కోట్లన్నది పెద్ద విషయం కాదు. మరి సినిమాలో కంటెంట్ ఎలా ఉందో చూడాలి. సెప్టెంబర్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశముంది.