Begin typing your search above and press return to search.
ఖాన్ లు కిలాడీలు హ్యాపీ ఫీలవుతారా?
By: Tupaki Desk | 30 Aug 2019 10:00 AM GMTఒక గొప్ప సినిమాని గొప్పగా ఉందని.. ఒక చెత్త సినిమాని చెత్తగా ఉందని రాసేందుకు మీడియా ఎప్పుడూ వెనకాడదు. నిజం ఏంటో జనాలకు తెలియజెప్పడం మీడియా బాధ్యత. సమీక్షలు రాయడంలో ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తూ టాలీవుడ్ మీడియా చాలా ఎత్తున ఉంది.
సుజీత్ తెరకెక్కించిన `రన్ రాజా రన్` చిత్రం గొప్పగా ఉంది కాబట్టి గొప్పగా రివ్యూలు రాశారు. అదే రివ్యూ రైటర్లు `సాహో`ని అంత చెత్తగా తీశారు అని రాశారు. కథ కంటెంట్ లేకుండా విజువల్ రిచ్ యాక్షన్ సీన్స్ తో సినిమా తీస్తే హిట్టు కొడతారా? అంటూ ప్రశ్నించారు. ఇది చాలా అరుదైన సందర్భం. దీనికి సుజీత్ కానీ.. యు.వి.క్రియేషన్స్ కానీ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ప్రభాస్ డైహార్డ్ ఫ్యాన్స్ నిరాశపరిచే కంటెంట్ తో ఇంత భారీ బడ్జెట్ సినిమా తీస్తారా? అంటూ విరుచుకుపడే పరిస్థితి ఉంది అంటే అర్థం చేసుకోవచ్చు. ఇటు తెలుగు క్రిటిక్స్, అటు హిందీ క్రిటిక్స్ సహా అన్ని పరిశ్రమల్లో రివ్యూలు నెగెటివ్ గానే రావడం చూస్తుంటే ఇలా జరిగిందేం అని ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది.
అన్నట్టు `బాహుబలి` స్టార్ దూసుకొస్తున్నాడు అంటూ గత కొంతకాలంగా ముంబై మీడియా ఖాన్ లను బెదిరించేస్తోంది. మరోసారి ఖాన్ ల రికార్డుల్ని కొట్టేస్తున్నాడు అంటూ మన ప్రభాస్ కి బోలెడంత అండగా నిలిచింది. అందుకోసం అయినా కంటెంట్ పరంగా సాహో నెగ్గుకొస్తే బావుండేదన్న ఆవేదన అభిమానుల్లో కనిపిస్తోంది. అయితే సాహో టాక్ ని బట్టి ఇప్పటికే ఖాన్ లు ఊపిరి పీల్చుకునే ఉంటారనడంలో సందేహం లేదు. దక్షిణాది నుంచి ఒక స్టార్ వస్తున్నాడు అంటే ఖాన్ లు కానీ, కిలాడీ అక్షయ్ కానీ గ్రాండ్ గా వెల్ కం చెప్పేంత గొప్ప విజ్ఞత ఉన్న స్టార్లు అని ప్రభాస్ ఇంటర్వ్యూల్లో చెప్పడం అతడికి పెద్ద ప్లస్. ఇక సాహో వంతు అయిపోయింది. ఇకపై `సైరా: నరసింహారెడ్డి` వంతు. మెగాస్టార్ చిరంజీవిని టాప్ స్లాట్ లో నిలబెట్టేందుకు తనయుడు రామ్ చరణ్ అసాధారణ బడ్జెట్లతో భారీ సాహసమే చేస్తున్నారు. ఇది కూడా సాహో రేంజు సాహసమే. అక్టోబర్ 2న గాంధీ జయంతి కానుకగా వస్తోంది. మరి ఈ చిత్రం ఏ స్థాయి విజయం సాధించనుంది? అన్నది చూడాలి.