Begin typing your search above and press return to search.

49 ఏళ్ళ హాట్ బ్యూటీ రెండో పెళ్ళికి 'యస్' చెప్పిందా..?

By:  Tupaki Desk   |   10 Nov 2022 11:30 AM GMT
49 ఏళ్ళ హాట్ బ్యూటీ రెండో పెళ్ళికి యస్ చెప్పిందా..?
X
బాలీవుడ్ లవ్ బర్డ్స్ మలైకా అరోరా మరియు అర్జున్ కపూర్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. గత కొన్నేళ్లుగా డేటింగ్ చేస్తున్న ఈ జంట.. ముంబై వీధుల్లో తరచుగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ.. వీలు కుదిరినప్పుడల్లా హాలిడేని ఎంజాయ్ చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. అయితే వీరిద్దరూ ఇప్పుడు తమ రిలేషన్ షిప్ ను నెక్స్ట్ స్టేజ్ కు తీసుకెళ్లడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది.

మలైకా అరోరా తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో ఓ ఫోటోని షేర్ చేస్తూ.. "నేను 'ఎస్' చెప్పాను" అనే క్యాప్షన్‌ పెట్టింది. దీనికి రెండు హార్ట్ ఎమోజీలను జోడించడం ద్వారా సోషల్ మీడియాని షేక్ చేసింది. ఈ ఫొటోలో ఆమె సిగ్గు పడుతుండటాన్ని చూసి అర్జున్ కపూర్ పెళ్లి ప్రపోజల్ కు ఓకే చెప్పిందని భావిస్తున్నారు. కొద్ది నిమిషాల్లోనే మలైకా పోస్ట్ నెట్టింట వైరల్‌ గా మారింది.

మలైకా అరోరా మరియు అర్జున్ కపూర్ జంట త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ నెటిజన్లు మరియు ఆమె స్నేహితులు శుభాకాంక్షలు చెబుతున్నారు. మరోవైపు మలైకా పోస్ట్ పెట్టిన గంట తర్వాత ''నేను వైఫల్యాన్ని అంగీకరించగలను, ప్రతి ఒక్కరూ ఏదో ఒక విషయంలో విఫలమవుతారు. కానీ ప్రయత్నించకపోవడాన్ని నేను అంగీకరించలేను'' అని తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో పేర్కొన్నారు.

మలైకా 'ఎస్' చెప్పినట్లు సంతోషంగా పోస్ట్ పెడితే.. అర్జున్ కపూర్ లైఫ్ కు సంబంధించిన మోటివేషన్ కోట్ ని పంచుకోవడం అందరినీ ఆలోచనలో పడేసింది. ఇలా పరోక్షంగా కాకుండా త్వరలోనే తమ పెళ్లి గురించి అధికారికంగా ప్రకటిస్తారేమో చూడాలి.

ఇకపోతే మలైకా అరోరా ఇంతకుముందు సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్‌ ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే వీరు 2016లో తమ 19 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలికారు. ప్రస్తుతం వీరు తమ 19 ఏళ్ల కొడుకు అర్హాన్ ఖాన్‌ కు సహ తల్లిదండ్రులుగా ఉన్నారు.

ప్రస్తుతం మలైకా వయస్సు 49 ఏళ్ళు. అర్బాజ్ ఖాన్‌ తో విడాకులు తీసుకున్న కొన్నేళ్ళకు తనకంటే 12 ఏళ్ళ చిన్నవాడైన అర్జున్ కపూర్ తో సహజీవనం చేయడం సాగించింది. వీరిద్దరూ తమ మధ్య సంబంధాన్ని అధికారికంగా ప్రకటించినప్పటికీ.. క్లోజ్ గా ఉన్న ఫోటోలు.. ఒకరినొకరు ముద్దు పెట్టుకునే చిత్రాలను షేర్ చేయడాన్ని బట్టి అందరికీ ఓ క్లారిటీ వచ్చేసింది. అయితే ఇద్దరూ బ్రేకప్ చెప్పుకున్నట్లు కూడా అప్పట్లో టాక్ వచ్చింది.

ఇప్పుడు 'యస్ చెప్పాను' అని గ్లామరస్ బ్యూటీ క్యాప్షన్ ఇవ్వడంతో త్వరలోనే అర్జున్ కపూర్ తో పెళ్లి జరగబోతున్నట్లుగా బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే మరో క్లారిటీ ఇచ్చేవరకు ఆగాల్సిందే.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.