Begin typing your search above and press return to search.
RC 15 కు ఆచార్య కష్టాలా?
By: Tupaki Desk | 2 Jun 2022 7:36 AM GMTస్టార్ డైరెక్టర్ రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా మూవీ 'ట్రిపుల్ ఆర్'తో మెగా పవర్ స్టార్ బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూనే ఫుల్ జోష్ తో రామ్ చరణ్ తన తదుపరి ప్రాజెక్ట్ ని ప్రారంభించేశాడు. దిగ్రేట్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తదుపరి మూవీని చేస్తున్న విషయం తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్నఈ చిత్రాన్ని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ దశలో వుంది. 1993 నేపథ్యంలో సాగే పీరియడిక్ ఫిక్షనల్ మూవీగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. RC 15 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ మూవీ ఇటీవల రాజమండ్రి పరిసరాలలో జరుపుకున్న షూటింగ్ తో ఇప్పటి వరకు నలభై శాతం చిత్రీకరణ పూర్తయింది. సినిమాలోని చరణ్ ఓల్డ్ లుక్ కు సంబంధించిన ఫొటోలు ఇటీవల లీకై సినిమాపై అంచనాల్ని పెంచేశాయి. ఇదిలా వుంటే కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ కూడా 'ఆచార్య' తరహాలో ఇబ్బందులు పడుతోందని తెలుస్తోంది.
'ఆచార్య' చిత్రీకరణ సమయంలో సినిమాకు వర్క్ చేస్తున్న కెమెరామెన్ ఉన్నట్టుంది తప్పకున్నాడంటూ వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. ఇప్పడు చరణ్ చేస్తున్న RC 15 కూడా ఇదే తరహా ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికరమైన వార్త ఒకటి తాజాగా బయటికి వచ్చింది. ఈ మూవీకి పని చేస్తున్నా టాప్ టెక్నీషియన్ ఒకరు అర్థాంతరంగా బయటికి వచ్చేశారని చెబుతున్నారు.
ఈ మూవీకి ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్న రామకృష్ణ బయటికి వచ్చేశారని తెలిసింది. ఇటీవల ఈ మూవీ కోసం భారీ సెట్ లని నిర్మించిన రామకృష్ణ ఇటీవల డైరెక్టర్ తో ఏర్పడిన అభిప్రాయ భేదాల కారణంగా తను ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టుగా తెలుస్తోంది.
చరణ్ నటించిన 'రంగం స్థలం' మూవీకి విలేజ్ సెట్ ని రూపొందించి ఒక్కసారిగా వార్తల్లో నిలిచాడు రామకృష్ణ. అయితే అలాంటి టాప్ టెక్నీషియన్ ని చరణ్ RC 15 కి కూడా కంటిన్యూ చేయాలని ఫిక్సయి ఫైనల్ చేసుకున్నారట. అయితే ఇటీవల దర్శకుడితో ఏర్పడిన క్రియేటివ్ డిఫరెన్స్ ల కారణంగా రామకృష్ణ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకన్నట్టుగా తెలుస్తోంది.
అతని స్థానంలో ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ ని తీసుకున్నారని చెబుతున్నారు. రవీందర్ గతంలో చరణ్ నటించిన 'మగధీర' చిత్రానికి వర్క్ చేశారు. రీసెంట్ గా ప్రభాస్ నటించిన 'రాధేశ్యామ్' మూవీకి భారీ సెట్ లని నిర్మించారు. రామకృష్ణ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుని రవీందర్ ఎంటర్ అయ్యారన్నది ఎంత వరకు నిజమన్నది తెలియాలంటే ఈ మూవీ తాజా షెడ్యూల్ మొదలయ్యే వరకు వేచి చూడాల్సిందే.