Begin typing your search above and press return to search.
మైక్ టైసన్ ని ఒప్పించింది ఛార్మీనా?
By: Tupaki Desk | 12 Aug 2022 7:00 AM GMTబాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ 'లైగర్' లో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. టైసన్ ఎంట్రీతో 'లైగర్' కి వరల్డ్ వైడ్ గుర్తింపు ద్కుతోంది. దీంతో సినిమా స్పాన్ పెరిగినట్లు అయింది. ఇప్పటికే ఆ పాత్రకి సంబంధించి గ్లింప్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. దీంతో టైసన్ పాత్ర 'లైగర్' లో నెగిటివ్ గా ఉంటుందా? పాజిటివ్ గా కనిపిస్తుందా? అని ఒకటే బజ్ క్రియేట్ అవుతోంది.
మెజార్టీ వర్గం టైసన్ నెగిటివ్ రోల్ లోనే కనిపిస్తారని అంచనా వేస్తున్నారు. పూరి సైతం టైసన్ ని ఆ రకంగానే చూపించడానికి ఛాన్స్ ఉందంటున్నారు. వీటన్నింటికి తెరపడటానికి ఇంకా కొన్ని రోజులే సమయం ఉంది. అప్పటివరకూ వెయిట్ చేయాల్సిందే. మరి అసలు 'లైగర్' లోకి టైసన్ ని తీసుకురావడం అన్నది ఎవరి ఐడియా? ఇది పూరి ఆలోచనా? లేక! పూరి నిర్మాణ భాగస్వామి ఛార్మీ ఐడియానా? అన్నది తెలియదుగానీ...టైసన్ కోసం యూనిట్ చాలా శ్రమించాల్సి వచ్చిందని తెలుస్తోంది.
టైసన్ ని ఒప్పించి తీసుకొచ్చే బాధ్యతలు మాత్రం ఛార్మీ తీసుకుందని తెలుస్తోంది. మైక్ టైసన్ అమెరికాలోని న్యూయార్క్ బ్రూక్ లైన్ సిటీలో ఉంటారు. రిటైర్మెంట్ తర్వాత అక్కడే స్థిరపడ్డారు. టైసన్ ని లైగర్ లో భాగం చేయాలనుకున్నప్పుడు స్వయంగా ఛార్మీనే టైసన్ ని కలిసి..ఆయన పాత్ర..సినిమా గురించి వివరించారుట. ఆ సమయంలో టైసన్ ని ఒప్పించడానికి ఛార్మి ఎంతో కష్టపడిందట.
టైసన్ ముంబైకి వచ్చి షూటింగ్ చేయడం...అమెరికాలో షూటింగ్ సహకరించడం వీటన్నింటి వెనుక ఛార్మీ మాత్రమే కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఆయన ఉన్నన్ని రోజులు అన్ని రకాల ఏర్పాట్లు ఆమె దగ్గరుండి చూసుకుందిట. తొలుతు టైస్ నటించడానికి ఒప్పుకోలేదుట. కానీ ఛార్మీ ఎలాగూ కన్విన్స్ చేసి ఒప్పించినట్లు తెలుస్తోంది.
ఈ విషయంలో క్రెడిట్ అంతా ఛార్మీకే ఇవ్వాలంటుంది టీమ్. ఇంతగా కష్టపడిందంటే? 'లైగర్' లో భాగం చేయాలన్న టైసన్ ఆలోచన కూడా ఛార్మీదేనా? అన్నం దేహం రాక మానదు.
ఐడియా ఎవరిదన్నది పక్కనబెడితే టైసన్ ఎంట్రీతో 'లైగర్' రేంజ్ మారిపోయిందన్నది వాస్తవం. పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవుతోన్న 'లైగర్' కోసం ప్రేక్షకులు అంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్ ప్రచారంతో 'లైగర్' పై అంచనాలు అంతకంతకు పెంచేస్తున్నారు.