Begin typing your search above and press return to search.
బాలయ్య ఆ విషయంలో వెనకబడిపోతున్నాడా?
By: Tupaki Desk | 27 Dec 2022 11:30 AM GMT2023 సంక్రాంతి రేసు రసవత్తరంగా సాగబోతోంది. ఈ రేసులో సీనియర్ స్టార్ లు చిరంజీవి, బాలకృష్ణ సై అంటే సై అంటూ పోటీకి దిగబోతున్నారు. ఇప్పటికే ఇద్దరు వార్ డిక్లేర్ చేసేశారుకూడా. ఈ రెండుఏ సినిమాలతో పాటు తమిళ డబ్బింగ్ మూవీస్ రెండు, మరో యంగ్ హీరో సినిమా బరిలోకి దిగుతున్నా ఇప్పటి వరకైతే చిరు, బాలయ్యలదే సందడి కనిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక బాలయ్య 'వీర సింహారెడ్డి' అంటూ మాస్ మసాలా బొమ్మతో ఎంటరవుతున్నాడు.
ఈ రెండు భారీ చిత్రాలని మైత్రీ మూవీ మేకర్స్ వారే నిర్మిస్తున్నారు. రెండింటిలోనూ హీరోయిన్ ఒక్కరే.. శృతిహాసన్ ఈ సీనియర్ స్టార్స్ కి జోడీగా సంక్రాంతి బరిలో దిగుతోంది. ఇలా ఒక హీరోయిన్ ఇద్దరు సీనియర్ స్టార్లతో నటించిన సినిమాలు పోటా పోటీగా పోటీపడుతుండటం ఇదే తొలిసారి. అంతే కాకుండా దాదాపు ఎనిమిదేళ్ల విరామం తరువాత చిరు, బాలయ్య సంక్రాతి సమరానికి సై అంటే సై అంటూ కాలుదువ్వుతుండటంతో రెండు సినిమాలపై భారీ అంచనాలు మొదలయ్యాయి.
దీంతో ఈ రెండు సినిమాలకు సంబంధించిన ప్రమోషన్స్ ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ పోటా పోటీగా నిర్వహిస్తోంది. పోస్టర్, లిరికల్ వీడియో.. స్పెషల్ పార్టీ సాంగ్.. దాబా సాంగ్ ..ఇలా పోటా పోటీగా రెండు సినిమాల ప్రమోసన్స్ ని మైత్రీ సంస్థ హోరెత్తిస్తోంది.
అయితే వీటికి సంబంధించిన డిజిటల్ మీడియా ప్రచారంలో మాత్రం చిరు 'వాల్తేరు వీరయ్య' పై చేయి సాధిస్తోంది. బాలయ్య 'వీరి సింహారెడ్డి' మాత్రం ఆ స్థాయిలో నెట్టింట రచ్చ చేయలేకపోతోంది.
కారణం వారికున్న టీమ్ అని తెలుస్తోంది. చిరు టీమ్ ఈ విషయంలో యమ యాక్టీవ్ గా వుంటూ ప్రతీ అప్ డేట్ ని నెట్టింట ఓ రేంజ్ లో వైరల్ చేస్తుంటే బాలయ్య టీమ్ మాత్రం ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోతోందని తెలుస్తోంది. దానికి ప్రధాన కారణం బాలయ్య పీఆర్ టీమ్ కాగా, మరో కారణం బాలయ్య ఫ్యాన్స్ అని తెలుస్తోంది. రీసెంట్ గా చిరు ఫ్యాన్స్ మేకర్స్ తో ప్రత్యేక ఫ్యాన్ మీట్ ని ఏర్పాటు చేసి ప్రమోషన్స్ పై చర్చించారట. కొన్ని సూచనలు, సలహాలు కూడా ఇచ్చారట. దీనికి తోడు రవితేజ ఫ్యాన్స్ కూడా జతకట్టడంతో 'వాల్తేరు వీరయ్య' నుంచి వచ్చిన ప్రతీ అప్ డేట్ సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతోంది.
ఆ స్థాయిలో బాలయ్య అభిమానులు మాత్రం సోషల్ మీడియాని హోరెత్తించలేకపోతున్నారు. దీంతో బాలయ్య ఈ విషయంలో వెనకబడిపోయాడనే కామెంట్ లు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా టీమ్, ఫ్యాన్స్ తేరుకుని నెట్టింట రచ్చ షురూ చేయకపోతే కష్టమని కామెంట్ లు చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.