Begin typing your search above and press return to search.
'అక్కినేని' ఉనికిని కోల్పోతోందా?
By: Tupaki Desk | 29 April 2022 9:31 AM GMTఅక్కినేని హీరోస్ ఉనికిని కోల్పోతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇండస్ట్రీలో వున్న స్టార్ ఫ్యామిలీస్ లో అక్కినేని ఫ్యామిలీ ఒకటి. మిగతా ఫ్యామిలీస్ హీరోలు వంద కోట్ల సినిమాలు.. పాన్ ఇండియా మూవీస్ చేస్తుంటే అక్కినేని వారి ఖాతాలో కనీసం 50 కోట్ల సినిమా కూడా లేకపోవడం ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. టాలీవుడ్ హీరోల్లో బాలీవుడ్ లో మంచి పేరున్న హీరో కింగ్ నాగార్జున. రామ్ గోపాల్ వర్మ ట్రెండ్ సెట్టర్ 'శివ'తో బాలీవుడ్ ప్రేక్షకుల్ని పలకరించిన నాగార్జున ఆ తరువాత అదే క్రేజ్ తో బాలీవుడ్ లో వరుస క్రేజీ ఆఫర్లని సొంతం చేసుకున్నారు.
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తో కలిసి 'ఖుధాగవా'లో నటించి ఆయనకు సమానమైన పాత్రలో శ్రీదేవికి చోడీగా కనిపించిన ఘనత కింగ్ నాగ్ సొంతం. ద్రోహీ, మహేష్ భట్ 'క్రిమినల్', అక్షయ్ కుమార్ తో 'అంగారే'..అజయ్ దేవగన్ తో 'జఖమ్', అమితాబ్, రవీనా టాండన్ లతో అగ్నివర్ష, జేపీ దత్తా ఎల్ ఓసీ వంటి చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణ్ బీకర్ కపూర్ , అలియాభట్ జంటగా నటిస్తున్న 'బ్రహ్మాస్త్ర'లో నటిస్తున్నారు.
టాలీవుడ్ హీరోల్లో బాలీవుడ్ తో ఎవరికీ లేని అనుబంధం నాగార్జునకు వుంది. 90వ దశకం నుంచి నాగా్ బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ వస్తున్నారు. అయితే ప్రస్తుతం వున్న ట్రెండ్ కు అనుగుణంగా ఆయన సినిమాల్లో కీరోల్ పోషించలేకపోతున్నారు. అంతే కాకుండా ఆయన చేస్తున్న సినిమాలు ఇంత వరకు 50 కోట్ల బడ్జెట్ కు మించకపోవడం గమనార్హం. 'సోగ్గాడే చిన్నినాయన' వసూళ్ల పరంగా 50 కోట్ల క్లబ్ లో చేరినా అక్కినేని ఫ్యామిలీ నుంచి ఇంత వరకు 50 కోట్ల బడ్జెట్ తో చేసిన సినిమా లేకపోవడం గమనార్హం.
మిగతా స్టార్ లతో పోలిస్తే నాగ్ కు బాలీవుడ్ తో సంబంధాలున్నా ఆ స్థాయిలో నాగ్ సినిమాలు చేయలేకపోతున్నారు. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలు అంతగా ఆకట్టుకోవడం లేదు కూడా. ఇటీవల చేసిన సినిమా 'బంగార్రాజు' కూడా యావరేజ్ గానే నిలిచింది. ఏజ్ మీదపడుతున్న నేపథ్యంలో ఆయన నుంచి భారీ సినిమాలు రావడం కష్టమే. అయితే ఆయన తనయులు నాగచైతన్య కూడా ఆ వైపుగా ప్రయత్నాలు చేయడం లేదు.
ప్రస్తుతం బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ నటిస్తున్న 'లాల్ సింగ్ చద్దా'లో నాగచైతన్య ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇదే అతని తొలి బాలీవుడ్ మూవీ. అయితే ఇది తను హీరోగా నటిస్తున్న సినిమా కాదు. కేవలం కీ రోల్ మాత్రమే. ఇక విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో ఓ వెబ్ సిరీస్ చేస్తున్నారు. 'దూత' పేరుతో పది ఎపిసోడ్ లు గా రూపొందిన ఈ సీరిస్ తో పాన్ ఇండియా వైడ్ గా పాపులర్ కావాలని ప్రయత్నాలు చేస్తున్నాడు చై.
ఇదిలా వుంటే కెరీర్ ప్రారంభం నుంచి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు చూసిన అఖిల్ ఇప్పడిప్పుడే హీరోగా కుదురుకుంటున్నాడు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం 'ఏజెంట్'. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్నారు. దీంతో ఈ మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి. పాన్ ఇండియా వైడ్ గా ఈ మూవీతో పాపులర్ కావాలన్నది అఖిల్ స్కెచ్. అది ఎంత వరకు నెరవేరుతుందన్నది తెలియాలంటే ఆగస్టు 12 వరకు వేచి చూడాల్సిందే.
అక్కినేని హీరోలంతా కలిసి నటించిన చిత్రం 'మనం' వసూళ్ల పరంగా సంచలనాలు సృష్టించి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన ఈ మూవీ తప్ప అక్కినేని వారికి చెప్పుకొదగ్గ సినిమా లేదు. ఇకనైనా అక్కినేని వారి వారసులు అందరి హీరోల్లాగే రేసులో ముందుండి తమ లెగస్సీని కాపాడుకుంటూ భారీ చిత్రాలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.