Begin typing your search above and press return to search.
మురుగదాస్ మళ్లీ పెద్ద తప్పు చేస్తున్నాడా?
By: Tupaki Desk | 21 Nov 2022 4:09 AM GMTబ్యాక్ టు బ్యాక్ ప్రయోగాలతో భారీ విజన్ తో సినిమాలు చేయడం ఏ.ఆర్.మురుగదాస్ స్టైల్. సమాజంలో ప్రస్తుత బర్నింగ్ టాపిక్ ని ఎంచుకుని ప్రజలు మెచ్చేలా తన సినిమాల్ని మలచడంలో ప్రభావవంతమైన మేకింగ్ శైలితో అతడు సంచలనాలు సృష్టించాడని చెప్పాలి. సందేశం అందిస్తూనే కమర్షియల్ పంథాలో సినిమాలు తీయడం అతడి ప్రత్యేకత.
కానీ ఎన్ని ప్రత్యేకతలు ఉన్నా ఇటీవలి కాలంలో అతడు రేసులో వెనకబడిపోయాడు. దానికి కారణం కొన్ని వరుస డిజాస్టర్లు అనడంలో సందేహం లేదు. స్పైడర్- దర్బార్ లాంటి చిత్రాలు భారీ అంచనాలతో రిలీజై బాక్సాఫీస్ వద్ద ఫెయిలయ్యాయి. భారీ బడ్జెట్లతో తెరకెక్కిన ఈ సినిమాలతో పంపిణీదారులు తీవ్రంగా నష్టపోయారని కథనాలొచ్చాయి.
ఏది ఏమైనా ఆ రెండు ఫెయిల్యూర్స్ తో అతడి ప్రతిభను ఎవరూ తక్కువ అంచనా వేయలేదు. కానీ స్టార్ హీరోలతో అతడు చేస్తున్న ప్రయత్నాలేవీ వెంటనే సఫలం కాకపోవడమే ఆశ్చర్యపరుస్తోంది. ఇంతకుముందు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో భారీ చిత్రానికి మురుగదాస్ ప్లాన్ చేస్తున్నారని కథనాలొచ్చాయి. ఇది గజినీకి సీక్వెల్ గా ఉంటుందని కూడా గుసగుసలు వినిపించాయి. కానీ అవేవీ నిజాలు కాలేదు. ఇంతలోనే మురుగదాస్ తదుపరి చిత్రం యానిమేషన్ కాన్సెప్టుతో ఉంటుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ఎఆర్ మురుగదాస్ ప్రేక్షకులకు గజిని- తుపాకి (తుప్పాకి) - కత్తి- స్టాలిన్ లాంటి కొన్ని క్రేజీ చిత్రాలను అందించారు. కానీ ఇటీవలి పరాజయాలు అతడికి ప్రతిబంధకంగా మారడంతోనే ఇప్పుడు యానిమేషన్ మూవీని ప్లాన్ చేస్తున్నారా? అన్నదానికి ఆన్సర్ రావాల్సి ఉంది. తమిళ ఫిల్మ్ సర్కిల్స్ లో తాజా కథనాల ప్రకారం..ఈసారి పూర్తిగా యానిమేషన్ చిత్రం కోసం ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తి స్వింగ్ లో సాగుతున్నాయని తెలిసింది. భారీ వీ.ఎఫ్.ఎక్స్ తో హాలీవుడ్ తరహా ఫాంటసీ చిత్రాన్ని మురుగదాస్ తెరకెక్కించనున్నారు.
దీనిని ఫాంటమ్ సంస్థ నిర్మిస్తుందని సమాచారం. మరోవైపు తన తదుపరి చిత్రాన్ని శింబుతో చేసే అవకాశం ఉందనే టాక్ కూడా వినిపిస్తోంది. అధికారికంగా ఇంకా ఏదీ ప్రకటించకపోయినా కానీ...ఈ వార్త సోషల్ ప్లాట్ ఫారమ్ లలో వైరల్ గా మారింది. మురుగదాస్ కి తమిళ బెల్ట్ తో పాటు ఇటు తెలుగు అటు హిందీలోను ఫాలోవర్స్ ఉన్నారు. అతడు ఏం చేసినా అందులో కొత్తదనం ఉంటుందన్నది అందరి నమ్మిక. అందుకే జయాపజయాలతో సంబందం లేకుండా మురుగదాస్ సినిమా వస్తోంది అంటే ఆసక్తిగా వేచి చూస్తారు.
కానీ ఈసారి అతడు ఒక యానిమేషన్ కాన్సెప్టును ఎంచుకోవడం కొందరిని నిరాశపరుస్తోంది. అతడు తన రెగ్యులర్ శైలిలోనే అద్భుతమైన సోషల్ డ్రామా కాన్సెప్టుతో మూవీ తెరకెక్కిస్తే బావుంటుందని తెలుగు ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అతడి నుంచి గజిని- స్టాలిన్ తరహాలో కమర్షియల్ ఎంటర్ టైనర్లు రావాలని కూడా ఆశిస్తున్నారు. మరి మురుగదాస్ తదుపరి ప్రయత్నం ఎలా ఉంటుందో అధికారికంగా ప్రకటించాక కానీ తెలీదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.