Begin typing your search above and press return to search.
అనుష్క శర్మ ఒకేసారి 4 స్టేడియంల్లో ఆడుతోందా?
By: Tupaki Desk | 12 April 2022 1:30 AM GMTబాలీవుడ్ నటి అనుష్క శర్మ మళ్లీ సినిమాల్లో సాలిడ్‌గా కంబ్యాక్ అవ్వడానికి సన్నాహాలు చేస్తోంది. అమ్మడు 'చక్దా ఎక్స్‌ప్రెస్' కోసం ఇప్పటికే ప్రిపరేషన్ ప్రారంభించింది. ఇందులో అనుష్క మహిళా క్రికెటర్ జులన్ గోస్వామి పాత్రకు మళ్లీ జీవం పోస్తుంది. ఇండియా క్రికెట్ టీమ్ లో ఫాస్ట్ బౌలర్ జీవితం ఆధారంగా.. స్పోర్ట్స్ బయోపిక్ లో నటించడం అనుష్కకు ఇదే తొలిసారి కావడం విశేషం.
విరాట్ కోహ్లీ ని పెళ్లాడిన తర్వాత అనుష్కకి క్రికెట్ పై మరింత మక్కువ పెరిగింది. ఆ స్ఫూర్తితోనూ మేకప్ వేసుకోవడానికి ఎంతో ఎగ్టైట్ మెంట్ తో ఎదురుచూస్తోంది. దర్శకుడు ప్రోసిత్ రాయ్ - నిర్మాత కర్నేష్ శర్మ ఏమాత్రం రాజీ పడకుండా చిత్రాన్ని తెరకెక్కించడానికి రంగం సిద్దం చేస్తున్నారు.
సినిమా నిర్మాణాన్ని వేగవంతం చేస్తూ.. అనుష్క శర్మ - 'చక్దా ఎక్స్‌ప్రెస్' బృందం ప్రపంచంలోని నాలుగు అగ్ర క్రికెట్ స్టేడియంలలో షూటింగ్ చేయడానికి రెడీ అవుతోంది. బ్రిటన్‌లోని లార్డ్స్ స్టేడియం లో తొలి షెడ్యూల్ ప్లాన్ చేసారు. అదే జరిగితే క్రికెట్‌లోని పవిత్ర మైదానానికి అనుష్క కాలు పెట్టడం అన్నది ఎంతో గర్వ కారణంగానే చెప్పొచ్చు.
ఇంకా ఈ మెగా వెన్యూ కాకుండా నటిల పై ఉత్తర ఇంగ్లాండ్‌లోని హెడింగ్లీ స్టేడియంలో కూడా షూట్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. అలాగే ఇండియాలోని ఓ ప్రధాన స్టేడియంలో కూడా కీలక సన్నివేశాలు షూట్ చేసుకుందుకు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
"యార్క్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ కర్నేష్ శర్మ యొక్క క్లీన్ స్లేట్ ఫిల్మ్‌జ్‌తో కొత్త స్పాన్సర్‌షిప్ ఒప్పందాన్ని ప్రకటించింది. ఇది 2022 సీజన్‌కు హెడ్డింగ్లీలో ప్రిన్సిపల్ స్పాన్సర్‌గా బాధ్యతలు స్వీకరించనుంది. కాబట్టి అనుష్క ఈ ఐకానిక్‌లో షూట్ చేయడం ఖాయం గా చెప్పొచ్చు.
అనుష్క సినిమాలు ఎల్లప్పుడూ పెద్ద స్థాయిలో ఉంటాయి. కర్నేష్ - అనుష్క కాంబినేషన్ లో వస్తోన్న 'చక్దా ఎక్స్‌ప్రెస్' మంచి బయోపిక్ కావాలని కోరుకుంటున్నారు. అందువల్ల అనుష్క ఈ సినిమా ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు మరింత రీచ్ అవుతుందని చెప్పొచ్చు.
దేశభక్తి - సమానత్వం యొక్క సందేశం సినిమాలో ప్రధానంగా హైలైట్ కానుంది. కథలో ఎంతో ఎమోషన్ ఉంది. జులెన్ గోస్వామి భారతదేశం కోసం క్రికెట్ ఆడాలనే తన కలను నెరవేర్చుకోవడానికి స్త్రీ ద్వేషపూరిత రాజకీయాల వల్ల అడ్డంకులు ఎదురైనప్పటికీ తన లక్ష్యయానల్ని చేరుకుంది. అలా జులన్ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు.
ఝులన్ స్ఫూర్తిదాయకమైన ప్రయాణాన్ని 'చక్దా ఎక్స్‌ప్రెస్'లో అద్భుతంగా ఆవిష్కరించే అవకాశం ఉంది. తన లక్ష్యంలో విజయం సాధించింది. భారత మహిళల జాతీయ క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా కొనసాగింది. దేశంలోని ఔత్సాహిక క్రికెటర్లకు రోల్ మోడల్‌గా నిలిచింది.