Begin typing your search above and press return to search.
మెగాస్టార్ సెటైర్ టాప్ డైరెక్టర్స్ మీదేనా?
By: Tupaki Desk | 7 Jan 2020 6:54 AM GMTఈమధ్యే సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన చిత్రం 'సరిలేరు నీకెవ్వరు' ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో అంగరంగవైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథి గా హాజరయ్యారు. మహేష్.. విజయశాంతి.. అనిల్ రావిపూడి ఇలా అందరి గురించి ఎంతో అందంగా మాట్లాడారు. మహేష్ నవ్వు వెనక చిలిపిదనం ఉందని.. 'నా హీరోయిన్ విజయ శాంతి' అంటూ మెగా స్టైల్ లో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ కార్యక్రమం లోనే తన నెక్స్ట్ సినిమా గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన కామెంట్లు చేశారు.
'సరిలేరు నీకెవ్వరు' సినిమాకు 80 రోజులే పట్టిందని.. అతితక్కువ సమయంలో పూర్తి చేశారని దర్శకుడు అనిల్ రావిపూడిని మెచ్చుకుంటూనే తన తదుపరి చిత్ర దర్శకుడు కొరటాల శివకు ఒక డెడ్లైన్ పెట్టారు. మన సినిమాను వంద రోజుల్లోనే పూర్తి చేయాలని 99 రోజు వరకూ కూడా షూటింగ్ కొనసాగకూడదని ఎంతో లౌక్యంగా కొరటాలను సినిమా త్వరగా పూర్తి చేసేలా కమిట్ చేయించారు. అయితే చిరంజీవి కామెంట్లు కొరటాల శివను మాత్రమే ఉద్దేశించినవి కాదని రాజమౌళి లాంటి ఇతర స్టార్ డైరెక్టర్లను ఉద్దేశించినవని అంటున్నారు.
ఈమధ్య స్టార్ డైరెక్టర్లు అందరూ ఒక్కో సినిమాకు ఏడాదిన్నర నుంచి రెండేళ్ళ సమయం తీసుకుంటున్నారు. దీనివల్ల బడ్జెట్ పెరుగుతోందని.. నిర్మాతలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయనే కంప్లైయింట్లు ఉన్నాయనే సంగతి తెలిసిందే. ఇలా ఎక్కువ సమయం తీసుకున్నప్పుడు సినిమా హిట్ అయితే అందరికీ సంతోషమే. కానీ సినిమా ఫ్లాప్ అయితే అందరికీ నష్టమే. అందుకే వీలైనంత తక్కువ సమయం లో సినిమాలు పూర్తి చేస్తే బడ్జెట్ పై అదుపు ఉంటుందని.. వడ్డీలు కూడా తగ్గుతాయని.. నిర్మాతలపై భారం తగ్గుతుందని సినీ పెద్దలు అంటుంటారు.
మరి మెగాస్టార్ చెప్పిన మాటను ఎవరు వింటారో.. ఎవరు పట్టించుకుంటారో.. ఎవరు ఆచరిస్తారో చూడాలి. నిజానికి ఒక సినిమా త్వరగా పూర్తి కావాలంటే డైరెక్టర్ వైపు నుంచి ప్రయత్నం మాత్రమే సరిపోదు. హీరోల వైపు నుంచి కూడా సహకారం అందాలి. లేకపోతే సినిమాను షెడ్యూల్స్ ప్రకారం పూర్తి చెయ్యడం చాలా కష్టం. దర్శకుల చొరవ.. హీరోల సహకారం ఉంటేనే అది సాధ్యమవుతుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.