Begin typing your search above and press return to search.
దిల్ రాజు కావాలని స్క్రీన్స్ గేమ్ ఆడుతున్నాడా?
By: Tupaki Desk | 2 Jan 2023 11:30 AM GMTఈ సంక్రాంతికి విడుదల కాబోతున్న సినిమాల థియేటర్ల విషయమై గత కొన్ని వారాలుగా తెగ ప్రచారం జరుగుతోంది. పండుగ సీజన్ లో డబ్బింగ్ సినిమాలకు థియేటర్లు కేటాయించవద్దని.. కేవలం తెలుగు సినిమాలకు మాత్రమే థియేటర్లు కేటాయించాలి అంటూ నిర్మాతల మండలి ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది.
ఈ సమయంలోనే దిల్ రాజు నిర్మించిన వారసుడు సినిమా విషయంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో మెజార్టీ థియేటర్లు దిల్ రాజు ఆధీనంలో ఉన్నాయి. వారసుడు సినిమా కు ఆయన ఎక్కువ థియేటర్లను కేటాయించుకుంటున్నాడు అంటూ పదే పదే విమర్శలు వచ్చాయి. అన్నట్లుగానే వైజాగ్ లో వాల్తేరు వీరయ్య మరియు వీరసింహారెడ్డి సినిమాల కంటే డబుల్ థియేటర్లను వారసుడు సినిమాకు ఆయన కేటాయించాడు.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ తన సినిమాను కాదని వేరే సినిమాలకు తన థియేటర్లను కేటాయించేంత మంచి మనసు నాది కాదని.. తన సినిమాల తర్వాతే ఇతర సినిమాల గురించి తాను ఆలోచిస్తాను అన్నట్లుగా వారసుడు సినిమాను సాధ్యం అయినంత ఎక్కువ థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లుగా చెప్పకనే చెప్పాడు.
వారసుడు సినిమా వరకు అంటే పర్వాలేదు కానీ ఇప్పుడు ఆయన తునివు సినిమా యొక్క తెలుగు డబ్బింగ్ రైట్స్ ను కూడా కొనుగోలు చేశాడు. ఆ సినిమాను కూడా తెలుగు రాష్ట్రాల్లో భారీగా విడుదల చేయాలని దిల్ రాజు భావిస్తున్నాడు. అదే జరిగితే వారసుడు మరియు తునివు సినిమాలతో పోలిస్తే చిరు.. బాలయ్య సినిమాలకు తక్కువ థియేటర్లు లభించే అవకాశం ఉంది.
దిల్ రాజు తన ఆదిపత్యం కనబర్చేందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు అంటూ కొందరు విమర్శిస్తున్నారు. ముఖ్యంగా మైత్రి మూవీ మేకర్స్ వారు సొంత డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ తెరవడం అనేది దిల్ రాజుకు నచ్చడం లేదని.. అందుకే వారి సినిమాలకు థియేటర్ లు కేటాయించే విషయంలో గేమ్ ఆడుతున్నాడు అంటూ సోషల్ మీడియాలో కొందరు చర్చించుకుంటున్నారు.
ఏ స్టార్ హీరో అయినా తన సినిమా దిల్ రాజు పంపిణీ చేయాలని.. లేదంటే దిల్ రాజు నిర్మాణంలో నటించాలని భావించే విధంగా సంక్రాంతి స్క్రీమ్ ను దిల్ రాజు ఆడుతున్నాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. చిరంజీవి మరియు బాలకృష్ణల సినిమాల విషయంలో కూడా దిల్ రాజు వ్యవహరిస్తున్న తీరుకు ప్రతి ఒక్కరు కూడా అవాక్కవుతున్నారు.
మైత్రి వారితో దిల్ రాజు కోల్డ్ వార్ మొదలు పెట్టాడు అని దీన్ని బట్టి అర్థం అవుతుందని మీడియా సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. ఈ సంక్రాంతి థియేటర్ ల ఆట ఎంత వరకు దారి తీస్తుందో అంటూ సగటు సినీ ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.