Begin typing your search above and press return to search.
సంక్రాంతి రేసులో `ఆచార్య` సాధ్యమేనా?
By: Tupaki Desk | 26 Dec 2021 5:41 AM GMTమెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తోన్న `ఆచార్య` ఇప్పటికే రిలీజ్ డేట్ ని లాక్ చేసిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 4న వరల్డ్ వైడ్ రిలీజ్ చేయడానికి ముహుర్తం ఫిక్స్ చేసారు. ఇటీవలే మరోసారి రిలీజ్ డేట్ ని ఖరారు చేస్తున్నట్లు ధృవీకరించారు. మరి ఇప్పుడు ఈ తేదీకే ఆచార్య రిలీజ్ అవుతుందా? అంటే మళ్లీ ఇప్పుడు కొత్త సందేహాలు తెరపైకి వస్తున్నాయి.
ఆచార్య రిలీజ్ డైలమా ప్రతిసారీ చర్చకు వస్తోంది. దసరా లేదా దీపావళి అన్నారు. ఆ తర్వాత డిసెంబర్ కి వాయిదా వేసారు. అటుపై సంక్రాంతి 2022కి మారింది. వాస్తవానికి ఈ చిత్రాన్ని సంక్రాంతి 2022 కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేసారు. అయితే ఆ సమయంలో పాన్ ఇండియా చిత్రాలు`ఆర్ ఆర్ ఆర్`..`రాధేశ్యామ్` తో పాటు పవన్ కళ్యాణ్ నటిస్తోన్న `భీమ్లానాయక్` కూడా రిలీజ్ అవ్వడంతో ఆచార్య యూనిట్ వెనక్కి తగ్గింది.
జనవరి నెలంతా ఆ మూడు సినిమాలకు `ఆచార్య` లైన్ క్లియర్ చేసి ఫిబ్రవరి 4న రిలీజ్ ఫిక్స్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ ఇంపాక్ట్ తో `ఆర్.ఆర్.ఆర్` వాయిదా పడే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. అలాగే ఏపీలో థియేటర్లు సీజ్ అవ్వడం...టిక్కెట్ ధరలు తక్కువగా ఉండటం వంటి అంశాలు `ఆర్ ఆర్ ఆర్` కి ప్రతికూలంగా ఉంటాయనే సందేహంతో వెనక్కి తగ్గే అవకాశం ఉందని గుసగుస వినిపిస్తోంది. ఒకవేళ అదే జరిగితే `ఆర్ ఆర్ ఆర్` సంక్రాంతి రేసులో నిలుస్తుందని ప్రచారం సాగుతోంది. అయితే ఇదంతా వీజీ కాదు.
`ఆచార్య` సాంగ్స్ షూట్ ఇంకా బ్యాలెన్స్ ఉంది. అలాగే ఇప్పటివరకూ ఎలాంటి ప్రచారం కల్పించలేదు. ట్రైలర్...ప్రీ రిలీజ్ ఈవెంట్..స్సెషల్ ఇంటర్వ్యూలు ఏవీ జరగలేదు. ఇలాంటి హంగామా లేకుండా ఇప్పటికప్పుడు రిలీజ్ అంటే కష్టమైన పని. పైగా ఆర్ ఆర్ ఆర్ వాయిదా పడిన తర్వాత `ఆర్ ఆర్ ఆర్` సీన్ లోకి రావడం మెగాస్టార్ బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బ తీసినట్లు ఉంటుంది. కాబట్టి `ఆచార్య` ఫిబ్రవరికే ఫిక్స్ అయిందని చెప్పొచ్చు.
తెలివిగా వెనక్కి తగ్గారు!
`ఆచార్య`కు అపజయమెరుగని కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. కాజల్ - పూజా హెగ్డే కథానాయికలు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సంక్రాంతి కానుకగా ఈ మూవీని రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ పాన్ ఇండియా చిత్రాలు `ఆర్.ఆర్.ఆర్`..`రాధే శ్యామ్` రిలీజ్ కి రెడీ అవ్వడంతో `ఆచార్య` వెనక్కి తగ్గింది. దీనికి తోడు ఇప్పటివరకూ సినిమాకు బజ్ తీసుకురావడంలో యూనిట్ శ్రద్ధ వహించలేదు. రిలీజ్ కి ఇంకా సమయం ఉండటంతో ప్రచారం పై ఫోకస్ పెట్టలేదు. మెగాస్టార్ లుక్ లాంచ్ చేయగా స్పందన ఆకట్టుకుంది. అలాగే రామ్ చరణ్ సిద్ధ పాత్రని రివీల్ చేస్తూ ఓ టీజర్ ని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా స్కైని టచ్ చేసాయి. కొరటాల ఏదో అద్భుతం చేయబోతున్నాడు! అన్న టాక్ వినిపించింది. ముఖ్యంగా చిరుతని.. చిరుత పిల్ల అంటూ ఫ్యాన్స్ కి పునకాలు రప్పించే ప్రయత్నమే ఇదని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఆ ఇరువురి కాంబినేషన్ సన్నివేశాలు బిగ్ స్క్రీన్ పై చూస్తే అన్ స్టాపబుల్ ఎంటర్ టైన్ మెంట్ ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ఇక ట్రైలర్ ఏ రేంజ్ లో ఉంటుందోనన్నఅంచనాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. రిలీజ్ కి ఇంకా సమయం ఉంది కాబట్టి ఈలోపు ఆచార్య ప్రీరిలీజ్ బిజినెస్ గురించి చర్చ సాగుతోంది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ-మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వరల్డ్ వైడ్ గా ఫిబ్రవరి 4న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.