Begin typing your search above and press return to search.
అక్కినేని ఇంట ఆశాకిరణం అతడొక్కడేనా?
By: Tupaki Desk | 8 Feb 2022 7:22 AM GMTఅక్కినేని ఇంట ఫ్యామిలీ హీరోలకు మాస్ ఇమేజ్ అంతగా లేదన్నది వాస్తవం. ఏఎన్నార్ వేసిన క్లాస్ అనే పునాదిపైనే ఆ హీరోలంతా ప్రయాణం కొనసాగిస్తున్నారు. నాగార్జున..నాగచైతన్య మాస్ ఫాలోయింగ్ కోసం కొన్ని సినిమాలు చేసి సక్సెస్ అయినా మాస్ ఫాలోయింగ్ మాత్రం అంతంత మాత్రమే. ఏఎన్నార్ ప్రభావం ఆ ఫ్యామిలీ హీరోలపై అంతగా ఇంపాక్ట్ చూపిస్తోంది. నాగచైతన్యని మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ చేయాలనే నాగార్జున గట్టి ప్రయత్నాలు చేసి విరమించుకున్నారు. నిజానికి చైకి ఆ ఇమేజ్ తీసుకొచ్చేందుకే డెబ్యూ మూవీ `జోష్ `ని ఎంపిక చేసుకున్నారు నాగ్.
కానీ ఆ సినిమా అంచనాల్ని అందుకోవడం విఫలమైంది. ఆ తర్వాత చైతన్య `ఆటో నగర్ సూర్య`.. `తడాఖ`..`దడ` లాంటి యాక్షన్ చిత్రాలు చేసినా కలిసి రాలేదు. దీంతో ఆ హీరో కూడా పూర్తిగా క్లాస్ సబ్జెక్ట్ లవైపు టర్న్ అయిపోయారు. యూత్ ..ఫ్యామిలీ ఆడియన్స్ టార్గెట్ గా సినిమాలు చేస్తున్నాడు. `మజిలి`..`వెంకీ మామ`..`లవ్ స్టోరీ`..`బంగార్రాజు` లాంటి చిత్రాలు సక్సెస్ అయినా ఓ సెక్షన్ ఆడియన్స్ కే రీచ్ అయ్యాయి. ఆ రకంగా చై సేఫ్ జోన్ లో ఉన్నాడు. రిస్క్ తీసుకోకుండా అదే జోనర్ ని కొనాసగిస్తున్నట్లు తాజా కమిట్ మెంట్లను బట్టి తెలుస్తోంది. ప్రస్తుతం విక్రమ్. కె. కుమార్ దర్శకత్వంలో `థాంక్యూ`లో నటిస్తున్నాడు.
విక్రమ్ సినిమాల గురించి చెప్పాల్సిన పనిలేదు. డిఫరెంట్ కంటెంట్ తో తెరకెక్కే చిత్రాలు మాస్ ఇమేజ్ కి అతని చిత్రాలు ఎప్పుడూ దూరమే. ఇది కూడా క్లాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేసుకుని తెరకెక్కిస్తోన్న చిత్రమని టాక్ వినిపిస్తోంది. ఇందులో చై మూడు డిఫరెంట్ షెడ్స్ లో కనిపించనున్నాడు. ఇక బాలీవుడ్ లో చైతన్య `లాల్ సింగ్ చద్దా` లో ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా కామెడీ డ్రామా నేపథ్యంతో కూడుకున్నది. యాక్షన్ ఏమాత్రం స్కోప్ లేదు. ఆ రకంగా బాలీవుడ్ లో చైతన్య లాంచింగ్ మూవీతోనూ ఆ ఛాన్స్ లేదని తెలుస్తోంది.
ఈ విషయాన్ని అక్కినేని ఫ్యామిలీ బాగా అవగతం చేసుకుందో ఏమో! అఖిల్ విషయంలో ఇప్పటిరకూ మాస్ ఇమేజ్ పోరాటం చేయలేదని తెలుస్తోంది. ఇప్పటివరకూ అఖిల్ చేసిన సినిమాలన్నీ లవ్ స్టోరీలే. `హలో`..`మిస్టర్ మజ్ను`..`మోస్ట్ ఎలిజ్ బుల్ బ్యాచ్ లర్` అన్ని యూత్ టార్గెట్ గా రిలీజ్ అయినవే. అయితే ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో `ఏజెంట్` చిత్రంలో నటిస్తున్నాడు. ఇది స్పై థ్రిల్లర్. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లను బట్టి `ఏజెంట్` యాక్షన్ సన్నివేశాలకు స్కోప్ ఎక్కువగా కనిపిస్తోంది. సినిమాపై మంచి అంచనాలున్నాయి. మరి అక్కినేని ఫ్యామిలీ ఆశిస్తోన్న మాస్ ఇమేజ్ కోరిక అఖిల్ తీరుస్తాడేమో చూడాలి. మరి చైతన్య కి అంతటి సత్తా లేదా? అంటే ఛాన్సెస్ కనిపిస్తెన్నాయి.
చైతన్య కథల విషయంలో ఇంకా బ్రిలియంట్ గా థింక్ చేయాల్సి ఉంది. ఎందుకంటే రొటీన్ సినిమాలు సాధించలేనివి ఇన్నో వేటివ్ థాట్స్ సాధిస్తున్నాయి. ఎక్కువగా కొత్తదనం కోరుకుంటూ..కథను కమర్శిలైజ్ చేయించగలగాలి. అలా చేయాలంటే కథ రైటింగ్ ప్రారంభ దశ నుంచే వర్కౌట్ చేయాల్సి ఉంటుంది. బన్నీ తన కొత్త సినిమాకు అదే పార్ములాను వాడుతూ సక్సెస్ లు అందుకుంటున్న సంగతి తెలిసిందే.