Begin typing your search above and press return to search.

స్టార్ హీరో డాట‌ర్ మేక‌ప్ వేసుకుంటుందా?

By:  Tupaki Desk   |   12 Dec 2022 4:30 PM GMT
స్టార్ హీరో డాట‌ర్ మేక‌ప్ వేసుకుంటుందా?
X
బాలీవుడ్ మిస్ట‌ర్ పెర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ వార‌స‌త్వాన్ని కుమార్తె ఐరాఖాన్ కొన‌సాగించ‌డానికి రెడీ అవుతోందా? ఓవైపు ద‌ర్శ‌కురాలిగా ప‌నిచేస్తూనే మ్యాక‌ప్ కూడా వేసుకోబోతుందా? అంటే అవున‌నే ప్ర‌చారం బాలీవుడ్ మీడియాలో జోరుగా సాగుతోంది. ఆ మ‌ద్య ఓ ఇంట‌ర్వ్యూలో న‌టిగా ఎప్పుడు ఎంట్రీ ఇస్తార‌ని ప్ర‌శ్నిస్తే.. 'న‌న్ను న‌టిగా చూసే అవ‌కాశాలు చాలా త‌క్కువ‌గా ఉన్నాయ‌ని.. ద‌ర్శ‌కురాలిగానే రాణిస్తాన‌ని చాలా కాన్పిడెంట్ గా చెప్పింది.

ఇప్ప‌టికే ఐరాఖాన్ భార‌త క్రికెట‌ర్ యువ‌రాజ్ సింగ్ భార్య హ‌జీల్ కీచ్ న‌టించిన ' మేదియా' చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం కూడా వ‌హించింది. ఈ సినిమా విడుద‌లై మూడేళ్లు అవుతుంది. అయితే అటుపై ఐరా ద‌ర్శ‌కురాలిగా బిజీ అవ్వ‌లేదు. ఇటీవ‌లే ఫిట్ నెస్ ట్రైయినర్ నుపుర్ శిఖారర్ తో రిలేష‌న్ షిప్ లో ఉన్న‌ట్లు వెలుగులోకి వ‌చ్చింది. త్వ‌ర‌లో ఇద్ద‌రు వివాహం చేసుకుంటున్న‌ట్లు వినిపిస్తుంది.

మ‌రి ఈ ప‌రిణామాల‌న్ని ఐరాఖాన్ లో మార్పులు తీసుకొచ్చిన‌ట్లే క‌నిపిస్తుంది. అమ్మ‌డు మ్యాక‌ప్ వేసుకోవ‌డానికి రెడీగా ఉంద‌ని బాలీవుడ్ మీడియాలో వార్త‌లు ఒక్క‌సారిగా గుప్పుమ‌న్నాయి. అమీర్ఖాన్ ఆమె లాంచింగ్ కోసం సీరియ‌స్ గా క‌థ‌లు వింటున్న‌ట్లు స‌మాచారం. 'లాల్ సింగ్ చ‌డ్డా' రిలీజ్ త‌ర్వాత అమీర్ పూర్తిగా కుమార్తె ఎంట్రీ విష‌యంలో బిజీ అయిన‌ట్లు వినిపిస్తుంది.

ఐరాఖాన్ న‌టిగా సినిమాలు చేసినా అప్పుడ‌ప్పుడు డైరెక్ష‌న్ వైపు చూసే ఛాన్స్ ఉంది. ఇప్ప‌టి యువ‌త చాలా అప్డేట్ గా ఉంటుంది. మ‌ల్టీట్యాలెంటెడ్ గా మారుతున్నారు. అందుకోసం ఎంతైనా శ్ర‌మిస్తున్నారు. రాత్రి..ప‌గ‌లు తేడా లేకుండా క‌ష్ట‌ప‌డు తున్నారు. ఐరాలో ఈ ల‌క్ష‌ణాల్ని ఉంటే గ‌నుక తండ్రి కి త‌గ్గ త‌న‌యే అవుతుంది. అమీర్ ట్యాలెంట్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు.

దేశం గ‌ర్వించ‌ద‌గ్గ న‌టుల్లో ఆయ‌న ఒక‌రు. న‌టుడిగా..నిర్మాత‌గా..ద‌ర్శ‌కుడిగా స‌త్తా చాటుతున్నారు. ఒకే సినిమాలో డ్యూయ‌ల్ రోల్ పోషించాల్సి వ‌స్తే వాటి మ‌ధ్య ట్రాన్స‌ప‌ర్మేష‌న్ ఎలా ఉంటుందో చూపించ గ‌ల్ల ఒకే ఒక్క న‌టుడాయ‌న‌. ఆర‌క్తాన్ని పంచుకున్నా ఐరాఖాన్ అంత‌టి స‌మ‌ర్ధురాలే అవుతుంద‌ని ఆశిద్దాం.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.