Begin typing your search above and press return to search.
డార్లింగ్ ప్రభాస్ ప్లానింగ్ ఇలా ఉందా?
By: Tupaki Desk | 23 April 2022 7:30 AM GMTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ `రాధేశ్యామ్` రిలీజ్ తర్వాత ఇంకా రిలాక్స్ మోడ్ లోనే ఉన్న సంగతి తెలిసిందే. షూటింగ్ సమయంలో మోకాలికి చిన్న పాటి గాయాలతో ఇబ్బంది పడ్డారు. దీంతో డాక్టర్లు సర్జరీ అవసరమని సూచిచండంతో కొద్ది రోజుల పాటు సర్జీరీకి టైమ్ కేటాయించి శస్ర్త చికిత్స చేయించుకున్నారు. మరో వారం రోజుల పాటు విరామంలోనే ఉంటారని తెలుస్తోంది. అయితే వచ్చే వారం నుంచి `ప్రాజెక్ట్ -కె` షూట్ లో పాల్గొంటారని సమాచారం.
అప్పటికి శస్ర్త చికిత్స నుంచి పూర్తిగా కొలుకుంటారని ఈ నేపథ్యంలో దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రభాస్ పై ఓ షెడ్యూల్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. వారం రోజుల పాటు ఈ షెడ్యూల్ ఉంటుందని సమాచారం.
ప్రభాస్ కి ఏమాత్రం అసౌకర్యం కలగకుండా కూల్ గా నెక్స్ట్ వీక్ షెడ్యూల్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. కేవలం ప్రభాస్ పై సోలో సీన్స్ మాత్రమే షూట్ చేస్తారని తెలుస్తోంది. అందుకే కేవలం వారం రోజులే ఈ చిన్న షెడ్యూల్ వేసినట్లు తెలుస్తుంది.
ఇప్పటికే సినిమాకి సంబంధించి రెండు షెడ్యూల్స్ పూర్తిచేసిన సంగతి తెలిసిందే. అమితాబచ్చన్..దీపికా పదుకొణే..ప్రభాస్ సహా ఇతర తారాణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. వాటికి కొనసాగింపుగా ప్రభాస్ పై సోలో సీన్స్ వారం రోజుల్లో పూర్తిచేస్తే సరి అని తెలుస్తోంది. ఇక మే నుంచి డార్లింగ్ యధావిధిగా `సలార్` షూటింగ్ లో పాల్గొంటారని సమాచారం.
మేలో మొత్తం రెండు షెడ్యూల్స్ పూర్తిచేయాలని దర్శకుడు ప్రశాంత్ నీల్ టార్గెట్ గా పెట్టుకున్నారని క్లోజ్ సోర్సెస్ చెబుతున్నాయి. అందుకే నాగ్ అశ్విన్ దొరికిన వచ్చే వారం సయయాన్ని తన సినిమా షూటింగ్ కి వినియోగించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు సినిమాలతో పాటు డార్లింగ్ మారుతి `డీలక్స్ రాజా` చిత్రాన్ని కూడా సెట్స్ పైకి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారుట.
ప్రభాస్ స్ర్కిప్ట్ లో కొన్ని మార్పులు కోరడంతో మారుతి ఆ బిజీలో ఉన్నారని.. అందుకు ఇంకొంత సమయం పడుతుందని సమాచారం. ఏది ఏమైనా `సలార్` తో పాటు మారుతి చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఏడాది చివరకల్లా పూర్తి చేయాలన్నది ప్రభాస్ ప్లాన్ గా తెలుస్తోంది.
ఆ తర్వాత పూర్తిగా `ప్రాజెక్ట్-కె` చిత్రానికే సమయం కేటాయిస్తారుట. అటుపై సందీప్ వంగ `స్పిరిట్` చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.