Begin typing your search above and press return to search.

స్వీటీ కాలికి గాయం.. నిజమేనా??

By:  Tupaki Desk   |   19 Jun 2019 5:06 AM GMT
స్వీటీ కాలికి గాయం.. నిజమేనా??
X
ఈ టాలీవుడ్ కు ఏమైంది.. ఎటు చూసినా హీరోలకు గాయాలు.. ఫ్రాక్చర్లు అని ప్రేక్షకుల్లో చర్చ సాగుతోంది. రామ్ చరణ్.. ఎన్టీఆర్.. నాగ శౌర్య.. సందీప్ కిషన్.. శర్వానంద్ ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాలా పెద్దదిగా ఉంది. ఈ గాయాల కారణంగా ఇప్పటికే పలు టాలీవుడ్ చిత్రాల షూటింగులు రద్దయ్యాయి. అయితే తాజాగా మరో విషయం బయటకు వచ్చింది.

స్వీటీ అనుష్కకు కూడా కాలికి గాయం అయిందిని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈమధ్య 'సైరా' షూటింగ్ లో పాల్గొన్న సమయంలో కాలి నెప్పితో బాధపడిందని సమాచారం. అనుష్క 'సైలెన్స్' అనే చిత్రంలో కూడా నటిస్తోంది. అయితే ఈ కాలి గాయం కారణంగా షూటింగ్ కు రెగ్యులర్ గా హాజరు కావడం లేదని సమాచారం. అయితే అనుష్క తన కాలికి గాయం అయిన విషయాన్ని రహస్యంగా ఉంచుతోందని టాక్ వినిపిస్తోంది.

'సైలెన్స్' షూటింగ్ ప్రారంభానికి ముందు అనుష్క బరువు తగ్గి స్లిమ్ లుక్ లోకి మారింది. కానీ ఈ కాలి గాయం కారణంగా మళ్ళీ బరువు పెరిగిందని కూడా అంటున్నారు. మరి ఈ విషయంపై అనుష్క మాత్రం ఇంతవరకూ స్పందించలేదు.