Begin typing your search above and press return to search.
అల్లూ కుటుంబానికి మారుతి బంధువా.. అదెట్టా?
By: Tupaki Desk | 25 Dec 2019 7:26 AM GMTసెంటిమెంటు పరిశ్రమలో సక్సెస్ తోనే బంధుత్వం. లేదంటే ఏదీ లేదు. ఎంత దగ్గరైనా చెప్పుకోవడానికి ఎందుకనో నామోషీ పీలవుతారు. అలాంటి రిలేషన్ షిప్స్ ఏవి ఉన్నా కాలక్రమేణా బయటపడుతుంటాయి తప్ప.. దూరపు బంధుత్వాన్ని చెప్పుకుని క్యాష్ చేసుకోవాలనే ఆలోచన అందరూ చేయలేరు. బిల్లారంగ హీరో.. దర్శకుడు మెహర్ రమేష్ మెగా ఫ్యామిలీకి బంధువులు అన్న సంగతి తెలిసిందే. ఈ విషయాలేవి మెహర్ రమేష్ ఏనాడూ మీడియాకు చెప్పలేదు. ఓ సందర్భంలో మెగా బ్రదర్ నాగబాబు మెహర్ గురించి పబ్లిక్ గా చెప్పారు. అప్పుడు కానీ ఎవరికీ పెద్దంతగా తెలీదు. పరిశ్రమలో అంతే! తాజాగా దర్శకుడు మారుతి నిర్మాత అల్లు అరవింద్ సతీమణికి బంధువు అనే సంగతి తెలిసింది. ఈ విషయాన్ని మారుతి ఓ ఇంటర్వూలో వెల్లడించాడు.
2000లో బన్నీతో మారుతికి పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి అరవింద్ ఇంట్లోనే తిరిగేవాడుట. అలా పరిశ్రమని దగ్గర నుంచి చూడటం అలవాటైందన్నాడు. ఉద్యోగం చేసుకుంటూ బన్నీ వాళ్లతో కలిసి తిరిగేవాడుట. అప్పుడే అరవింద్ గారి భార్య తమకు బంధువు అవుతారని తెలిసిందట. ఇక మారుతికి అసలు దర్శకుడయ్యే ఉద్దేశమే లేదు. తరువాత అనుకోకుండా చిరంజీవి గారి ఆఫీస్ లో పనిచేయడంతో ...మారుతిలో ట్యాలెంట్ గుర్తించి నీలో క్రియేటిటీ ఉంది. నీలో దర్శకుడున్నాడు.. ట్రై చేయ్ అని ప్రోత్సహించారట. అలా సినీజర్నీ కొత్తగా ప్రారంభమైందని మారుతి రివీల్ చేసాడు.
అప్పుడే బస్టాప్ కథ రాసానని..ఆ సినిమాతోనే తన ప్రపంచాన్ని సృష్టించుకున్నానని అన్నాడు. అయితే మారుతి ఓ విషయాన్ని విస్మరించాడు. మారుతికి దర్శకుడిగా తొలి సినిమా ఈరోజుల్లో. ఆ సినిమా సహా బస్టాప్ లో డబుల్ మీనింగ్ డైలాగులు.. అడల్ట్ కంటెంట్ తో తెరకెక్కించడంతో విమర్శలొచ్చాయి. దీంతో మారుతిపై ఓ తరహా దర్శకుడు అనే ముద్ర పడింది. తర్వాత కొన్ని క్లీన్ ఎంటర్ టైనర్లు చేసి ఆముద్రను చెరిపేసుకునేందుకు హార్డ్ వర్క్ చేశాడు. అయితే మారుతి ఆ ఇంటర్వ్యూలో ఈరోజుల్లో సినిమా గురించి ప్రస్థావించలేదు ఎందుకనో!