Begin typing your search above and press return to search.
బాహుబలిని మించిన మల్టీ స్టారరా ?
By: Tupaki Desk | 12 March 2019 1:30 AM GMTఇండియన్ సినిమా విస్తృతి పెరుగుతోంది. బాషతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి బాహుబలినే టార్గెట్ అవుతోంది. దాన్ని మించే తీయాలనో లేక మరిపించే స్థాయిలో మెప్పించాలనో తాపత్రయపడుతున్న దర్శకులలో సీనియర్లు సైతం ఎందరో ఉన్నారు. బాలీవుడ్ లో పెద్ద పెద్ద ప్రొడక్షన్ సంస్థలన్నీ ఇదే పని మీదున్నాయి. అందులో ముఖ్యంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న మూవీ బ్రహ్మస్త్ర. ట్విస్ట్ ఏంటంటే ఇది బాహుబలి లాగా జస్ట్ టూ పార్ట్ సీక్వెల్ కాదు. మొత్తం మూడు భాగాల్లో వస్తోంది.
దీనికి సంబంధించిన లోగోని రాజమౌళి విడుదల చేయడం విశేషం. అమితాబ్ బచ్చన్ - రన్బీర్ కపూర్ - అలియా భట్ - మౌని రాయ్ లతో పాటు మన కింగ్ అక్కినేని నాగార్జున ఓ కీలకమైన పాత్ర చేస్తున్నాడు. తన పార్ట్ షూటింగ్ ని ఇది వరకే పూర్తి చేసుకున్న నాగ్ మిగిలిన రెండు భాగాల్లో ఉంటాడో లేదో క్లారిటీ లేదు. ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న బ్రహ్మాస్త్ర చూడాలంటె డిసెంబర్ దాకా వేచి చూడక తప్పదు. క్రిస్మస్ ని టార్గెట్ చేసుకున్నారు.
ఫస్ట్ పార్ట్ ఇంత లేట్ గా వస్తే మిగిలిన రెండు భాగాలూ ఎప్పుడు వస్తాయని అనుమాన పడకండి. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఉండే అవకాశం ఉంది. మూడు వందల కోట్లదాకా బడ్జెట్ తో కరణ్ జోహార్ నిర్మిస్తున్న బ్రహ్మస్త్ర దర్శకుడు ఆర్యన్ ముఖర్జీ. దీన్ని తెలుగులో అనువదించడం ద్వారా కరణ్ తన ఉద్దేశాన్ని చెప్పకనే చెప్పాడు. సౌత్ ని టార్గెట్ చేయడం ద్వారా మార్కెట్ ని పెంచుకునే ప్లాన్ లో భాగమే ఇదంతా. మొత్తానికి బాహుబలిని మించిన సినిమాను తీయాలన్న కోరిక ఈ బ్రహ్మాస్త్ర అయినా నెరవేరుస్తుందో లేదో చూడాలి