Begin typing your search above and press return to search.
మెగాస్టార్ ని లాక్ చేసే పనిలో రాజుగారు?
By: Tupaki Desk | 8 July 2022 11:30 AM GMTఇండస్ర్టీకొచ్చిన ఏదర్శకుడికైనా..నిర్మాతకైనా మెగాస్టార్ చిరంజీవితో..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడం అన్నది ఓ డ్రీమ్ గా భావిస్తారు. టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోలుగా ఆ ఇద్దరి లెగస్సీ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆ స్టార్ హీరోలిద్దరితో సినిమా అంటే కోట్ల రూపాయల వ్యాపారం. మెగా ఇమేజ్ తోనే కోట్ల రూపాయల వసూళ్లని కొల్లగొట్ట గల సత్తా ఉన్న నటులు.
అందుకే ఆ ఇద్దరు వెంట దర్శక-నిర్మాతలు పడుతుంటారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎంతో పేరున్న నిర్మాతగా ఖ్యాతి కెక్కిన దిల్ రాజుకే పవన్ కళ్యాణ్ తో సినిమా నిర్మించడానికి కొన్ని సంవత్సరాలు సమయం పట్టింది. ఎన్నో సంవత్సరాల పాటు క్యూ లో ఉండగా 'వకీల్ సాబ్' సినిమాతో నిర్మాణంలో ఛాన్స్ దక్కింది.
అవకాశమే పరమావధిగా భావించిన రాజుగారు ఆ సినిమాని ఎంతో అభిమానించి నిర్మించారు. అలా పీకే తో సినిమా తీయలన్న రాజుగారి కోరిక నెరవేరింది. అయితే అన్నయ్య చిరంజీవితో మాత్రం ఇంకా ఆ ఛాన్స్ రాలేదు. రాజుగారు నిర్మాతగా బీజీ అవుతోన్న తరుణంలో బాస్ చిరంజీవి రాజకీయాల్లో కి ఎంట్రీ ఇవ్వడంతో రాజుగారికి సినిమా చేసే అవకాశం రాలేదు.
చిరంజీవి కంబ్యాక్ అయిన తర్వాత సొంత నిర్మాణ సంస్థలో సినిమాలు చేయడం..ఆయనతో పాటు ఇతర నిర్మాణ సంస్థలు భాగమవ్వడంతో రాజుగారికి అవకాశం ఆలస్యమైంది. అందుకే ఇన్నాళ్లు వెయిట్ చేసిన రాజుగారు ఇక లాభం లేదనుకుని రంగంలోకి దిగేసారు. ఏకంగా చిరంజీవి కోసం ఆరు కథలు పట్టుకుని ఆయన చుట్టూ తిరుగుతోన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఇప్పటికే చిరంజీవి షెడ్యూల్ బీజీగా ఉన్నప్పటికీ..2024 వరకూ క్యాలెండర్ ఫుల్ అయినప్పటికీ వదిలేదే లేదని రాజుగారు భీష్మించుకుని కుర్చున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఆరు కథల్ని సిద్దం చేయించి వాటిని చిరంజీవి దృష్టికి తీసుకెళ్లారుట. ఖాళీ సమయంలో కథలు చదవమని కథా పేపర్లని చిరు చేతుల్లో పెట్టి వచ్చారుట.
వాటిలో ఏది నచ్చితే ఆ కథని డెవలెప్ చేసి వీలైనంత త్వరగా సెట్స్ పైకి తీసుకెళ్లాలన్నది రాజుగారి ప్లాన్ గా కనిపిస్తుంది. రాజుగారు సీన్ లోకి దిగనంత వరకూ. దిగారంటే విడిచిపెట్టరు. పోటీగా ఎంత మంది ఉన్నా? క్యూలో ముందు కనిపించడానికి రాజుగారు ఎంత దూరమైన వెళ్తారు. మరి మెగాస్టార్ ని లాక్ చేసే స్టోరీల్లో ఆ ఆరింటిలో ఏది నిలుస్తుందో చూడాలి.