Begin typing your search above and press return to search.
చిరు కూడా బాలీవుడ్ అక్షయ్ గా మారిపోతున్నారా?
By: Tupaki Desk | 11 Dec 2022 4:30 PM GMTమెగాస్టార్ చిరంజీవి కూడా బాలీవుడ్ ఖిలాడీ హీరో అక్షయ్ కుమార్ గా మారిపోతున్నారా? అంటే ఆయన ఫ్యాన్స్ తో పాటు చిరు ని ఇష్టపడే ప్రతీ ఒక్కరు ఇదే మాట అంటున్నారట. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ గత ఏడాది బ్యాక్ టు బ్యాక్ ఐదు సినిమాలు చేశాడు. ఇక వచ్చే ఏడాది కూడా దాదాపు ఆరు సినిమాలతో ప్రేక్షకు లముందుకు రాబోతున్నాడు. గతంలో భారీ క్రేజ్ ని దక్కించుకున్న అక్షయ్ గత ఏడాది నుంచి ఆ క్రేజ్ ని కోల్పోవడం తెలిసిందే.
ఇప్పడు ఇదే తరహాలో మెగాస్టార్ చిరంజీవి కూడా అక్షయ్ కుమార్ తరహాలోనే క్రేజ్ ని కోల్పోతున్నారా?.. అక్షయ్ కుమార్ లా అయిపోతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వివరాల్లోకి వెళితే.. గతంలో చిరు సినిమా వస్తోందంటే ఫుల్ హంగామా వుండేది. బాక్సాఫీస్ దద్దరిల్లిపోయేది. మాస్ లో ఓ రేంజ్ లో పూనకాలు మొందలయ్యేవి.. థియేటర్ల వద్ద మాస్ జాతర వుండేది.
కానీ ఇది 'ఆచార్య' ఫలితంతో తారుమరైపోతోంది. ఏప్రిల్ 29న విడుదలైన ఈ మూవీ చిరు కెరీర్ లోనే భారీ డిజాస్టర్ గా నిలిచి అభిమానులతో పాటు చిరుకు కూడా ఊహించని షాక్ ఇచ్చింది.
ఈ మూవీ తరువాత మెగాస్టార్ చిరంజీవి 'వాల్తేరు వీరయ్య'తో ప్రేక్షకుల ముందుకురాబోతున్నారు. 2023 సంక్రాంతికి విడుదల కానున్న ఈ మూవీ తరువాత 'భోళా శంకర్' మూవీతో ఏప్రిల్ 14న రావడానికి డేట్ ఫిక్స్ చేసుకున్నారు.
ఇలా రెండు నెలల వ్యవధిలోనూ చిరు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అవుతుండటంతో పెద్దగా బజ్ వినిపించడం లేదని, మునుపటి తరహాలో అభిమానుల్లో ఆసక్తి కనిపించడం లేదనే కామెంట్ లు వినిపిస్తున్నాయి.
చిరుకున్న క్రేజ్ ని బట్టి ఒక్క సినిమాకు చాలా గ్యాప్ వుండేలా చూసుకోవాల్సింది పోయి చిరు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడం వల్లే క్రేజ్ తగ్గిపోతోందని, ఇలా చేసుకుంటూ పోతే బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ తరహాలో ఫామ్ ని కోల్పోతారని అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.