Begin typing your search above and press return to search.

దేవి ఫీల్ అవ్వలేదు.. నిజంగా ఫీల్ అవ్వలేదట భయ్యా

By:  Tupaki Desk   |   8 Oct 2022 4:30 PM GMT
దేవి ఫీల్ అవ్వలేదు.. నిజంగా ఫీల్ అవ్వలేదట భయ్యా
X
తెలుగు సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ సౌత్‌ లో టాప్ మ్యూజిక్ కంపోజర్ అనడంలో సందేహం లేదు. సౌత్‌ లో రహమాన్ తర్వాత ఆ స్థాయిలో పారితోషికం తీసుకునే సంగీత దర్శకుడు రాక్ స్టార్‌ దేవి శ్రీ ప్రసాద్‌ అనడంలో ఏమాత్రం సందేహం లేదు. సీనియర్ స్టార్స్ నుండి మొదలుకుని కొత్త వారి వరకు అందరికీ కూడా దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం కావాలి.

అలాంటి దేవి శ్రీ ప్రసాద్‌ కి బాలీవుడ్‌ లో కూడా మంచి పాపులారిటీ ఉంది. సినీ వర్గాల్లోనే కాకుండా ఉత్తరాది ప్రేక్షకుల్లో కూడా దేవి శ్రీ ప్రసాద్‌ కి మంచి గుర్తింపు ఉంది. కనుక దేవి శ్రీ ప్రసాద్‌ అప్పుడప్పుడు అక్కడ సందడి చేస్తూనే ఉంటాయి. ఆ విషయాన్ని మనం గమనించవచ్చు. చాలా సంవత్సరాల క్రితమే రింగ రింగ అక్కడ ఓ రేంజ్‌ లో ఉర్రూతలూగించింది.

తాజాగా సల్మాన్‌ ఖాన్ నటిస్తున్న కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్‌ ని సంగీత దర్శకుడిగా ఎంపిక చేయడం జరిగింది. సింగిల్ కార్డ్‌ అంటూ ఈ సినిమా కోసం దేవి శ్రీ ని సంప్రదించారట. కానీ చివరకు సింగిల్ కార్డ్‌ కాకుండా అన్ని హిందీ సినిమాలకు మాదిరిగానే ఈ సినిమాకు ముగ్గురు నలుగురు సంగీత దర్శకులతో వర్క్‌ చేయిస్తున్నారట.

దేవి శ్రీ ప్రసాద్‌ నుండి కేవలం ఒకే ఒక్క పాటను సల్మాన్ ఖాన్ కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ చిత్ర టీమ్‌ తీసుకున్నారని.. దాంతో రాక్ స్టార్‌ ఫీల్ అయ్యి.. చిత్ర యూనిట్‌ సభ్యులపై రుసురుసలాడుతున్నాడు అంటూ ప్రచారం జరుగుతోంది.

కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ చిత్రం విషయంలో తాను ఫీల్‌ అయినట్లుగా వస్తున్న వార్తలను దేవి శ్రీ ప్రసాద్‌ కొట్టి పారేశాడు. అది నిజం కాదు అన్నట్టుగా కామెంట్స్ చేశాడు.

ఈ మధ్య కాలంలో ఒక మీమ్‌ బాగుందన్న... నిజంగా బాగుందంటే అంటూ సినిమా గురించి చెబుతున్న వ్యక్తి వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి. ఇప్పుడు దేవి శ్రీ ప్రసాద్‌ వ్యాఖ్యలకు ఆ మీమ్‌ బాగా సెట్‌ అవుతుందేమో అంటూ సోషల్‌ మీడియాలో నెటిజన్స్ చర్చించుకుంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.