Begin typing your search above and press return to search.
#యాసిడ్ ఎటాక్స్.. చపాక్ కంటే ముందే
By: Tupaki Desk | 12 Dec 2019 5:30 AM GMTమన దర్శక నిర్మాతల కన్ను నిర్భయ ఘటనలపైకి.. యాసిడ్ దాడులపైకి మళ్లుతున్న సంగతి తెలిసిందే. ఈ ట్రెండ్ లోనే దిల్లీ యాసిడ్ దాడి ఘటన ఆధారంగా `చపాక్` తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ పాత్రలో దీపిక పదుకొణే నటిస్తోంది. ఇటీవలే విడుదలైన చపాక్ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దేశం మొత్తాన్ని కుదిపేసిన సంఘటన కావడంతో ఈ సినిమా రిలీజ్ కోసం అంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రకటన వెలువడినప్పటి నుంచి బోలెడంత హైప్ క్రియేట్ అయింది. నిర్భయ పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణే నటిస్తుండడంతో ప్రేక్షకులకు మరింత చేరువైంది. అయితే దీపిక కంటే ముందు ఓ మలయాళ నటి యాసిడ్ బాధితురాలి పాత్ర పోషించింది అన్న సంగతి ఎవరికీ తెలియకపోవడం ఆశ్చర్యకరం. ఈ సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఆ నటి పేరు పార్వతి తిరువేథు. గతంలోనే ఓ యాసిడ్ బాధితురాలి పాత్రలో నటించింది. మలయాళంలో తెరకెక్కిన ఆ సినిమా పేరు `ఉయరే`. మను అశోకన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇందులో హీరోయిన్ పైలెట్ కావాలనే లక్ష్యంతో తన ప్రేమకు బ్రేకప్ చెబుతుంది. దీంతో మనస్తాపం చెందిన ఆ ప్రేమికుడు పార్వతిపై యాసిడ్ దాడికి దిగుతాడు. అయినా ఆమె ఆత్మ విశ్వాసం కోల్పోకుండా అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తుంది. అలా లక్ష్యాన్ని చేధించే వరకూ ఆమె ఎదుర్కొన్న ఒత్తిడులు.. ఒడిదుడుకుల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ కథలో ఎంతో ఎమోషన్ ఉంది.
ప్రేమను చంపేయడం ఎంత వరకూ సమజసం? అన్న కోణాన్ని సినిమాలో పాక్షికం గా చూపించారు. కానీ ఈ సినిమా గురించి సరైన ప్రచారం లేకపోవడంతో పెద్దగా తెలియలేదు. పరిమిత బడ్జెట్ తో తెరకెక్కిన మలయాళ చిత్రం కావడంతోనే అంతగా పబ్లిసిటీ రాలేదు. తాజాగా దీపిక ఛపాక్ ట్రైలర్ నేపథ్యంలో ఆ సినిమాకి సంబంధించిన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో ఛపాక్ తో పాటు ఉయారే సినిమా పైనా నెటిజనులు కామెంట్లు పెడుతున్నారు. దీపిక కంటే మీరు ముందే ఈ ప్రయోగం చేసారు కాబట్టి మీరే బెస్ట్ అంటూ కామెంట్స్ చేస్తుండడం చర్చనీయాంశమైంది.