Begin typing your search above and press return to search.

వాళ్ళున్నంత కాలం బాలీవుడ్ మునగడం పక్కా

By:  Tupaki Desk   |   16 July 2022 2:30 AM GMT
వాళ్ళున్నంత కాలం బాలీవుడ్ మునగడం పక్కా
X
బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో గడిచిన నాలుగేళ్ళ కాలంలో చాలా మార్పులు వచ్చాయి అని చెప్పాలి. ముఖ్యంగా అక్కడ ఎంత పెద్ద సినిమా వచ్చినా కూడా బాక్సాఫీస్ వద్ద కొన్ని సార్లు దారుణంగా డిజాస్టర్ అవుతున్నాయి. హిందీ ఆడియన్స్ సగానికి పైగా సౌత్ సినిమాలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. బాలీవుడ్ చిత్రాల కంటే సౌత్ సినిమాల్లో కొంత రియాలిటీ ఎక్కువగా ఉంటుంది అని కంటెంట్ ఎమోషన్ కూడా చాలా బలంగా ఉంటుంది అని నార్త్ జనాలు ఇటువైపుగా యూటర్న్ అయితే తీసుకుంటున్నారు.

ఈ క్రమంలో కొంతమంది తట్టుకోలేక KGF లాంటి సినిమాను ప్రస్తుతం బాలీవుడ్ హీరోలు తీసినా కూడా చూసేవారు కాదేమో అని సెటైర్ కూడా వేస్తున్నారు. అయితే బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో హిందూ సంప్రదాయాలను కించపరిచే విధంగానే ఉంటాయి అని కూడా అక్కడి జనాలు తీవ్రస్థాయిలో అసంతృప్తిలో వ్యక్తం చేస్తున్నారు.

కానీ సౌత్ ఇండస్ట్రీలో మాత్రం దేవుళ్లను హిందూ సంప్రదాయాలను చాలా గౌరవంగా చూపిస్తారని పవర్ ఫుల్ గా కూడా ప్రజెంట్ చేస్తారు అని చెప్పుకుంటున్నారు. ఇక ఈ తరుణంలో బాలీవుడ్ అగ్ర హీరోలపై దికాశ్మీరీ ఫైల్స్ దర్శకుడు వివాదాస్పదంగా వ్యాఖ్యలు చేయడం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

ఒక ఆంగ్ల పత్రిక కథనం పై స్పందించిన వివేక్ అగ్నిహోత్రి బాద్షాలు, సుల్తాన్‌లు ఉన్నంతకాలం బాలీవుడ్ మునిగిపోతూనే ఉంటుందని అన్నారు.

ప్రజల కథలతో సినిమాలు తీస్తూ.. ప్రజల పరిశ్రమగా మార్చాల్సిన అవసరం ఉందని.. అది చేస్తేనే చిత్ర పరిశ్రమ ముందుకు వెళుతుంది. ఇది వాస్తవం' అంటూ పరోక్షంగా కింగ్ ఖాన్, సల్మాన్‌ మీద వివేక్ విమర్శలు చేశాడు.

వివేక్ చేసిన ట్వీట్ పై ప్రస్తుతం మరికొందరు మద్దతు పలుకుతుండగా అలాగే హీరోల అభిమానులు మాత్రం తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సొంతంగా ఇలాంటి వ్యక్తిగత ఆలోచనలను వివాదం క్రియేట్ చేసేలా మాట్లాడకూడదు అని కూడా మరి కొందరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరి బాలీవుడ్ ప్రముఖులు వివేక్ కామెంట్స్ పై ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.