Begin typing your search above and press return to search.

హీరోయిన్లందరికి లవ్ వైఫై కనెక్ట్ చేస్తూ పోతున్నాడు!

By:  Tupaki Desk   |   29 Jun 2019 4:03 AM GMT
హీరోయిన్లందరికి లవ్ వైఫై కనెక్ట్ చేస్తూ పోతున్నాడు!
X
టీమ్ ఇండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ గురించి అసలు ఇంట్రో ఇవ్వాల్సిన పనే లేదు. ఎందుకంటే ఆటలో రాహుల్ టాలెంట్ కు ఎవరైనా ఫిదా కావాల్సిందే. అయితే రాహుల్ లో రెండు షేడ్స్ ఉన్నాయని టాక్ ఉంది. క్రికెటర్ గా తన అటతో అందరినీ మురిపించడమే కాదు.. లవ్వాటలో ముద్దుగుమ్మలను మెస్మరైజ్ చేస్తాడట. రాహుల్ పై అదేపనిగా వస్తున్న ఎఫైర్ వార్తలు ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతున్నాయి.

ఏదో ఒక హీరోయిన్ తో ఎఫైర్ వార్తలు వచ్చాయంటే సరేలే.. చాకు లాంటి క్రికెట్ కుర్రాడు కదా..ఎక్కడో అందమైన భామతో ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయి ఉంటుందని సరిపెట్టుకోవచ్చు. కానీ అదేపనిగా అందరికీ తన ప్రేమ వైఫైని ఎడాపెడా కనెక్ట్ చేస్తూ పోతున్నాడట. గతంలో నిధి అగర్వాల్ తో డేటింగ్ చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. ఆ సమయంలో స్పందించిన నిధి తనకు రాహుల్ టీనేజ్ నుండి తెలుసనీ.. రాహుల్ క్రికెటర్ కాకముందు నుంచి బెంగుళూరులోనే పరిచయం ఉందని తెలిపింది. ఇద్దరూ కలిసి డిన్నర్ కు వెళ్లామని ఒప్పుకుంటూనే 'ఫ్రెండ్' అని క్లారిటీ ఇచ్చింది.

అంతటితో రాహుల్ ఎఫైర్ న్యూస్ ఆగలేదు. సోనాల్ చౌహాన్ తో ఘాటు ప్రేమలో ఉన్నాడని గుసగుసలు వినిపించాయి. ఆ వార్తలు మరుగున పడేలోపు కొత్తగా ఆకాంక్ష రంజన్ కపూర్ తో కొత్త ట్రాక్ ఓపెన్ చేశాడని గుసగుసలు గుప్పుమన్నాయి. ఈమధ్య ప్రపంచ కప్ మ్యాచులు చూసేందుకు ఆకాంక్ష ఇంగ్లండ్ కు వెళ్ళింది. అయితే అసలు కారణం మ్యాచులు కాదని.. ప్రత్యేకంగా రాహుల్ కోసమే ఆ బ్రిటన్ ట్రిప్ అని అంటున్నారు. ఇంతకీ ఈ ఆకాంక్ష ఎవరంటే అలియా భట్ కు క్లోజ్ ఫ్రెండ్. త్వరలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోందట.

ఇంతటితో స్టొరీ పూర్తయితే థ్రిల్ ఏముంది చెప్పండి?.. అసలు రాహుల్ కు ఆకాంక్షకు మధ్య ఫ్రెండ్ షిప్ చెడిపోయిందని ఇప్పుడు రాహుల్ డేటింగ్ చేసే భామ సునీల్ శెట్టి కూతురు అతియా శెట్టి అని ఒక బాలీవుడ్ మ్యాగజైన్ తాజాగా సంచలన వార్తను ప్రచురించింది. ఫిబ్రవరి నుంచి రాహుల్ - అతియాల మధ్య బీకాం ఫిజిక్స్ వర్క్ అవుట్ అయిందట. ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఆకాంక్ష.. అతియా ఇద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ కావడం. దీంతో నెటిజన్లకు పిచ్చెక్కి ఎవరి మధ్యలో అసలు కెమిస్ట్రీ ఉంది.. ఈ బీకాం ఫిజిక్స్ ఉన్నట్టుండి మధ్యలో ఎక్కడినుంచి ఊడి పడిందని జుట్టు పీక్కుంటూ ఆలోచిస్తున్నారట.

పిచ్ లో ప్రత్యర్థులను ముప్పతిప్పలు పెట్టడమే కాదు. తన లవ్ ట్రాక్స్ నడిపే టాలెంట్ తో బాలీవుడ్ మీడియాకు కూడా చుక్కలు చూపిస్తున్నాడు. వరల్డ్ కప్ పూర్తయ్యే లోపు మళ్ళీ ఎవరితో ఎఫైర్ అంటారో ఏంటో!