Begin typing your search above and press return to search.

ఓటీటీ రిలీజ్ ల్లో బాలీవుడ్ ముందు వ‌రుస‌లో ఉందా?

By:  Tupaki Desk   |   25 Nov 2022 12:30 AM GMT
ఓటీటీ రిలీజ్ ల్లో బాలీవుడ్ ముందు వ‌రుస‌లో ఉందా?
X
ఓటీటీ అన్ని భాష‌ల్లో అందుబాటులో ఉన్న సంగ‌తి తెలిసిందే. కార్పోరేట్ కంపెనీలు దేశంలో దాదాపు అన్ని భాష‌ల్లోనూ ఓటీటీల్ని లాంచ్ చేసి దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా తెలుగు..హిందీ కంటెంట్ కి భారీ డిమాండ్ ఉంట‌టంతో పోటీ ఈ రెండు భాష‌ల్లో ఎక్కువ‌గా క‌నిపిస్తుంది. అయినా స‌ద‌రు కంపెనీలు ఏమాత్రం త‌గ్గ‌లేదు. కోట్ల రూపాయ‌లు వెచ్చించి కంటెంట్ కొనుగోలు చేస్తున్నాయి.

హిట్ అవుతుందా? ప్లాప్ అవుతుందా? అన్న‌ది త‌ర్వాత సంగ‌తి ముందు కంటెంట్ రిలీజ్ చేసామా? లేదా? అన్న‌ది మెయిన్ టార్గెట్ గా క‌నిపిస్తుంది. మ‌రి ఈ వ‌రుస‌లో అత్య‌ధిక ప్రాధాన్య‌త ఏ ప‌రిశ్ర‌మ‌కి ఇవ్వొచ్చు అంటే? బాలీవుడ్ క‌నిపిస్తుంది. ఓటీటీలో ఎక్కువ‌గా సినిమాలు రిలీజ్ అవుతుంది అక్క‌డ నుంచేన‌ని ఓస‌ర్వే తెలిపింది. కొన్నినెల‌లుగా స్టార్ హీరోల సినిమాల‌తో పాటు...చిన్న సినిమాలు కూడా భారీ మొత్తంలో రిలీజ్ అవుతున్న‌ట్లు తెలిపింది.

ముఖ్యంగా కంటెంట్ బేస్డ్ చిత్రాల‌న్నీ ఓటీటీ రిలీజ్ కే ఆస‌క్తి చూపిస్తున్నాయి. అందుకు త‌గ్గ‌ట్లు కంపెనీలు సైతం అలాంటి చిత్రాలు కొనుగోలు చేయ‌డానికే ఆస‌క్తి చూపిస్తున్నాయి. ఓటీటీ ఆద‌ర‌ణ‌కి కూడా ఆ సినిమాలు అనువైన‌విగా చెప్పొచ్చు. ప‌రిమిత బ‌డ్జెట్ లో నిర్మిస్త‌న్నారు. భారీ లాభాలు ఆశించ‌కుండా న‌ష్టాలు లేకుండా విక్ర‌యించి కొద్ది మొత్తంలో లాభాలు పొందినా?...ఆ త‌ర్వాత వాటి స్థాయి మారుతుంది.

అవే సంస్థ‌ల‌తో ఓటీటీలో ముందుగానే ఒప్పందం చేసుకుని బిజినెస్ స్ర్టాట‌జీతో ముందుకు క‌దులుతున్నాయి. త్వ‌ర‌లో తాప్సీ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన 'బ్ల‌ర్' కూడా ఓటీటీలోనే రిలీజ్ అవుతుంది. దీన్ని తాప్సీ నిర్మించారు. దీన్నిముందుగా థియేట‌ర్ లోరిలీజ్ చేయాల‌ని భావించింది కానీ..అక్క‌డ క‌న్నా ఓటీటీ అయితే సేఫ్ అని ఆలోచ‌న మార్చుకున్న‌ట్లు తెలుస్తోంది. ఇది థ్రిల్ల‌ర్ జాన‌ర్ సినిమా. ఇలాంటి వాటికి ఓటీటీలో ఆద‌ర‌ణ బాగుంటుంది. ఈ నేప‌థ్యంలో మ‌రికొన్ని థ్రిల్ల‌ర్ సినిమాలు డిస్నీ హాట్ స్టార్ తో ఒప్పందం చేసుకున్న‌ట్లు స‌మాచారం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.