Begin typing your search above and press return to search.
'ఆదిపురుష్' 3డి టీజర్ రెడీ అవుతోందా?
By: Tupaki Desk | 14 Sep 2022 9:30 AM GMTదసరా సంబరాలకు సమయమాసన్నమైంది. వచ్చే నెలలోనే పండగ. ఇకనైనా 'ఆదిపురుష్ 3డి'కి సంబంధించిన ఏదైనా సమాచారం ఉంటుందా? అంటూ ప్రభాస్ అభిమానులు కళ్లు కాయలు కాసేలా వేచి చూస్తున్నారు. పెదనాన్న మరణంతో కలతకు గురైన ప్రభాస్ దీనినుంచి బయటపడటానికి కొంత సమయం పడుతుందనడంలో సందేహం లేదు. కానీ తన భారీ చిత్రాల షెడ్యూళ్లకు విఘాతం కలిగించే ఆలోచన అతడికి ఉండదు. ఆదిపురుష్ టాకీ పూర్తయి చాలా కాలమే అయ్యింది. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు శరవేగంగా పూర్తి చేస్తున్నారు. భారతదేశంలో మునుపెన్నడూ చూడని కొత్త విజువల్స్ ని చూపించేందుకు ఓంరౌత్ తనవంతు ప్రయత్నంలో ఉన్నాడు. రామాయణం స్ఫూర్తితో శ్రీరాముని గాధను తెరపై ఆవిష్కరిస్తున్న ఓంరౌత్ ఇందులో రాముడితో పాటు సీత పాత్రను లక్ష్మణుడి పాత్రను అలాగే రావణుడి పాత్రను ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారని కథనాలొస్తున్నాయి.
ఇక ప్రచారానికి సమయమాసన్నమైంది. దసరాకి ముందే అంటే అక్టోబర్ 3న టీజర్ ని ఆవిష్కరిస్తారని తెలిసింది. ప్రస్తుతం టీజర్ కోసం పనులు పూర్తవుతున్నాయి. ఫైనల్ కట్ పనులను దర్శకుడు ఓం రౌత్ పర్యవేక్షిస్తున్నారు. భారీ వీఎఫ్ ఎక్స్ తో శ్రీరాముని పాత్రను ఈ టీజర్ లో పరిచయం చేస్తారని చెబుతున్నారు. ఇతర పాత్రల గ్లిమ్స్ ని కూడా ఆవిష్కరిస్తారా? అన్నదానికి ఓంరౌత్ సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.
2023 జనవరి 12 విడుదల దాదాపు ఖరారైంది. కానీ దీనిని అధికారికంగా ప్రకటించాల్సి ఉంటుంది. ఇక ఓంరౌత్ తెరకెక్కించిన తానాజీ 3డి జనవరిలోనే విడుదై ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రభాస్ వర్షం కూడా సంక్రాంతికే వచ్చి పెద్ద విజయం అందుకుంది. ఇలా సంక్రాంతి రిలీజ్ సెంటిమెంటుగా ఆదిపురుష్ టీమ్ కి కలిసొస్తుందనే భావిస్తున్నారు.
ఇక ప్రభాస్ నటించిన ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో తెలుగు-తమిళం-హిందీ-మలయాళం-కన్నడంలో అత్యంత భారీగా విడుదల కానుంది. అదే క్రమంలో బాహుబలి 2 రికార్డుల్ని ఈ మూవీ బ్రేక్ చేస్తుందా? లేదా? అన్న చర్చ స్టార్టయింది. అయితే అక్టోబర్ 3న టీజర్ రాకతో ఈ చర్చ మరింత ఉధృతమవుతుందనడంలో సందేహం లేదు.
వరుస ఈవెంట్లలో ప్రచారం..పెదనాన్న కృష్ణంరాజు మరణం ప్రభాస్ కి కోలుకోలేని దెబ్బ అనడంలో సందేహం లేదు. కానీ దీనినుంచి వేగంగా బయటపడి తన భారీ చిత్రాల షూటింగులతో పాటు రిలీజ్ బాధ్యతలను అతడు స్వీకరిస్తారనే భావిస్తున్నారు. దసరాకి టీజర్ లాంచ్ ప్రణాళిక ఉంది. అంతకుముందే ప్రభాస్ ఢిల్లీలోని పాపులర్ ఈవెంట్ లో పాల్గొనాల్సి ఉందని సమాచారం. దేశరాజధానిలో 'రామ్ లీలా' వేడుకల్లో అతడు కనిపించనున్నారని తాజాగా కథనాలొస్తున్నాయి. ఢిల్లీలో థియేటర్ కళాకారులు రామాయణాన్ని ప్రదర్శించే పది రోజుల సుదీర్ఘ వేడుకలకు సమయమాసన్నమైంది. 'లవ్ కుశ్ రామ్ లీలా' ఈవెంట్లో ప్రభాస్ రావణుడి దిష్టిబొమ్మను దహనం చేయనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆదిపురుష్ 3డి ప్రమోషన్స్ కి ఇంతకంటే కచ్చితమైన ప్రారంభం ఉండదు.
మునుముందు పండగ సీజన్ మరింత వేడెక్కనుంది. నవరాత్రులు 26 సెప్టెంబర్ 2022 నుండి ప్రారంభమవుతాయి. 5 అక్టోబర్ 2022 న విజయ దశమితో ముగుస్తాయి. రావణుడి దిష్టిబొమ్మను వెలిగించడంలో ప్రభాస్ ను మించిన వారు ఇంకెవరూ ఉండరని 'లవ్ కుష్ రామ్ లీలా కమిటీ' నిర్వాహకులు ఓ న్యూస్ పోర్టల్ తో వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ గా మారింది. ఈవెంట్లో రావణుడు.. మేఘనాథ్ (ఇంద్రజిత్) కుంభకర్ణ మూడు విగ్రహాలు ఉంటాయి. శ్రీరాముడు వాటిని బాణాలు వేసి కాల్చివేస్తాడు. ఆదిపురుష్ లో ప్రభాస్ శ్రీరాముడిగా నటిస్తున్నందున అతడికి ఇది ఒక సదవకాశం. ఇది ఢిల్లీ నగరంలోని పురాతనమైన సాంస్కృతిక కార్యక్రమాల్లో ఇది ఒకటి. లవ్ కుష్ రామ్ లీలా చాందినీ చౌక్ ఐకానిక్ మార్కెట్ దగ్గర జరుగుతుంది. ప్రభాస్ కు నార్త్ లో కూడా భారీ అభిమానులు ఉన్నారు. అతడు ఈ ఈవెంట్ ముఖ్య అతిథిగా పర్ఫెక్ట్ ఛాయిస్ గా కనిపిస్తున్నారన్న టాక్ ఉంది.
ఆదిపురుష్ భారీతనం నిండిన యాక్షన్ ఫిల్మ్. ఈ సినిమా పఠాన్ కంటే ముందు 12 జనవరి 2023న రాబోతోంది. షారుఖ్ ఖాన్ పుట్టినరోజు (నవంబర్ 2) సందర్భంగా పఠాన్ అప్ డేట్ వచ్చే అవకాశం ఉన్నా కానీ... ఆదిపురుష్ మేకర్స్ ముందుగానే ప్రమోషన్స్ ని ప్రారంభిస్తున్నారు. సంక్రాంతి 2023 బరిలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య విడుదల కానుంది. బాలీవుడ్ ని దృష్టిలో పెట్టుకుంటే... డిసెంబర్ లో సిర్కస్- కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ మొదలైన పెద్ద బాలీవుడ్ విడుదలలు ఉన్నాయి కాబట్టి 'ఆదిపురుష్'కి ప్రచారమవసరమని టీమ్ భావిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.