Begin typing your search above and press return to search.
మిస్టర్ పర్ఫెక్ట్ ప్రకటనతో బిగ్ షాక్ లో ఫ్యాన్స్
By: Tupaki Desk | 15 Nov 2022 8:30 AM GMTమిస్టర్ పర్ఫెక్ట్ రెండేళ్లు పూర్తిగా సినిమాలకు బ్రేక్ ఇస్తున్నారా? అంటే అవుననే సమాచారం. మిస్టర్ పర్ఫెక్ట్ అనగానే టాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ప్రభాస్! అంటూ డైలమా అవసరం లేదు. ఇది బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ గురించిన వార్త.
ఖాన్ ల త్రయంలోనే సంచలనాల హీరోగా పాపులరైన అమీర్ ఖాన్ గత కొంతకాలంగా పరాజయాల బాటలో ఉన్నాడు. అతడి డ్రీమ్ ప్రాజెక్ట్ 'లాల్ సింగ్ చడ్డా' బాక్సాఫీస్ వద్ద డిజాస్టరైంది. ఈ సినిమాపై ఎన్నో హోప్స్ తో తన జీవితాన్ని ఆత్మను అంకితమిచ్చి పని చేశాడు. ఎనిమిదేళ్ల నాటి కలను సాకారం చేసుకునేందుకు మూడేళ్ల పాటు రేయింబవళ్లు శ్రమించి ఒక రకంగా తపస్సు చేశాడు. దీనికోసం సొంత ప్రొడక్షన్ హౌస్ భారీగా పెట్టుబడులు పెట్టింది. కానీ పాపం అది డిజాస్టర్ అయ్యి భారీ నష్టాలను మిగిల్చింది. ఈ మూవీ రూపంలో అమీర్ కోట్లలో నష్టపోయారని ప్రచారం సాగింది. ఇది అతడిలో తీవ్ర కలతను పెంచిందన్న గుసగుసా బాలీవుడ్ మీడియాలో వినిపించింది.
కారణం ఏదైనా ఇప్పుడు అమీర్ లో బోలెడంత మదనం కొనసాగుతోంది. తాజా సమాచారం మేరకు 'చాంపియన్స్' అనే చిత్రంలో నటించాల్సి ఉందని.. అయితే దానిని విరమించానని దీనికి కేవలం నిర్మాతగా మాత్రమే వ్యవహరిస్తానని అమీర్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.
అంతేకాదు తాను రెండేళ్ల విరామం తీసుకుని తన కుటుంబంతో గడపాలనుకుంటున్నట్టు వెల్లడించాడు. ముఖ్యంగా అనారోగ్యంతో ఇటీవల ఆసుపత్రిలో చేరిన తన తల్లితో ఈ సమయంలో ఉండాలనుకుంటున్నానని చెప్పాడు. అమీర్ తన పిల్లలతో సరైన సమయాన్ని కూడా గడపలేదని ఈ ఇంటర్వ్యూలో అంగీకరించారు. ఇప్పుడు వారికి తిరిగి ప్రతిదీ అందించే సమయం వచ్చిందని ఈ రెండేళ్లు తన జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతానని చెప్పాడు.
మొత్తానికి అమీర్ లో మార్పు స్పష్ఠంగా కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఒక్కోసారి పరాజయాలు కూడా జీవితంలో గుణపాఠం నేర్పిస్తాయని అంటారు. పరాజయాలతో పాటు బంధాలు అనుబంధాలు కూడా గుర్తుకొస్తాయి. దశాబ్ధాల పాటు అజేయంగా రారాజులా బాలీవుడ్ ని ఏలిన అమీర్ క్షణమైనా తీరిక లేకుండా షూటింగులతోనే గడిపాడు. నియాన్ కాంతుల మెరుపుల మధ్య జిగిబిగి గ్లామర్ పరిశ్రమలో తన సమయం మొత్తాన్ని గడిపాడు. తన గారాల కుమార్తె ఇరాఖాన్ తో కూడా విలువైన సమయాన్ని గడపలేకపోయాడు. కథానాయికలతో మల్టిపుల్ ఎఫైర్లతోను నిరంతరం వార్తల్లో నిలిచాడు. అయినా అన్నిటినీ వదిలి ఇప్పుడు ప్రశాంతంగా తాను తన కుటుంబంతో పిల్లలతో గడపాలనుకుంటున్నట్టు ప్రకటించాడు. ముఖ్యంగా తన తల్లిగారికి ఈ వయసులో సేవలు చేయాల్సి ఉందని అన్నాడు. ఇది అనూహ్యమైన మార్పు.
కానీ అమీర్ ఖాన్ తాజా ప్రకటనతో అభిమానులు బిగ్ షాక్ లో ఉన్నారు. తనవైన అద్భుత ప్రదర్శనలతో నాలుగు దశాబ్ధాలుగా ప్రేక్షకాభిమానులను అలరిస్తున్న అమీర్ ఖాన్ సినిమాలకు బ్రేక్ ఇవ్వడం అంటే ఇది చిత్రపరిశ్రమకు తీరని లోటు అంటూ పరిశ్రమ వర్గాల్లో చర్చ సాగుతోంది. అలాగే అభిమానులు కూడా దీనిపై కలత చెందుతున్నారు. అతడి నుంచి త్రి ఇడియట్స్- పీకే- దంగల్- సీక్రెట్ సూపర్ స్టార్ లాంటి మరిన్ని ప్రయోగాత్మక చిత్రాలు రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.