Begin typing your search above and press return to search.

#ChaiSam : సామ్‌ సినిమా ఆఫర్లకు విడాకులకు సంబంధం ఉందా?

By:  Tupaki Desk   |   4 Oct 2021 12:30 PM GMT
#ChaiSam : సామ్‌ సినిమా ఆఫర్లకు విడాకులకు సంబంధం ఉందా?
X
నాగ చైతన్య సమంతల విడాకుల విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇద్దరి విడాకులకు కారణం ఏంటీ అనేది ఒకొక్కరు ఒక్కో విధంగా విశ్లేషిస్తున్నారు. ఈ విషయంలో కొందరు అయితే శాస్త్రవేత్తల మాదిరిగా లోతుగా ఆలోచిస్తూ అధ్యయనం చేస్తూ విశ్లేషిస్తున్నారు. కొందరి విశ్లేషణలు చూస్తుంటే నిజమేనేమో అనిపిస్తుంటే కొందరి విశ్లేషణలు మరీ సిల్లీగా ఉన్నాయి. మొత్తానికి వారి కారణాలు వారికి ఉన్నాయి. అవి ఏంటీ అనేది ఇప్పుడే కాదు ఎప్పటికి తెలియక పోవచ్చు. సామ్ మరియు చైతూలు విడిపోవడానికి కారణం సమంత వ్యవహారం అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. అందులో ఎంత వరకు నిజం ఉన్నది అనేది పక్కన పెడితే కొందరు చేస్తున్న విశ్లేషణ మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంది. సమంత సినీ కెరీర్‌ కారణంగానే విడాకుల వరకు వెళ్లారని.. ఇద్దరు కూడా ఆవిషయంలో భేదాభిప్రాయాలు కలిగి ఉన్నారు అనే అభిప్రాయంను చాలా మంది తమ వ్యక్తిగత అభిప్రాయంగా వ్యక్తం చేస్తూ ఉన్నారు.

సోషల్‌ మీడియాలో ప్రముఖంగా జరుగుతున్న ప్రచారం ప్రకారం సమంత పెళ్లి అయినప్పటి నుండి సినిమాల సంఖ్య తగ్గించింది. అయితే సినిమాల సంఖ్య తగ్గించింది అంటూ మనం అనుకున్నాం.. కాని ఇండస్ట్రీ వర్గాల వారు ఆమెను పెళ్లి అయిన తర్వాత దూరం పెట్టారు. సినిమా ఇండస్ట్రీలో ముఖ్యంగా టాలీవుడ్‌ మరియు కోలీవుడ్‌ ల్లో పెళ్లి అయిన హీరోయిన్‌ కు ఆఫర్లు తగ్గుతాయి. సమంత పెళ్లి అయిన నాలుగేళ్ల కాలంలో చేసిన పెద్ద సినిమా రంగస్థలం ఒక్కటే. ఆ సినిమా లో సమంత నటన కు మంచి మార్కులు పడ్డాయి. రామ్‌ చరణ్ తో నటించిన ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అయినా కూడా ఆమెకు స్టార్ హీరోలకు జోడీగా నటించే అవకాశాలు మాత్రం రాలేదు. ఆమె వద్దనుకుందేమో అని అంతా అనుకున్నా కూడా పెళ్లి అయిన తర్వాత పెద్ద సినిమాలు వద్దు అనుకుంటే రంగస్థలం ఎలా చేసింది. అందుకే ఆమెకు ఆఫర్లు రాలేదు. పెద్ద సినిమాల్లో ఆఫర్లు తగ్గడంతో పాటు ఇతర కారణాలు కొన్ని ఉండటం వల్లే ఆమె విడిపోయేందుకు సిద్దం అయ్యింది అనేది వారి విశ్లేషణ సారాంశం.

సమంత నిర్ణయాన్ని చైతూ కూడా సమర్థించాడు. ఆమె దారిలో నడిచేందుకు పూర్తి స్వేచ్చను ఇచ్చాడు. స్టార్ హీరోలతో నటించే అవకాశం వస్తే ఖచ్చితంగా చైతూ ఆమెకు సహకరించేవాడు. కాని ఆమెకు అసలు ఆఫర్లు తగ్గాయి అని అందుకే కెరీర్‌ కోసం చైతూతో సమంత బ్రేకప్‌ అవ్వాలి అనుకుందని.. అలా బ్రేకప్‌ అయ్యేందుకు గాను నాగ చైతన్య కూడా పూర్తిగా ఓకే చెప్పి ఉంటాడు అని కొందరి భావన. మొత్తానికి ఇద్దరు విడి పోవడం వెనుక ఇది కూడా ఒక కారణం అయ్యి ఉండవచ్చు అని చాలా మంది నమ్ముతున్నారు. మరి వారి కారణం ఏంటీ అనేది మాత్రం వారు నోరు విప్పి చెప్తే కాని తెలియదు. సమంత మరియు నాగ చైతన్యలు విడిపోయినా కూడా ఆల్‌ టైమ్‌ బ్యూటీఫుల్‌ క్యూట్ కపుల్‌ గా పేరు దక్కించుకున్నారు.