Begin typing your search above and press return to search.

ఫేవ‌రెట్ హీరోయిన్ టాప్ సీక్రెట్ దాస్తోందా?

By:  Tupaki Desk   |   21 Oct 2020 11:30 PM GMT
ఫేవ‌రెట్ హీరోయిన్ టాప్ సీక్రెట్ దాస్తోందా?
X
భూమిక చావ్లా టాలీవుడ్ లో అగ్ర నాయికగా ఓ వెలుగు వెలిగిన సంగ‌తి తెలిసిందే. అయితే కాల‌క్ర‌మంలో భ‌ర‌త్ ఠాకూర్ ని పెళ్లాడి అటుపై సినిమా నిర్మాణంలోకి ప్ర‌వేశించారు. ఆ త‌ర్వాత ర‌క‌ర‌కాల స‌న్నివేశాలు త‌న‌కు నెగెటివ్ గా మారిన సంగ‌తి విధిత‌మే. గ‌తం గ‌తః అనుకుంటే.. చిత్ర పరిశ్రమలో ర‌క‌ర‌కాల‌ గాసిప్స్ భూమిక‌ను ఇబ్బంది పెట్టాయి. అందులో భ‌ర్త నుంచి విడిపోయారన్న ప్ర‌చారాన్ని అభిమానులు జీర్ణించుకోలేక‌పోయారు.

2007 లో తన యోగా గురువు భారత్ ఠాకూర్‌ను వివాహం చేసుకున్న భూమికా చావ్లా ఇటీవలి కాలంలో తన భర్త చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయక‌పోవ‌డంపై ర‌క‌ర‌కాల సందేహాలు వ్య‌క్త‌మ‌య్యాయి. దీంతో భూమికా తన భర్తకు విడాకులు ఇచ్చినట్లు గాసిప్ ‌లు వినిపించాయి. అయితే అవ‌న్నీ పుకార్లు మాత్ర‌మేన‌ని క్లారిటీనిస్తూ భూమిక ఇటీవ‌ల త‌న భ‌ర్త ఫోటోని షేర్ చేశారు. ఇటీవల ఆమె తన వివాహ వార్షికోత్సవం సందర్భంగా భరత్ ఠాకూర్‌ను శుభాకాంక్షలు చెప్ప‌డంతో అభిమానుల‌కు క్లారిటీ ఇచ్చేసిన‌ట్ట‌య్యింది.

ఇక భ‌ర్త‌తో క‌లిసి భూమిక నిర్మించిన త‌కిట త‌కిట డిజాస్ట‌ర్ అవ్వ‌డం త‌న కెరీర్ లో జీర్ణించుకోలేనిది. చిత్ర‌నిర్మాత‌గా ప‌రిశ్ర‌మ‌లో నిల‌దొక్కుకోవాల‌ని చూసినా దుర‌దృష్టం వెన్నాడింది. ఆ సినిమాతో ఆర్థికంగా న‌ష్ట‌పోవాల్సి వ‌చ్చింద‌ని ప‌రిశ్ర‌మ‌లో గుస‌గుస‌లు వినిపించాయి. అయితే ఇటీవలే భూమిక న‌టిగా తన రెండవ ఇన్నింగ్స్ ను ఎంసిఎతో ప్రారంభించారు. నాగ‌చైత‌న్య స‌వ్య‌సాచిలోనూ న‌టించిన సంగ‌తి తెలిసిన‌దే. ప్ర‌స్తుతం వ‌రుస‌గా సినిమాల్లో నటిస్తూ బిజీ అయిపోయారు. సోషల్ మీడియాలో తన ఆకర్షణీయమైన చిత్రాలను పంచుకుంటూ అభిమానుల‌కు ట‌చ్ లో ఉన్నారు.