Begin typing your search above and press return to search.

అన‌సూయ సెల్ఫ్ గోల్ చేసుకుంటోందా?

By:  Tupaki Desk   |   14 Feb 2022 4:55 AM GMT
అన‌సూయ సెల్ఫ్ గోల్ చేసుకుంటోందా?
X
బుల్లితెర‌తో కామెడీ షో ద్వారా పాపులారిటీని సొంతం చేసుకుంది అన‌సూయ‌. అదే క్రేజ్ తో వెండితెర‌పై కూడా త‌న‌దైన స్టైల్లో ప్రేక్ష‌కుల్ని మెస్మ‌రైజ్ చేస్తోంది. బుల్లితెర‌ని వీడికుండానే అక్క‌డ వ‌రుస షాల‌ల్లో పాల్గొంటూనే సినిమాల్లోనూ న‌టిస్తూ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. గ‌తంతో పోలిస్తే వ‌రుస క్రేజీ ఆఫ‌ర్ల‌ని సొంతం చేసుకుంటూ వెండితెర‌పై య‌మ బిజీగా మారిపోయింది. `రంగ‌స్థ‌లం` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీలో `రంగ‌మ్మ‌త్త‌గా` ఆక‌ట్టుకుని విమ‌ర్శ‌ల‌కు ప్ర‌శంస‌లు సొంతం చేసుకుంది.

ఇదే ఉత్సాహంతో ఇటీవ‌ల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సుకుమార్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన `పుష్ప ది రైజ్‌`లో దాక్షాయ‌ణిగా క‌నిపించింది. దీనికి సంబంధించిన పార్ట్ 2 త్వ‌ర‌లో ప్రారంభం కాబోతోంది. అందులో అన‌సూయ పాత్ర మ‌రింత హైలైట్‌గా క్రుయ‌ల్ గా వుంటుంద‌ని ఇన్ సైడ్ టాక్ .ఈ పాత్ర‌తో అన‌సూయ‌కు స‌రికొత్త ఇమేజ్ రావ‌డం గ్యారెంటీ అని చెబుతున్నారు. ఇదిలా వుంటే అన‌సూయ సెల్ఫ్ గోల్ చేసుకుంటోంద‌ని ఇండ‌స్ట్రీలో ప్ర‌చారం మొద‌లైంది.

అందుకు ప్ర‌ధాన కార‌ణం మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టించిన `ఖిలాడీ` చిత్రం అని చెబుతున్నారు. ఇందులోని ఫ‌స్ట్ పార్ట్‌లో అన‌సూయ హీరోయిన్ డింపుల్ హ‌యాతీకి త‌ల్లిగా క‌నిపించింది. ఓల్డ్ స్కూల్ మ‌ద‌ర్ గా అన‌సూయ క‌నిపించిన తీరు ప్రేక్ష‌కుల్ని అస‌హ‌నానికి గురిచేసింద‌ట‌. సెకండ్ పార్ట్ లో ఇంట‌ర్వెల్ త‌రువాత స‌డ‌న్ గా మోడ్ర‌న్ యువ‌తిగా చూపించిన తీరు ఆడియ‌న్స్ తో పాటు ఆమె అభిమానుల్ని షాక్ కు గురిచేసింది.

అంతే కాకుండా ఓవ‌ర్ డోస్ మేక‌ప్‌, షార్ట్స్ లో క‌నిపించిన తీరు చాలా మందికి అస‌భ్య‌క‌రంగా.. చాలా వోవ‌ర్ గా అనిపించింద‌ని చెబుతున్నారు. ప్ర‌స్తుతం `ఖిలాడీ`లో అన‌సూయ పోషించిన పాత్ర‌, ఆమె కాస్ట్యూమ్స్‌, మేక‌ప్ వేసుకున్న దీరు ఇప్ప‌డు హాట్ టాపిక్ గా మారింది. ఇక మ‌రో విష‌యం ఏంటంటే సెకండ్ హాఫ్ లో అన‌సూయ‌కు చెప్పుకోద‌గ్గ స్కోప్ లేదు. దీంతో ప్రాధాన్య‌త లేని పాత్ర‌లో అన‌సూయ క‌నిపించాల్సి వ‌చ్చింది.

అయితే `రంగ‌స్థ‌లం, పుష్ప లాంటి చిత్రాల్లో ప్రాధాన్య‌త వున్న పాత్ర‌ల్లో న‌టించిన అన‌సూయ ఇలాంటి పాత్ర‌ల‌ని అంగీక‌రించ‌డం ఏంటీ? అని కొంత మంది.. సెల్ప్ గోల్ చేసుకుంటోందా? అని మ‌రి కొంత మంది..ఆమెకు జ‌డ్జిమెంట్ లేద‌ని మ‌రి కొంత మంది కామెంట్ చేస్తున్నారు. అయితే అన‌సూయ `ఖిలాడీ` చిత్రంలో సిల్లీ రోల్ చేయ‌డానికి ప్ర‌ధాన కార‌ణం డ‌బ్బు అని, ఆ కార‌ణంగానే ఆమె ఆ పాత్ర‌ని అంగీక‌రించాల్సి వ‌చ్చింద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. డ‌బ్బు కోస‌మే ఇలాంటి పాత్ర‌ల్లో న‌టించ‌డం వ‌ల్ల కెరీర్ ప‌రంగా సెల్ప్ గోల్ చేసుకోవ‌డం అవుతుంది క‌దా అని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు వాపోతున్నాయి.