Begin typing your search above and press return to search.
బాహుబలికి ఆస్కార్ సాధ్యమేనా?
By: Tupaki Desk | 26 July 2015 11:08 AM GMTఇక రికార్డుల గురించి మాట్లాడాల్సిన పని లేదు. బాహుబలి ఊహను మించి సాధించింది. వసూళ్ల రికార్డుల్ని కొల్లగొట్టి సిసలైన వీరుని తలపించింది ఈ సినిమా. అలెగ్జాండర్ దండయాత్రలా తలపించింది. రాజమౌళిని వేనోళ్లు కీర్తించాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులంతా హర్షించారు. ఓ రకంగా బాలీవుడ్ ని షేకాడించింది ఈ సినిమా. ఓ ప్రాంతీయ సినిమా ఈ రేంజు వసూళ్లు సాధించడం అనేది చిరిత్రలోనే లేదు.
భారతదేశంలోని టాప్-3 సినిమాల్లో ఒకటిగా ర్యాంకింగ్స్ లోకి చేరింది బాహుబలి. అయితే ఇంతటి ఘనకీర్తి సాధించిన బాహుబలి ఆస్కార్ సాధిస్తుందా? అన్న ప్రశ్న ఎదురైంది. ఈ సినిమా దేశీయంగా కొల్లగొట్టిన రికార్డుల్ని బట్టి కచ్ఛితంగా జాతీయ అవార్డుల రేసులో ఉందని అర్థమైపోయింది. ఓ రెండు, మూడు విభాగాల్లో అయినా జాతీయ అవార్డులు రావాల్సిందే.
కాని ఆస్కార్ బరిలో నిలవాలంటే ఈ సినిమాకి ఉన్న అర్హత ఏంటి? అన్న ప్రశ్న వచ్చింది. ఆస్కార్ లో ఎంట్రీ సాధించాలంటే ఆ సినిమాకి కొన్ని అర్హతలు తప్పనిసరి. ముఖ్యంగా 'ఫిక్షన్' కథలకు ఆస్కార్ లో ఆస్కారం తక్కువ. అలాగే కథ పరంగా ముగింపు సహా ఎలాంటి క్వశ్చన్ మార్క్ లకు ఆస్కారం ఉండకూడదు. హ్యూమన్ ఎమోషన్ పరంగా కొన్ని కొలమానాలుంటాయి. ఆ రకంగా చూస్తే బాహుబలి ఎంతవరకూ నెగ్గుకురాగలదు అన్నది ఆలోచించాల్సిందే. అలాగే ఈ సినిమా 'ఉత్తమ విదేశీ చిత్రం' కేటగిరీ కింద ఆస్కార్ నామినేషన్ల రేసులోకి వెళుతుందనడంలో సందేహం లేదు. కానీ అక్కడికి వెళ్లాక ఎలాంటి మ్యాజిక్కు చేయగలుగుతుంది? బాహుబలిని మించిన విఎఫ్ ఎక్స్ ఉన్న హాలీవుడ్ సినిమాలెన్నో ఇప్పటికే ఉన్నాయి. పైగా హాలీవుడ్ లో వార్ ఎపిక్ సినిమాలకు కొదవేం లేదు. కాబట్టి ఇవన్నీ ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది.
వీటన్నిటినీ మించి భారతీయత నిండిన కథతో పరిమిత బడ్జెట్, పరిమిత సాంకేతిక వనరులతో ఈ సినిమాని తీసిన రాజమౌళి ఆస్కార్ కమిటీ కి నచ్చితే అవార్డు కచ్ఛితంగా ఇవ్వాల్సిందే. కానీ అది అసంభవం.