Begin typing your search above and press return to search.
ఐశ్వర్యారాయ్ క్షేమమేనా.. మంత్రి గారి మాట ఇదే!
By: Tupaki Desk | 12 July 2020 4:50 AM GMTబిగ్ బి అమితాబ్ - స్మాల్ బి అభిషేక్ ఇద్దరికీ కరోనా పాజిటివ్ రావడంతో ఫ్యాన్స్ లో ఒకటే టెన్షన్ నెలకొంది. బాలీవుడ్ లో ప్రస్తుతం ఆ ఇద్దరి ఆరోగ్యంపై ఆరాలు పీక్స్ కి చేరుకున్నాయి. ఒక్క ముంబై పరిశ్రమలోనే కాదు.. అన్ని పరిశ్రమల్లోనూ అమితాబ్ ఫ్యాన్స్ నుంచి ఆరాలు మొదలయ్యాయి. ఇంతకుముందే మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. అమిత్ జీ త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు చిరు.
ఇక అమితాబ్ తనతో పాటు ఉన్న వారందరినీ టెస్టులు చేయించుకోవాల్సిందిగా కోరిన సంగతి తెలిసిందే. ఐశ్వర్యారాయ్- జయాబచ్చన్ లకు టెస్టులు జరిగాయి. ఇంతకీ మాజీ విశ్వసుందరి ఐశ్వర్యారాయ్ క్షేమమేనా? జయాజీ కుశలమేనా? అంటూ అభిమానుల్లో ఒకటే ఆందోళన నెలకొంది.
దీనిపై మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపే స్పందించారు. ఆ ఇద్దరికీ జరిపిన పరీక్షల్లో నెగిటివ్ అని వచ్చింది. కేవలం అమితాబ్ - అభిషేక్ బచ్చన్ లకు మాత్రమే పాజిటివ్ అని తెలిపారు. ఐష్-జయాజీలకు యాంటిజెన్ పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ వచ్చిందని అయితే ఇంకా పూర్తిస్థాయిలో రిపోర్ట్స్ తెలియాల్సి ఉందని ఆయన తెలిపారు. అప్పటివరకూ ఆ ఇద్దరినీ క్వారంటైన్ లోనే ఉంచామని వెల్లడించారు.
అమితాబ్ బచ్చన్- అభిషేక్ బచ్చన్ సాధ్యమైనంత త్వరగా కొలుకుంటారని తాను ఆశిస్తున్నానని మంత్రివర్యులు అన్నారు. ``ఇక తనకు తన తండ్రి అమితాబ్ బచ్చన్ కి మైల్డ్ సింప్టమ్స్ మాత్రమే ఉన్నాయి. ఎవరూ కంగారు పడాల్సింది ఏమీ లేద``ని అభిషేక్ ట్వీట్ చేశారు. తమకు చికిత్స అందిస్తున్న నానావతి ఆస్పత్రి వర్గాలకు అమితాబ్ బచ్చన్ కృతజ్ఞతలు తెలిపారు.