Begin typing your search above and press return to search.
దిల్ రాజు ప్రయత్నమంతా వృధా ప్రయాసేనా?
By: Tupaki Desk | 14 Jan 2023 12:30 PM GMTదిల్ రాజు.. టాలీవుడ్ లో టాప్ ప్రొడ్యూసర్. తెలుగులో ఎదురు లేని నిర్మాతగా పేరు తెచ్చుకున్నాడు. రాజ్ తరుణ్ నుంచి టాప్ స్టార్ల వరకు అందరితోనూ సినిమాలు నిర్మించి హిట్ లు, సూపర్ హిట్ లు.. బ్లాక్ బస్టర్లని దక్కించుకుని టాలీవుడ్ లో వున్నా టాప్ ప్రొడ్యూసర్ లలో ప్రత్యేకతను చాటుకుంటున్నారు. అలాంటి స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రయత్నమంతా వృధా ప్రయాసే అయిందా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ లో టాప్ ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్న దిల్ రాజు ఈ ఏడాది తమిళ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.
ఆయన నిర్మించిన లేటెస్ట్ మూవీ 'వారీసు'. తమిళ స్టార్ హీరో దళపతి కథానాయకుడిగా నటించాడు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించాడు. తమన్ అందించిన సంగీతం, టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. ఈ మూవీతో తమిళంలోనూ పాగా వేయాలని ప్లాన్ చేసుకున్న దిల్ రాజు హీరో విజయ్ కి పారితోషికంగా రూ. వంద కోట్లకు మించి చెల్లించాడట. జనవరి 11న పొంగల్ సందర్భంగా విడుదలైంది.
తమిళ ప్రేక్షకులకు విజయ్ ని చూపించిన విధానం బాగా నచ్చడంతో ఈ మూవీకి అక్కడ విశేష ఆదరణ లభిస్తోంది. రివ్యూస్ కూడా పాజిటివ్ గానే వచ్చాయి. దీంతో తమిళ నాట ఈ మూవీకి బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లే దక్కుతున్నాయట. ఇదిలా వుంటే ఈ మూవీని తెలుగులో 'వారసుడు' పేరుతో రిలీజ్ చేశారు. తమిళంలో భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేసిన దిల్ రాజు తెలుగు వెర్షన్ కి వచ్చే సరికి హీరో విజయ్ కారణంగా చేతులెత్తేశాడట.
కారణం ఏంటంటే తమిళంలో విజయ్ ప్రమోషన్స్ లో పాల్గొన్నాడే కానీ తెలుగు వెర్షన్ కి వచ్చే సరికి ప్రమోషన్స్ కి ముఖం చాటేశాడు. ఈ విషయంలో విజయ్ ని తెలుగులో ప్రమోషన్స్ కోసం రావాలని దిల్ రాజు ఎంతగా ప్రయత్నించినా వృథా ప్రయాసే అయిందట. విజయ్ తెలుగులో ప్రమోషన్స్ కి రానంటే రానని చెప్పడంతో దిల్ రాజు చేసేది లేక మిగతా నటీనటులతో తెలుగులో ప్రమోషన్స్ ని కానిచ్చేశాడట. దీంతో సంక్రాంతి రేసులో అనుకున్న విధంగా 'వారసుడు' సినిమాకు బజ్ ని దిల్ రాజ్ క్రియేట్ చేయలేకపోయాడని చెబుతున్నారు.
ఓ పక్క వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాల ప్రమోషన్స్ ని హోరెత్తించడంతో సంక్రాంతి రేసులో ప్రధానంగా ఈ రెండు సినిమాల పేర్లే వినిపిస్తున్నాయి. దీంతో 'వారసుడు' సినిమా గురించి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చెప్పుకునే వాళ్లే లేరని తెలుస్తోంది. మరి ఇది సినిమాపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో.. ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో అని ట్రేడ్ వర్గాలు కామెంట్ చేస్తున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.