Begin typing your search above and press return to search.
అల్లు శిరీష్ హీరోగా నిలబడినట్టేనా?
By: Tupaki Desk | 7 Nov 2022 3:30 PM GMTఅల్లు శిరీష్ నటించిన లేటెస్ట్ రొమాంటిక్ లవ్ స్టోరీ 'ఊర్వశివో రాక్షసివో'. రాకేష్ శశి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ 2పై అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మోగిలినేని, విజయ్ నిర్మించారు. అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటించింది. శీరీష్ దాదాపు మూడున్నరేళ్ల విరామం తరువాత నటించిన ఈ మూవీ శుక్రవారం విడుదలై మంచి టాక్ ని సొంతం చేసుకుంది. తమిళ మూవీ 'ప్యార్ ప్రేమ కాదల్' ఆధారంగా ఈ మూవీని రీమేక్ చేశారు.
దర్శకుడు రాకేష్ శశి రూపొందించిన ఈ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో కే పాజిటివ్ టాక్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం మొదలు పెట్టింది. గత కొంత కాలంగా హీరోగా రాణించాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు శిరీష్. అయితే అతనికి తొలి అడుగు నుంచే ఇబ్బందులు మొదలయ్యాయి. అందరి వారసులకు భిన్నంగా శిరీష్ 'గౌరవం' సినిమాతో రాధామోహన్ డైరెక్షన్ లో హీరోగా తెరంగేట్రం చేశాడు. అయితే ఈ మూవీ ఆశించిన ఫలితాన్ని అందించకపోగా భారీడిజాస్టర్ అనిపించుకుని షాకిచ్చింది.
తొలి అడుగే షాకివ్వడంతో శిరీష్ కెరీర్ నత్తనడకన సాగడం మొదలు పెట్టింది. మారుతి అయినా తన కెరీర్ ని మారుస్తాడని ఆశపడి తనతో 'కొత్త జంట' చేస్తే అది కూడా పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. పరశురామ్ రూపొందించిన 'శ్రీరస్తు శుభమస్తు' మాత్రమే శిరీష్ కు సక్సెస్ ని అందించింది. ఆ తరువాత అతని కెరీర్ మారుతుందని అంతా భావించారు కానీ మళ్లీ మొదటికే వచ్చింది. మెగా ఫ్యామిలీ నుంచి పరిచయమైన హీరోలంతా సెటిలైపోతుంటే శిరీష్ మాత్రం స్ట్రగుల్ అవుతూనే వున్నాడు.
కెరీరన్ ప్రారంభం నుంచి శిరీష్ హీరో మెటీరియల్ కాదంటూ కామెంట్ లు రావడంతో అదే అతని సినిమా పాలిట శాపంగా మారుతూ వచ్చింది. ఎట్టకేలకు 'ఊర్వశీవో రాక్షసివో' సినిమాతో ఇండస్ట్రీలోనూ, ఆడియన్స్ లోనూ అటెన్షన్ ని క్రియేట్ చేయగలిగాడు.
యూత్ ని ఎట్రాక్ట్ చేస్తున్న ఈ మూవీలో శిరీష్ కనిపించలేదు. ఫ్యామిలీ ఆడియన్స్ ని పక్కన పెడితే యూత్ ఆడియన్స్ ని మాత్రం ఈ సినిమా విశేషంగా ఆకట్టుకుంటుండటంతో తనపై వున్న నెగెటివిటీ పోయిందని, హీరోగా శిరీష్ నిలబడినట్టేననే కామెంట్ లు వినిపిస్తున్నాయి.
ఇదిలా వుంటే ఈ మూవీ యుఎస్ లో మంచి ఓపెనింగ్స్ ని రాబట్టింది. అయితే శిరీష్ నటించిన 'ఒక్క క్షణం'కు మించి మాత్రం రాబట్టలేకపోయింది. 'ఒక్క క్షణం' యుఎస్ బాక్సాఫీస్ వద్దతొలి వారాంతానికి 100కె డాలర్లని రాబడితే 'ఊర్వశీవో రాక్షసివో' మాత్రం 60కె డాలర్లని మాత్రమే రాబట్టగలిగింది. అయినా సరే ఈ మూవీకి అక్కడ గుడ్ స్టార్ట్ లభించిందని రానున్న రోజుల్లో మరిన్ని కలెక్షన్ లని రాబడుతుందని చెబుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.