Begin typing your search above and press return to search.

'డిటెక్టివ్ -2' డేట్ లాక్ అయిందా!

By:  Tupaki Desk   |   21 Dec 2022 12:30 AM GMT
డిటెక్టివ్ -2 డేట్ లాక్ అయిందా!
X
విశాల్ క‌థానాయ‌కుడిగా మిస్కిన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ 'డిటెక్టివ్' ఎంత పెద్ద విజ‌యం సాధించిందో తెలిసిందే. ఐదేళ్ల క్రితం రిలీజ్ అయిన ఈ థ్రిల్ల‌ర్ చిత్రం ఆద్యంతం ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంది. థ్రిల్ల‌ర్ అంశాల‌కు ప్రేక్ష‌కుడికి కొత్త అనుభూతిని పంచాయి. విశాల్ కెరీర్లో డిటెక్టివ్ ని ఓ మైల్ స్టోన్ మూవీగానూ నిలిచింది. దీంతో ఈ సినిమా సీక్వెల్ గా డిటెక్టిట్ -2 కూడా సెట్స్ పైకి వెళ్లిన సంగ‌తి తెలిసిందే.

ఈ సారి విశాల్ ఏకంగా ఈ సినిమా కోసం ద‌ర్శ‌కుడిగానూ మారిపోయారు. మిస్కిన్ అందించిన క‌థ‌కు విశౄల్ డైరెక్ట్ చేసి సినిమాపై అంచ‌నాలు అంత‌కంత‌కు పెంచేసారు. మ‌రి మిస్కిన్ ఈసారి డైరెక్ష‌న్ బాధ్య‌త‌ల నుంచి ఎందుకు త‌ప్పుకున్నారు? అన్న‌ది తెలియ‌దుగానీ క‌థ ఆయ‌నే అందించ‌డం స‌హా ద‌ర్శ‌క‌త్వం ప‌ర్య‌వేక్ష‌ణ కూడా చేయ‌డంతో? అంచ‌నాలు ఆకాశ‌న్నంటుతున్నాయి.

ఈ సినిమాని చాలా రోజుల క్రిత‌మే సెట్స్ పైకి తీసుకెళ్లారు. ఇదే స‌మ‌యంలో విశాల్ వేర్వేరు సినిమా షూటింగ్ ల్లో కూడా పాల్గొన‌డంతో! డిటెక్టివ్ -2 డిలే అయింది. అయితే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో ఈసినిమాని ఎప్పుడు రిలీజ్ చేయ‌బోతున్నార‌ని ప్ర‌శ్నించ‌గా విశాల్ రిలీజ్ నెల గురించి తెలిపారు. 2023 ఆగ‌స్టులో చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

సినిమా బాగా వ‌స్తుంద‌ని...అంచ‌నాల‌కు అంద‌కుంటా క‌థ... క‌థ‌నాలు సాగుతాయ‌ని తెలిపారు. ఓ కొత్త పాయింట్ ని తీసుకుని తెర‌కెక్కిస్తున్న‌ట్లు రివీల్ చేసారు. ఇది విశాల్ అభిమానుల‌కు గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

ఈ సినిమాకంటూ ప్ర‌త్యేక‌మైన అభిమానులున్నారు. 'డిటెక్టివ్ -2' కోసం ఎంతో మంది అభిమానులు రిలీజ్ ఎప్పుడా? అని ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు.

తాజాగా విశాల్ ప్ర‌క‌ట‌న‌తో రిలీజ్ పై క్లారిటీ వ‌స్తుంది. త్వ‌ర‌లో విశాల్ 'లాఠీ'తో ప్రేక్ష‌కుల ముందుకొస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా పై భారీ అంచ‌నాలున్నాయి. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాల‌కు సినిమాపై అంచ‌నాలు పెంచేసాయి. హిట్ అవుతుంద‌ని కొంద‌రు ముందే జోస్యం చెబుతున్నారు. మ‌రి వాళ్ల గెస్సింగ్ ఫ‌లిస్తాయా? లేదా? అన్న‌ది చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.