Begin typing your search above and press return to search.
ఈయన అల్లు బ్రాండ్ జమీందారా ?
By: Tupaki Desk | 14 May 2019 4:49 AM GMTమహర్షి ప్రభంజనం తర్వాత వస్తున్న తెలుగు స్ట్రెయిట్ మూవీ ఎబిసిడి. ఏడాదిన్నర గ్యాప్ తో శిరీష్ చేస్తున్నసినిమాగా దీని మీద ఓ మోస్తరు అంచనాలే ఉన్నాయి. టాక్ రివ్యూస్ రిపోర్ట్స్ మౌత్ పబ్లిసిటీ వీటి మీదే ఎక్కువ ఆధార పడ్డ ఎబిసిడి మలయాళం బ్లాక్ బస్టర్ రీమేక్ కావడం పాజిటివ్ గా కనిపిస్తున్న అంశం. ట్రైలర్ కూడా బాగానే రెస్పాన్స్ తెచ్చుకుంది. అయితే ఇందులో ఇతర హీరోల గత సినిమాల పోలికలు ఉన్నాయనే కామెంట్స్ సోషల్ మీడియాలో జోరుగా వస్తున్నాయి.
అమెరికాలో పుట్టి పెరిగిన హీరో ఇండియాకు వచ్చాక సాధారణ సగటు జీవితానికి అలవాటు పడటం కొత్త పాయింట్ కాదు. గతంలో నువ్వొస్తానంటే నేనోద్దంటానాలో సిద్దార్థ్ పాత్ర ఇలాగే ఫారిన్ నుంచి వచ్చి హీరోయిన్ ఉన్న చోట వ్యవసాయం చేయాల్సి వస్తుంది. దాన్ని నేర్చుకుని గెలిచి చూపిస్తాడు. న్యాచురల్ స్టార్ నాని పిల్ల జమీందార్ లో సైతం బాగా సుఖాలకు అలవాటు పడిన గొప్పింటి బిడ్డ పెద్దగా వసతులు లేని ఓ మాములు కాలేజీ లో చదువుకుంటూ నానా కష్టాలు పడాల్సి వస్తుంది. అయినా ఆ పరిస్థితులను దీటుగా ఎదురుకుని చివరికి విజేతగా నిలుస్తాడు.
ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఉదాహరణలు ఉన్నాయి కానీ ఈ పాయింట్ కాకుండా ఎబిసిడిలో ఇంకేం కొత్తదనం చూపించారో అనే ప్రశ్నకు సమాధానం వెండితెర మీదే చూడాలి. నిన్న న్యాచురల్ నాని అతిధిగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత కొంత మైలేజ్ వచ్చినట్టే కనిపిస్తోంది. ఒక్క క్షణం తర్వాత సుమారు 16 నెలలు గ్యాప్ తీసుకుని శిరీష్ చేస్తున్న మూవీ ఇది. మాస్టర్ భరత్ గా పాపులారిటీ ఉన్న భరత్ దీని ద్వారా ఫుల్ లెన్త్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారనున్నాడు