Begin typing your search above and press return to search.
చరణ్ ఆ డైరెక్టర్ ని పక్కన పెట్టేసినట్టేనా?
By: Tupaki Desk | 15 Sep 2022 12:30 PM GMTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆ దర్శకుడిని పక్కన పెట్టినట్టేనా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ తన 15వ ప్రాజెక్ట్ ని చేస్తున్న విషయం తెలిసిందే. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ కి 'ఇండియన్ 2' కారణంగా స్మాల్ బ్రేక్ పడింది. ఇదిలా వుంటే ఇప్పటికే కీలక ఘట్టాల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ నుంచి ఇంత వరకు ఎలాంటి అప్ డేట్ బయటికి రావడం లేదు. దీంతో శంకర్ ఈ దసరా కైనా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేస్తాడా? అని మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
RC15 షూటింగ్ కు కు కాస్త బ్రేక్ పడటంతో రామ్‌చరణ్ తన తదుపరి ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టాడంటూ వరుస కథనాలు వినిపిస్తున్నాయి. RC15 తరువాత చరణ్ ..'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి తో ఓ సినిమా చేయాలి. యువీ క్రియేషన్స్, ఎన్ వీఆర్ సినిమా బ్యానర్ లు సంయుక్తంగా ఈ మూవీని నిర్మించబోతున్నట్టుగా గతంలో ప్రకటించాయి. అయితే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అప్ డేట్ ఇంత వరకు బయటికి రాలేదు.
ఈ నేపథ్యంలో రామ్ చరణ్ తన 16వ ప్రాజెక్ట్ ని గౌతమ్ తిన్ననూరితో కాకుండా కన్నడ దర్శకుడు నర్తన్ తో చేయబోతున్నాడంటూ గత కొన్ని రోజులుగా వరుస కథనాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలని యువీతో పాటు, దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కూడా కండించడం లేదు. సోషల్ మీడియా వేదికగా కనీసం RC16 తన డైరెక్షన్ లోనే వుంటుందనే విషయాన్ని కూడా దర్శకుడు వెల్లడించడం లేదు. దీంతో గౌతమ్ తిన్ననూరిని రామ్ చరణ్ పక్కన పెట్టినని అంతా చెప్పుకుంటున్నారు.
నార్తన్ కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్ లని సొంతం చేసుకున్నాడు. శివరాజ్ కుమార్, శ్రీమురళీల కాంబినేషన్ లో నార్తన్ తెరకెక్కించిన నియో నాయిర్ యాక్షన్ థ్రిల్లర్ 'ముఫ్తీ' అక్కడ సంచలన విజయాన్ని సాధించింది. దీంతో కన్నడ స్టార్స్ తో పాటు టాలీవుడ్ స్టార్స్ కూడా అతనిపై కన్నేశారు. అయితే నర్తన్ మాత్రం రామ్ చరణ్ కు ఇటీవల ఓ పవర్ ఫుల్ డాక్టర్ క్యారెక్టర్ నేపథ్యంలో ఓ యాక్షన్ స్టోరీని వినిపించాడట. లైన్ నచ్చడంతో చరణ్ అతనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని ప్రచారం జరుగుతోంది.
తాజా వార్తల ప్రకారం ఈ మూవీని బాలీవుడ్ నిర్మాణ సంస్థ టి సిరీస్ తో కలిసి టాలీవుడ్ క్రేజీ ప్రొడక్షన్ హౌస్ నిర్మించే అవకాశం వుందని తెలుస్తోంది. ఈ వార్తలని బట్టి 'సాహో' నుంచి టి. సిరీస్ తో కలిసి సినిమాలు నిర్మిస్తున్న యువీనే ఈ మూవీని నిర్మించబోతోందని స్పష్టమవుతోంది.
ఈ మూవీకి 'కేజీఎఫ్' ఫేమ్ రవి బాస్రూర్ సంగీతం అందిస్తారని చెబుతున్నారు. ఇప్పటి వరకు ఇవి ఊహాగానాలే అయినా వీటిపై మేకర్స్ ఇంత వరకు కాదని, అవునని కానీ క్లారిటీ ఇవ్వకపోవడంతో ఈ ప్రాజెక్ట్ నిజమేనని తెలుస్తోంది. మరి ఈ వార్తలపై యువీ సోషల్ మీడియా వేదికగా అయినా క్లారిటీ ఇస్తుందా? లేక ఊహాగానాలే కదా అని లైట్ తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.