Begin typing your search above and press return to search.

అది ద‌ర్శ‌కుడి త‌ప్పిద‌మేనా?

By:  Tupaki Desk   |   2 Aug 2022 12:30 AM GMT
అది ద‌ర్శ‌కుడి త‌ప్పిద‌మేనా?
X
ఏదైనా ఒక సినిమా రిలీజ్ కు ముందు, త‌రువాత‌ ప్రేక్ష‌కుడికి చేరువకావాలంటే మ్యూజిక్ ప్ర‌ధాన పాత్ర పోషిస్తూ వుంటుంది. సినిమా కంటెంట్‌లో కాస్త ద‌మ్మున్నా బీజిఎమ్స్ తో భారీగా ఎలివేష‌న్ ఇచ్చేసి సినిమాకు బ‌జ్ ని క్రియేట్ చేస్తుంటారు. రీసెంట్ గా విడుద‌లైన చాలా సినిమాలు ఇదే విష‌యాన్ని ప్రూవ్ చేశాయి. కంటెంట్ వున్న పుష్ప‌, RRR, కేజీఎఫ్ 2 సినిమాల‌కు మ్యూజిక్ డైరెక్ట‌ర్స్ అందించిన‌ బీజిఎమ్స్ ఓ రేంజ్ లో హైప్ ని క్రియేట్ చేసి ఆడియ‌న్స్ కి గూస్ బంప్స్‌ తెప్పించాయి.

రీసెంట్ గా విడుద‌లై సంచ‌ల‌న విజయాన్ని సొంతం చేసుకున్న 'విక్ర‌మ్‌' సినిమాకు అనిరుధ్ అందించిన నేప‌థ్య సంగీతం ఏ రేంజ్ లో ప్లస్ అయిందో సినిమా విజ‌యంలో ఎలాంటి కీల‌క పాత్ర పోషించిందో తెలిసిందే. అంత‌టి ఇంపాక్ట్ ని క‌లిగించే నేప‌థ్య సంగీతం తాజాగా ఓ క్రేజీ మ్యూజిక్ డైరెక్ట‌ర్ నుంచి రాక‌పోవ‌డం ఇప్ప‌డు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టించిన యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ 'రామారావు ఆన్ డ్యూటీ'. ఈ సినిమాకు సామ్ సీఎస్ సంగీతం అందించాడు.

శ‌ర‌త్ మండ‌వ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఇటీవ‌లే విడుద‌లై డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది. ఇందులో సామ్ సీఎస్ మ్యూజిక‌ల్ మార్క్ ఎక్క‌డా క‌నిపించ‌లేదు. కేవ‌లం రెండు పాట‌లల్లో మాత్ర‌మే త‌న మార్కుని చూపించినా అవి పెద్ద‌గా పాపుల‌ర్ కాలేక‌పోయాయి.

ఇక నేప‌థ్య‌ సంగీతం అందించ‌డంతో మంచి పేరున్న సామ్ సీఎస్ ఈ సినిమాకు చాలా పేల‌వ‌మైన బీజిఎమ్స్ ని అందించాడు. విక్ర‌మ్ వేద‌, ఖైదీ, 'అర్జున్ సుర‌వ‌రం' వంటి చిత్రాల‌ని త‌నదైన బ్రాగ్రౌండ్ స్కోర్ తో ఎలివేట్ చేసిన సామ్ సీఎస్ 'రామారావు..' విష‌యంలో మాత్రం త‌న డ్యూటీని స‌క్ర‌మంగా చేయ‌లేద‌నే కామెంట్ లు వినిపిస్తున్నాయి.

క్రేజీ మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా పేరు తెచ్చుకున్న సామ్ సీఎస్ నుంచి ఈ త‌ర‌హా అవుట్ పుట్ ని ఊహించ‌ని వారు ప్ర‌స్తుతం కామెంట్ లు చేస్తున్నారు. అయితే రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ లో త‌మిళ సిరీస్ 'సుజ‌ల్ ' విడుద‌లైంది. దీనికి సామ్ సీఎస్ అందించిన నేప‌థ్య సంగీతం హైలైట్ గా నిలిచి ఈ సిరీస్ స‌క్సెస్ లో ప్ర‌ధాన భూమిక‌ని పోషించింది. ఇది గ‌మ‌నించిన వారంతా సామ్ సీఎస్ లో టాలెంట్ వుంద‌ని, అయితే దాన్ని క‌రెక్ట్ గా వాడుకోలేద‌ని అంటున్నారు.

అంతే కాకుండా సామ్ సీఎస్ నుంచి త‌న‌కు కావాల్సిన అవుట్ పుట్ ని రాబ‌ట్టుకోవ‌డంలోనూ, అత‌నికి స‌రైన గౌడెన్స్ ని ఇవ్వ‌డంతోనూ ద‌ర్శ‌కుడు శ‌ర‌త్ మండ‌వ ఫెయిల్ అయ్యాడు కావ‌ట్టే 'రామారావు ఆన్ డ్యూటీ' నేప‌థ్య సంగీతం సో సోగా వుంద‌ని సెటైర్లు ప‌డుతున్నాయి. ఇది ముమ్మాటికీ ద‌ర్శ‌కుడి త‌ప్పిద‌మేన‌ని, ఆ విష‌యంలో షామ్ సీఎస్ ని త‌ప్పు ప‌ట్టాల్సిన ప‌ని లేద‌ని అత‌నికి స‌పోర్ట్ గా నిలుస్తున్నారు.