Begin typing your search above and press return to search.

బన్నీ భార్యకు నటనపై ఆసక్తి ఉందా..?

By:  Tupaki Desk   |   5 Nov 2022 12:30 PM GMT
బన్నీ భార్యకు నటనపై ఆసక్తి ఉందా..?
X
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఆమె అల్లు ఫ్యామిలీ కోడలిగా బాధ్యతలు నిర్వహిస్తూ.. తన భర్త మరియు ఇద్దరు పిల్లలతో కలిసి హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ ని లీడ్ చేస్తోంది. అయితే ఆమె త్వరలో సినిమాల్లోకి రానున్నట్లు ఓ గాసిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

అల్లు స్నేహా రెడ్డికి సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది.. చాలా మంది పాపులర్ హీరోయిన్లకు మించిన ఫాలోయింగ్ ఉంది. తరుచూ తన పిల్లల అల్లరి వీడియోలు.. వారితో మెమరబుల్ మూమెంట్స్ ని షేర్ చేయడంతో పాటుగా ఎప్పటికప్పుడు తన స్టైలిష్ ఫోటోలను పంచుకుంటూ ఫాలోవర్స్ పెంచుకుంటూ వెళ్తోంది. అందంలోనూ ఆమె హీరోయిన్ లకు ఏ మాత్రం తీసిపోదు.

ఇటీవల కాలంలో స్నేహా రెడ్డి తన ట్రెండీ ఫోటో షూట్స్ తో వార్తల్లో నిలుస్తోంది. స్టైలింగ్ అండ్ డ్రెస్సింగ్ లో తన భర్తకు ఏమాత్రం తీసిపోనని నిరూపిస్తూ వస్తోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో విపరీతమైన పాపులారిటీ దక్కించుకున్న అల్లు వారిని కోడలిని.. సినిమాల్లో నటింపజేయడానికి ఇప్పుడు ప్రయత్నాలు జరుగుతున్నాయని రూమర్స్ వినిపిస్తున్నాయి.

రీసెంట్ గా స్నేహాకి ఓ మలయాళ ఇండస్ట్రీ నుంచి ఒక ఆఫర్ వచ్చిందని.. ఒక పెద్ద హీరో సినిమాలో నటించడానికి ఆమెకు అవకాశం వచ్చిందని నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో నిజమెంతో.. నిజంగానే బన్నీ భార్యకు నటనపై ఆసక్తి ఉందో లేదో.. సిల్లీ గాసిప్ నా?.. సీరియస్ గాసిప్ నా? అనేది తెలియదు కానీ ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వినిపిస్తోంది.

సోషల్ మీడియాలో అధిక ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోల భార్యామణులలో స్నేహా రెడ్డి ఒకరు. అందులోనూ ఆమెకు పెళ్లికి ముందు ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకపోవడం విశేషం. అయినప్పటికీ ఇన్స్టాగ్రామ్ లో ఆమెకు 8.6 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారంటేనే క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ మధ్య ఫోటో షూట్స్ - రీల్స్ ఎక్కువగా చేస్తుండటంతో.. బన్నీ భార్యకు నటనపై ఆసక్తి ఉందనే గాసిప్స్ వస్తున్నాయేమో అని కొందరు అభిప్రాయపడుతున్నారు.

ఇక బన్నీ షూటింగ్స్ తో ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీకి తగినంత సమయం కేటాయిస్తుంటారు. వీలు కుదిరినప్పుడల్లా భార్యా పిల్లలను తీసుకుని హాలిడేకి తీసుకెళ్లి ఎంజాయ్ చేసి వస్తుంటారు. 'పుష్ప' రిలీజ్ తర్వాత దొరికిన సమయాన్ని ఆయన ఎక్కువగా తన కుటుంబంతో గడపడానికే ఉపయోగించుకున్నారు.

'పుష్ప' సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన అల్లు అర్జున్.. ప్రస్తుతం ఆ ఇమేజ్ ని కాపాడుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. 'పుష్ప 2' చిత్రాన్ని మొదటి భాగాన్ని మించి ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉన్న ఈ చిత్రాన్ని త్వరలోనే సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు.

మరోవైపు 'శాకుంతలం' సినిమాతో బన్నీ - స్నేహాల గారాల బిడ్డ అర్హ తెరంగేట్రం చేయబోతోంది. అల్లు ఫ్యామిలీ నుంచి సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇస్తున్న నాలుగో తరం వారసురాలిగా అర్హ నిలిచింది. ఇండియన్ సినిమాలో నాలుగు జనరేషన్స్ నటీనటులున్న ఫ్యామిలీలు కొన్ని మాత్రమే ఉన్నాయి. అందులో టాలీవుడ్ నుంచి 'అల్లు' ఫ్యామిలీ ఒక్కటే ఉండటం విశేషం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.