Begin typing your search above and press return to search.

ఆ సినిమాల‌కు `భీమ్లా నాయ‌క్‌` బిగ్ స్ట్రోక్ తప్ప‌దా?

By:  Tupaki Desk   |   22 Feb 2022 12:30 AM GMT
ఆ సినిమాల‌కు `భీమ్లా నాయ‌క్‌` బిగ్ స్ట్రోక్ తప్ప‌దా?
X
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన తాజా చిత్రం `భీమ్లా నాయ‌క్‌` . మ‌ల‌యాళ సూప‌ర్ హిట్ ఫిల్మ్ `అయ్య‌ప్ప‌నుమ్ కోష‌యుమ్‌` ఆధారంగా ఈ మూవీని తెలుగులో రీమేక్ చేశారు. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ డైలాగ్స్ , స్క్రీన్ ప్లే అందించిన ఈ చిత్రాన్ని `అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు` ఫేమ్ సాగ‌ర్ కె. చంద్ర తెర‌కెక్కించారు. మ‌ల‌యాళ వెర్ష‌న్ తో పోలిస్తే తెలుగులో భారీ మార్పులు చేసిన‌ట్టుగా క‌నిపిస్తోంది. టీజ‌ర్ లో ప‌వ‌న్‌, రానా మ‌ధ్య మాట‌ల యుద్ధం.. అరేయ్ డానీ బ‌య‌టికి రారా నా కొడ‌కా .. అంటూ ప‌వ‌న్ చెప్పిన డైలాగ్ లు ఈ విష‌యాన్ని స్ప‌ష్టం చేస్తున్నాయి.

ఇందులో భాగంగానే రానా పాత్ర‌ని విల‌న్ గా మార్చినట్టుగా తెలుస్తోంది. ఈ ఇద్ద‌రి మ‌ధ్య ప‌వ‌ర్ , డ్యూటీ.. ఈగో వంటి కార‌ణాల వ‌ల్ల వైరం నెల‌కొన‌డం.. ఆ త‌రువాత క్ర‌మంలో అంటే సినిమా ఎండ్ లో రానా రియ‌లైజ్ అయి మారిపోవ‌డం వంటివి తెలుగు వెర్ష‌న్ లో ప్ర‌ధాన భూమిక‌ని పోషించ‌నున్నాయ‌ని గ‌త కొన్ని నెల‌లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. నిత్యామీన‌న్‌, సంయుక్త మీన‌న్ హీరోయిన్ లుగా న‌టించిన ఈ చిత్రంలో ప‌వ‌న్ క‌ల్యాణ్‌ ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ గా న‌టిస్తుండ‌గా రానా లోక‌ల్ లీడ‌ర్ గా ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌లో డానియెల్ శేఖ‌ర్ గా క‌నిపించ‌నున్నారు.

గ‌త కొన్ని నెల‌లుగా ఈ మూవీ రిలీజ్ వాయిదా ప‌డుతూ వ‌స్తున్న విష‌యం తెలిసిందే. తాజాగా ఈ మూవీ రిలీజ్ ని ఫైన‌ల్ గా ఫిబ్ర‌వ‌రి 25కు ఫిక్స్ చేశారు. దీంతో ఈ మూవీ ప్ర‌మోష‌న్స్ ని చిత్ర బృందం ఇప్ప‌టికే ప్రారంభించేసింది. `వ‌కీల్ సాబ్‌` త‌రువాత ప‌వ‌న్ నుంచి వ‌స్తున్న మాసీవ్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ఇది. దీంతో ఈ మూవీ పై స‌హ‌జంగానే అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ప‌వ‌న్ - రానాల తొలి క‌ల‌యిక‌లో వ‌స్తున్న సినిమా కావ‌డం కూడా దీనిపై భారీ క్రేజ్ ఏర్ప‌డింది.

దీంతో ఇప్ప‌టికే ఓవ‌ర్సీస్ లో రికార్డు స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ న‌మోద‌వుతున్నాయి. అంతే కాకుండా

ప్రీమియ‌ర్స్ కి కూడా భారీ క్రేజ్ ఏర్ప‌డ‌టంతో టికెట్స్ రికార్డు స్థాయిలో బుకింగ్ అవుతుండ‌టం గ‌మ‌నార్హం. ఇదిలా వుంటే ఈ మూవీ కార‌ణంగా మార్చి 4కు మారిన సినిమాల‌కు మ‌రోసారి `భీమ్లా నాయ‌క్ ` కార‌ణంగా బిగ్ స్ట్రోక్ త‌ప్ప‌ద‌ని తెలుస్తోంది. ఫిబ్ర‌వ‌రి 25న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న ఈ మూవీకి తొలి రోజు భీభ‌త్స‌మైన టాక్ వ‌స్తే దాని ప్ర‌భావం రెండు మూడు వారాల వ‌ర‌కు వుంటుంద‌ని చెబుతున్నారు.

మార్చి 11న `రాధేశ్యామ్` రిలీజ్ కాబోలోంది. అప్ప‌టి వ‌ర‌కు బాక్సాఫీస్ వ‌ద్ద `భీమ్లా నాయ‌క్ ` ప్ర‌కంప‌ణ‌లు ఆగ‌వ‌ని చెబుతున్నారు. ఇదే నిజ‌మైతే మార్చి 4న విడుద‌ల కు సిద్ధ‌మ‌వుతున్న చిత్రాల‌కు ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని తెలుస్తోంది. `భీమ్లా నాయ‌క్‌` క్రేజ్ కార‌ణంగా ఆ త‌రువాత వ‌చ్చే సినిమాలకు ఎగ్జిబిట‌ర్లు థియేట‌ర్ల‌ని కేటాయించ‌డం కష్ట‌మే. `రాథేశ్యామ్‌` రిలీజ్ వ‌ర‌కు అన్ని థియేట‌ర్ల‌లోనూ `భీమ్లా నాయ‌క్‌` సంద‌డే క‌నిపిస్తుంద‌ని, మిగ‌తా చిత్రాల‌కు పెద్ద‌గా స్కోప్ వుండ‌ద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి.