Begin typing your search above and press return to search.

అల్లు వారి నుంచి ఆ ప్ర‌య‌త్నం జ‌ర‌గ‌డం లేదా?

By:  Tupaki Desk   |   15 Nov 2022 1:30 PM GMT
అల్లు వారి నుంచి ఆ ప్ర‌య‌త్నం జ‌ర‌గ‌డం లేదా?
X
నంద‌మూరి బాల‌కృష్ణ 'ఆహా' ఓటీటీ కోసం తొలి సారి హోస్ట్ గా మారి 'అన్ స్టాప‌బుల్ విత్ ఎన్ బి కె' టాక్ షోలో ప్ర‌త్య‌క్ష‌మైన విష‌యం తెలిసిందే. క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబుతో ఫ‌స్ట్ సీజ‌న్ ఫ‌స్ట్ ఎపిసోడ్ ని ప్రారంభించి సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కావ‌డంతో రీసెంట్ గా సీజ‌న్ 2 ని మొద‌లు పెట్టిన విషయం తెలిసిందే. ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు, ఆయ‌న త‌న‌యుడు నారా లోకేష్ తో స్టార్ట్ చేయ‌డం అది సూప‌ర్ హిట్ కావ‌డం తెలిసిందే.

టాలీవుడ్‌లో ఇంత వ‌ర‌కు చాలా మంది టాక్ షోలు చేసినా అన్నింటికి మించి భారీ క్రేజ్ తో పాటు పాపుల‌ర్ అయిన షోగా 'అన్ స్టాప‌బుల్ విత్ ఎన్ బి కె' పేరు తెచ్చుకుంది. అంతే కాకుండా టాక్ షోల‌లో అత్య‌ధిక క్రేజ్ ని సొంతం చేసుకున్న టాక్ షోగా ఐఎండీబీ లో రికార్డు స్థాయి రేటింగ్స్ ని సొంతం చేసుకుని స‌రికొత్త రికార్డుల్ని సొంతం చేసుకుంది. ఈ షోలో ఫ‌స్ట్ సీజ‌న్ లో క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు నుంచి సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు వ‌ర‌కు ప‌లువురు క్రేజీ సెల‌బ్రిటీలు పాల్గొన్నారు.

కానీ ఈ టాక్ షోలో ఇప్ప‌టి వ‌ర‌కు ఎంతో మంది స్టార్స్ ఎంట్రీ ఇచ్చినా ఈ టాక్ షోలో మాత్రం మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున‌, విక్ట‌రీ వెంక‌టేష్ ఇంత వ‌ర‌కు పాల్గొన‌లేదు. వీరు షోలో పాల్గొంటే బాల‌య్య రియాక్ష‌న్ ఎలా వుంటుంది?.. బాల‌య్య ప్ర‌శ్న‌ల‌కు వారి స‌మాధానాలు, రియాక్ష‌న్ ఎలా వుంటాయా? అని మెగా ఫ్యాన్స్, అక్కినేని, ద‌గ్గుబాటి ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. అంతే కాకుండా చిరు, చ‌ర‌ణ్ క‌లిసి షోలో సంద‌డి చేస్తే చూడాల‌ని కూడా చాలా మంది ఆరా తీస్తున్నారు.

అల్లు అర‌వింద్ ఆహా కోసం నిర్వ‌హిస్తున్న షో కాబ‌ట్టి చిరు, చ‌ర‌ణ్ ల‌ని ఈ షోలోకి తీసుకురావ‌డం తేలికే కానీ అది ఎందుకు జ‌ర‌గ‌డం లేదు. చిరుకు, బాల‌య్య‌కు మ‌ద్య గ్యాప్ వ‌చ్చిందా? లేక అల్లు అర‌వింద్ ఆ ప్ర‌య‌త్నాలు జ‌ర‌గ‌డం లేదా? అనే చ‌ర్చ జ‌రుగుతోంది.

మెగా ఫ్యాన్స్ కి కూడా ఇది ఎందుకు జ‌ర‌గ‌డం లేదో అంతు చిక్క‌డం లేద‌ట‌. ఇటీవ‌ల చిరు ఏపీ సీఎంని, గ‌తంలో టీఎస్ సీఎంని క‌లిసిన సంద‌ర్భంలో బాల‌య్య‌కు ప్రాధాన్య‌త ఇవ్వ‌క‌పోవ‌డం.. ఆ త‌రువాత బాల‌య్య ఇండైరెక్ట్ గా చిరుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం వ‌ల్ల ఇద్ద‌రి మ‌ధ్య గ్యాప్ ఏర్ప‌డింద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.  

ఆ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టి 'అన్ స్టాప‌బుల్ విత్ ఎన్ బి కె'లోకి మెగాస్టార్ ఎంట్రీ ఇస్తాడ‌ని అభిమానులు ఆశ‌గా ఎదురుచూస్తున్నారు. అది త్వ‌ర‌లోనే జ‌రుగుతుందా?.. ఇంత‌కీ చిరు బాల‌య్య షోలోకి రాక‌పోవ‌డానికి కార‌ణం ఏంటీ? అన్న‌ది తెలియాలంటే మ‌రి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.