Begin typing your search above and press return to search.
ధనుష్ తెలుగులో మరో సినిమా చేయబోతున్నాడా?
By: Tupaki Desk | 7 Jan 2023 9:44 AM GMTమునుపెన్నడూ లేని విధంగా తమిళ స్టార్ హీరోలు తెలుగు ఇండస్ట్రీపై ఫోకస్ పెడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఇద్దరు ముగ్గురు కోలీవుడ్ స్టార్స్ తెలుగులో సినిమాలు చేస్తున్నారు. అందులో ధనుష్ మిగతా హీరోలకు మించి ఆసక్తిని చూపిస్తున్నాడు.
తెలుగు, తమిళ భాషల్లో తన సినిమాలు వుండేలా చూసుకుంటున్నాడు. ఇప్పటికే యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా 'సార్' మూవీని ధనుష్ చేస్తున్న విషయం తెలిసిందే.
సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫోర్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఫిబ్రవరి 17న ఈ మూవీని తెలుగు, తమిళ భాషలలో ఏక కాలంలో రిలీజ్ చేయబోతున్నారు. ఇందులో ధనుష్ జూనియర్ లెక్చరర్ గా కనిపించనున్న విషయం తెలిసిందే.
ఇటీవల విడుదల చేసిన టీజర్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. ఇదిలా వుంటే ఈ మూవీతో పాటు ధనుష్ తెలుగులో మరో సినిమాకు శ్రీకారం చుట్టబోతున్నాడు. త్రిభాష చిత్రంగా తెరకెక్కనున్న ఈ మూవీని సెన్సిబుల్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించబోతున్నారు. త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. సైకలాజికల్ థ్రిల్లర్ కథతో ఈ మూవీని రూపొందించబోతున్నారు.
ఇదిలా వుంటే తెలుగులో ముచ్చటగా మూడవ సినిమాకు కూడా ధనుష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సోషల్ మీడియా వేదికగా ఓ ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. ఈ మూవీకి టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించనున్నారట.
శర్వానంద్ హీరోగా నటించిన 'శ్రీకారం' మూవీతో దర్శకుడిగా పరిచయమైన కిషోర్ ఈ మూవీకి దర్శకత్వం వహించనున్నాడని తెలుస్తోంది. ధనుష్.. దిల్ రాజు, శర్వా డైరెక్టర్.. క్రేజీ కాంబినేషన్ లో ఈ మూవీ రానుందన్న మాట. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అఫీషియల్ అప్ డేట్ త్వరలోనే రానుందని తెలుస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.