Begin typing your search above and press return to search.
స్నేహితుడి పిలుపును అలీ గౌరవిస్తాడా?
By: Tupaki Desk | 3 Feb 2020 1:51 PM GMTపవర్ స్టార్ పవన్ కల్యాణ్ - అలీ మధ్య స్నేహం గురించి తెలిసిందే. ఆ ఇద్దరి మధ్యా జాన్ జిగిరీ దోస్తీ గురించి అభిమానుల్లో నిరంతరం చర్చ సాగుతుంటుంది. పవన్ ఏదైనా సినిమాలో నటిస్తే అందులో అలీ తప్పనిసరిగా ఉండాల్సిందే. ఆ ఇద్దరి మధ్యా హిలేరియస్ కామెడీ సీన్స్ అంతే రసవత్తరంగా తీర్చిదిద్దేందుకు దర్శకులు పోటీ పడ్డారు.
అయితే ఇటీవల రాజకీయాలు ఈ జిగిరీ దోస్తీల మధ్య దూరం పెంచిన సంగతి తెలిసిందే. జనసేన పార్టీని స్థాపించి పవన్ కల్యాణ్ జనాల్లోకి వెళితే స్నేహితుడి వెంట వెళ్లేందుకు అలీ సిద్ధపడలేదు. జనసేనలో చేరకుండా వైకాపా పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీపడాలన్న ఆకాంక్షను వెలిబుచ్చాడు. ఆ క్రమంలోనే ఆ పార్టీలో చేరి క్యాంపెయిన్ చేశారు. అటుపై పవన్ - అలీ మధ్య క్లాషెస్ గురించి ఆసక్తికర చర్చ సాగింది. రాజకీయ సిద్ధాంతం పరంగా ఇద్దరి దారులు వేరయ్యాయి కాబట్టి అందుకు పవన్ అభిమానులు చిన్నబుచ్చుకున్నారు. స్నేహితుడిని కాదని వెళ్లిన అలీపై పవన్ అభిమానులు రకరకాల దురసైన కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే.
అయితే రాజకీయాలు రాజకీయాలే సినిమాలు సినిమాలే. ప్రస్తుతం సన్నివేశం మారింది. పవన్ పూర్తిగా సినిమాలతో బిజీ అయిపోతున్నారు. ఆ క్రమంలోనే పింక్ రీమేక్ లాయర్ సాబ్ తో రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం అలీని ఎంపిక చేయాల్సిందిగా పవన్ సూచించారట. రాజకీయాల్లో దారులు వేరైనా సినిమాల పరంగా తమ మధ్య స్నేహం కొనసాగుతుందని చెప్పకనే తెలిపారు. ఆ క్రమంలోనే అలీని దర్శకనిర్మాతలు ఆదిత్య శ్రీరామ్ - దిల్ రాజు సంప్రదించారని తెలుస్తోంది. అలీ ఇప్పటివరకూ అంగీకరించలేదు. అయితే రాజకీయాలు - బుల్లితెరపై తన కమిట్ మెంట్లను బట్టి కాల్షీట్లు కేటాయిస్తాడా? తిరిగి తన స్నేహితుడితో కలిసి నటిస్తాడా? అన్నది చూడాలి. లాయర్ సాబ్ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. అంజలి- మల్లేశం ఫేమ్ అనన్య- నివేదా థామస్ నాయికలు. సమ్మర్ కానుకగా మే 23న రిలీజ్ చేయనున్నారు.