Begin typing your search above and press return to search.
బెల్లంకొండ హిందీ డెబ్యూపై బాలీవుడ్ జనాలకు ఇంట్రెస్ట్ లేదా..?
By: Tupaki Desk | 14 Dec 2021 3:30 AM GMTప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడిగా, స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ చేతుల మీదుగా హీరోగా లాంచ్ అయ్యారు హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. తొలి సినిమా 'అల్లుడు శీను' తో విజయాన్ని అందుకున్న శ్రీనివాస్.. యాక్షన్ సినిమాలతో మాస్ ఆడియన్స్ కి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తూ వచ్చారు.
'స్పీడున్నోడు' 'జయ జానకి నాయక' 'సాక్ష్యం' 'కవచం' 'సీత' 'రాక్షసుడు' 'అల్లుడు అదుర్స్' వంటి సినిమాలతో బెల్లంకొండ అలరించారు. ఈ క్రమంలో బ్లాక్ బస్టర్ 'ఛత్రపతి' హిందీ రీమేక్ తో సాయి శ్రీనివాస్ బాలీవుడ్ లో అడుగుపెడుతున్నారు. వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
అయితే బెల్లంకొండ హిందీ డెబ్యూ సినిమాపై హిందీలో మాత్రం ఎవరూ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. వాస్తవానికి సాయి శ్రీనివాస్ హిందీ డబ్బింగ్ సినిమాలు యూట్యూబ్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్ రాబడుతుంటాయి. తెలుగులో ప్లాప్ అయిన చిత్రాలు కూడా నార్త్ లో ఆదరణ దక్కించుకుంటూ వుంటాయి.
అందులోనూ ఇప్పుడు టాలీవుడ్ హీరోలందరూ క్రేజ్ - ఇమేజ్ తో సంబంధం లేకుండా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. డబ్బింగ్ సినిమాతో ఉత్తరాది ఆడియన్స్ కి పరిచయమైన తాను.. హిందీలో లాంఛ్ అయితే తప్పేంటనే ధోరణితోనే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 'ఛత్రపతి' హిందీ రీమేక్ సినిమా చేస్తున్నాడని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో నెట్టింట పెద్ద ఎత్తున ట్రోల్స్ కూడా వస్తున్నాయి.
బెల్లంకొండ మాత్రం హిందీ డెబ్యూ పై ధీమాగా ఉన్నట్లు తెలుస్తోంది. రాజమౌళి - ప్రభాస్ కాంబోలో వచ్చిన సూపర్ హిట్ తో.. వివి వినాయక్ తనకు సక్సెస్ ఫుల్ గా లాంచ్ చేస్తారని నమ్మకంగా ఉన్నారట. మరి ఈ సినిమా యువ హీరోకి బాలీవుడ్ లో ఎలాంటి ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి.
కాగా, సాయి శ్రీనివాస్ హిందీ చిత్రాన్ని పెన్ స్టూడియోస్ - పెన్ మారుధర్ సినీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై ధవల్ జయంతిలాల్ గడ మరియు అక్షయ్ జయంతిలాల్ గడా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. 'ఛత్రపతి' ఒరిజినల్ స్టోరీ రైటర్ విజయేంద్ర ప్రసాద్ హిందీ రీమేక్ కు కథ అందిస్తున్నారు. నిజార్ అలీ షఫీ సినిమాటోగ్రఫీ అందించగా.. తనీష్ బాగ్చి సంగీతం సమకూరుస్తున్నారు.