Begin typing your search above and press return to search.
రాబోయే రోజుల్లో కరోనా యాడ్స్ సినిమా టైటిల్స్ కి ముందు పడబోతున్నాయా..?
By: Tupaki Desk | 15 May 2020 11:30 PM GMTకరోనా మహమ్మారి వలన ఎన్నో వింతలు చూడాల్సి వస్తోంది.. కంటికి కనిపించని ఒక వైరస్ ప్రపంచాన్ని మొత్తం ఆపేస్తుందని ఎప్పుడైనా ఉహించామా..? ప్రపంచ వ్యాప్తంగా కాలంతో పాటు పరుగులు తీసే జనాలు ఇంట్లో నుండి కాలు బయటపెట్ట కుండా ఇంటికే పరిమితమయ్యే రోజులు వస్తాయని కలలోనైనా అనుకున్నామా..? ప్రపంచ దేశాలన్నీ అభివృద్ధి అంటూ అన్ని రంగాల్లో దూసుకుపోతున్న సమయంలో రెండు నెలల పాటు లాక్ డౌన్ విధించుకొని అభివృద్ధి తిరోగమనంలోకి వెళ్తామనే ఆలోచనలు వచ్చే ఛాన్స్ ఉందని అనుకున్నామా..? కానీ ఇవన్నీ ఇప్పుడు కరోనా కారణంగా జరుగుతున్నాయి. దీని ప్రభావం అన్ని రంగాల మీద పడింది. కరోనా కోలుకోలేని దెబ్బేసిన రంగాలలో సినీ రంగం ఒకటి. థియేటర్స్ మల్లీప్లెక్సెస్ మూతపడ్డాయి. ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియదు. సినిమా అనేది ఇప్పట్లో అసలు థియేటర్స్ లోకి వస్తుందా అనే డౌట్. ఒకవేళ రాబోయే రోజుల్లో లాక్ డౌన్ ఎత్తేసి సినిమాలకు వెసులుబాటు కల్పించాయి అనుకుందాం. అప్పుడు పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి. ఒకప్పటిలా జనాలు థియేటర్స్ కి వచ్చి సినిమాలు చూస్తారా..? ఒకప్పటిలాగే నిర్మాతలు బడ్జెట్ పెట్టి క్వాలిటీ సినిమాలు తీయగలరా..? ఇలాంటి డౌట్స్ ఎన్నో ఉన్నాయి. వీటికి తోడు 'సినిమా'లో కూడా చాలా మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.
ఇప్పటి దాకా మద్యపానం ధూమపానం లాంటి వ్యసనాల గురించి హెచ్చరికలు జారీ చేసే వారు. రాబోయే రోజుల్లో కరోనా హెచ్చరికలు జారీ చేస్తారేమో. ''ఈ ప్రపంచానికి ఏమైంది ఓ వైపు కరోనా మరో వైపు ఆకలి చావులు.. మాస్క్ లేకుండా బయటకి వస్తే చెల్లించాలి భారీ మూల్యం - చేతులు శుభ్రంగా కడుక్కోండి.. అనవసరంగా ఏ వస్తువుల్ని తాకకండి.. మాస్క్ ధరించే బయటకు వెళ్లండి'' - ఈ టైపు యాడ్స్ సినిమాలు ముందు పడబోతున్నాయా..? ఏమో పడొచ్చు. ఇప్పటి వరకు స్మోకింగ్, డ్రింకింగ్ గురించి సినిమా ముందు ప్రచారం చేస్తూ వచ్చిన ప్రభుత్వం.. ఇప్పుడు కరోనా పై అవగాహన పెంచేందుకు ఈ విధమైన చర్యలు తీసుకొనే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే ఉన్న 'నో స్మోకింగ్' యాడ్స్ పై కామెడీలు బాగానే చేస్తున్నారు జనాలు. మరి కరోనా యాడ్ వస్తే ఇంకెంత కామెడీగా మారుస్తారో చూడాలి. ముందు రోజుల్లో 'సినిమా' లో ఎన్ని మార్పులు చోటు చేసుకోబోతున్నాయో..!